Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మతోన్మాద ఎజెండాతో ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, ఎంఐఎంలను ఓడించాలనీ, వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలని ఓటర్లకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ ను ఆ రెండు పార్టీలు మతోన్మాద ఎజెండాతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎం విమర్శలు చేసుకుంటూ పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. మతాల మధ్య విభజన ప్రజలకు మంచిది కాదని, ఈ చర్యలతో లౌకిక పునాది దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు దీన్ని అర్ద చేసుకోవాలని కోరారు.