Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎం బృందంలో వీరిద్దరే కాకుండా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణ్ కూడా ఉన్నారు. కాగా, ఢిల్లీలో సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఏపీలో ఇటీవలి పరిణామాలతో పాటు పలు అంశాలపై అమిత్ షాతో ఆయన చర్చిస్తారు. ముఖ్యంగా ఆలయాలపై దాడుల ఘటనలపై ఆయనకు వివరిస్తారని తెలుస్తోంది. అటు, కేంద్ర బడ్జెట్ రూపొందుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి పెండింగ్ నిధుల విడుదల, ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలున్నాయి.