Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: ఇసుక కొరతపై 14న ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్షను నిర్వహిస్తామని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలియజెప్పడానికే ఇసుక దీక్షను చేపట్టామన్నారు. 14వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. చంద్రబాబు దీక్ష ఏర్పాట్లపై టీడీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడారు. రాజశేఖరరెడ్డి విలువైన ఆస్తులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి అన్ని ఆస్తులు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగన్ తన పాలన కోసం తెలుగును చంపేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ బోధనపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.