Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ తన కొత్త సినిమా పేరు 'కార్పొరేటర్' గా అనౌన్సు చేశాడు జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్. టైటిల్, పోస్టర్ ను చూస్తుంటే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ నేపధ్యంలో ఈ మూవీ రూపొందుతోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. దాదాపుగా రెండు పాటలు తప్ప సినిమా అంతా ఫినిష్ అయిపొయింది. ఈ సినిమా ద్వారా సంజయ్ పూనూరి దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాలో షకలక శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం.ఎల్.పి.రాజా సంగీతం అందిస్తున్నారు.