Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ భారీ గ్రహశకలం భూమికి మీదకు దుసుకోస్తుంది. దీంతో భూమికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఇది దుబాయ్ లోని ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా అంత సైజులో ఉందట. ఉల్కలు, గ్రహశకలాల వల్ల 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే భూమికి ప్రమాదం ఉంటుందని నాసా అంచనా వేసింది. నాసాకు చెందిన ప్రొపల్షన్ ల్యాబరేటరీ వెబ్ సైట్ ప్రకారం ఈ గ్రహశకలాన్ని 2000లో గుర్తించారు. 800 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంది. ఎక్కువగా మంచు, దూళి కణాలతో నిండి ఉంది. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా... దీని ధూళి విచ్చిన్నం అవుతూ ఉంటుంది. భూమికి ఎప్పటికైనా డేంజరే అని భావించే గ్రహశకలాల లిస్టులో దీన్ని కూడా చేర్చారు. తాజా అంచనా ప్రకారం ఈ ఆస్టరాయిడ్ భూమికి దాదాపు 43 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లబోతోంది. ఈ దూరం భూమి, చంద్రుడు మధ్య దూరం కంటే ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూ కక్ష్యలో లక్షల కొద్దీ చిన్నా పెద్దా గ్రహశకలాలున్నాయి. అవి ఒక మీటర్ కంటే ఎక్కువ వ్యాసాన్ని కలిగి లేవు. అందువల్ల అవి భూమిని తాకినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. ఏదైనా గ్రహశకలం 500 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటే... అది భూమిని ఢీకొంటే విపత్తు తప్పదు.