Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆరుగాలం కష్టంచి పండంచిన పంటకు ధర రాక ఉసూరుమంటున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యపారులు, దళారుల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. శనగకు మద్ధతు ధర రూ.5,100 ఉంది. నిజంగా మద్ధతు ధరకు కొన్నా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో మద్ధతు ధర రాకపోగా క్వింటాల్ కు రూ. 700 నుంచి వెయ్యి వరకు తక్కువ చేసి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఈ దఫా 3.43 లక్షల ఎకరాల్లో శనగ పండించారని, ప్రస్తుతం పంట చేతికి వస్తోందని, పదిహేను రోజులుగా రైతులు పంటను అముకానికి పెడుతున్నారని ఆయన తెలిపారు. మార్క్ ఫెడ్ జోక్యం లేకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు వచ్చిన కాడికి పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దళారుల దగాను తట్టుకోలేక నిన్న నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారని ఆయన పేర్కొన్నారు.