Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆర్ఎక్స్ 100ఫేం కార్తికేయ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు చావు కబురు చల్లగా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో..బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి పైన పటారం..ఈడ లోన లొటారం అంటూ సాగే ఐటం సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో అందాల తార అనసూయ ఎర్ర చీరలో ఇరగదీసే మాస్ స్టెప్పులేసి అదరగొడుతోంది. ప్రోమోనే ఇలా ఉందంటే ఫుల్ సాంగ్‌లో అనసూయ డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోతారనిపిస్తోంది. ఆ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తుండగా, లావణ్య అనే మల్లిక పాత్ర అనే రోల్‌లో నటిస్తోంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. సమ్మర్‌కు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.