Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో కరెంట్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలం రజాక్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో గడ్డి మేస్తున్న ఎద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 వేల ఆస్థినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంది.