Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాలనే ఉద్దశంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్టీజీఎస్) సేవలను రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తీసుకుంది. రేపటి నుండి ఆర్‌టీజీఎస్ సేవలు బ్యాంకు ఖాతాదారులకు నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదికూడా పనిదినాల్లో మాత్రమే ఈ సేవలను పొందగలుగుతారు. కనీసం రూ. 2 లక్షల మొత్తాన్ని ఆర్‌టీజీఎస్ విధానం ద్వారా పంపించాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పద్ధతుల్లో డబ్బు పంపేందుకుగానూ ఎలాంటి చార్జీలూ లేకుండా ఆన్‌లైన్‌లో పంపించుకోవచ్చు. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. అయితే బ్యాంకుకు వెళ్ళే నగదు బదిలీ చేయాలని భావిస్తే మాత్రం చార్జీలను చెల్లించుకోవాల్సి ఉంటుంది.