Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) పథకాన్ని ప్రకటించిన తర్వాత ఇప్పటివరకూ దాదాపు 70వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ పి.కె.పూర్వార్ తెలిపారు. మొత్తం 1.50లక్షల ఉద్యోగుల్లో లక్షమంది వరకూ వీఆర్‌ఎస్‌కు అర్హులు కాగా, వీరిలో 77వేల మందిని వీఆర్‌ఎస్ కింద పంపాలని బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రకటించిన ఈ పథకం జనవరి 31, 2020 వరకూ అందుబాటులో ఉంటుంది.
‘‘వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 70వేలకు చేరింది. ఉద్యోగుల నుంచి విశేష స్పందన వస్తోంది’’ అని పూర్వార్ తెలిపారు. మరోపక్క ఉద్యోగులను వీఆర్‌ఎస్ కింద పంపిస్తే రోజువారీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యాన్ని టెలికాం విభాగం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజీల్లో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని నిర్దేశించింది.