Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైఫల్యానికి నిదర్శనం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

వైఫల్యానికి నిదర్శనం

భారతీయ జనతా పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం 'ఆడలేక మద్దెల..ఓడు' అన్నట్టు ఉంది. ఏడు సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తరువాత ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి రోజున చెప్పుకోవడానికి ఎన్ని విషయాలు ఉంటాయి? సాధించిన విజయాలు, పొందిన కితాబులు, వర్తమానపు నడత, భవిష్యత్తు లక్ష్యాలు .. ఇలా ఎన్నో! కానీ, మోడీ ప్రసంగంలో ఇవేమి లేవు ఎందుకు? 'పండగ రోజున కూడా...' అన్నట్టు ప్రతిపక్షాలపై అవాకులు చవాకులకే పరిమితం కావడం... పరనిందతోనే సరిపుచ్చడం, అట్టహాసంగా జరుపుకోవాల్సిన వ్యవస్థాపక దినోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్‌తో సరిపుచ్చడం దేనికి సంకేతం? ఇలా నిరాడంబరంగా జరుపుకోవడం బీజేపీ సాంప్రదాయమేమి కాదు. పోనీ కరోనా వ్యాప్తితో జాగ్త్రతలు పాటించారను కుందామంటే, వేలాదిమందితో నిర్వహిస్తున్న ఎన్నికల సభలు షరా మామూలుగానే జరుగుతున్నాయి. మరి, ఇన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తరువాత ఇంత సాదాసీదాగా వ్యవస్థాపక దినోత్సవం ఎందుకు గడిచిపోయింది?
నిజానికి ఏడేండ్ల పాలనలో మోడీ సర్కారు సాధించింది పెద్ద గుండుసున్నా! చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విజయమూ లేదు. వేళ్ల మీద లెక్కించగలిగిన కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజానీకానికి మోడీ పాలన ఒరగబెట్టిందేమీ లేదు. మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌.. ఇలా పేరేదైనా పేదలను కొట్టి పెద్దలకు పంచడమే ఈ కాలమంతా సాగింది! బ్లాక్‌మనీని దేశానికి తీసుకురావడం, అవినీతిని రూపుమాపడం, పేదల బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్‌ చేయడం, ఉద్యోగ కల్పన ఇలా అమలుకాని వాగ్దానాల జాబితా బారెడు! నిరుద్యోగం, ఆకలి, అభద్రత వంటి అంశాల్లో ర్యాంకు పెరిగినప్పటికీ అవి మైనస్‌ మార్కులే! ఇక నోట్లరద్దు, ఎన్‌ఆర్‌సీ వంటి మోడీ మార్కు చర్యలు దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పడ్డ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వలస కార్మికుల వేదనాభరిత పాదయాత్రలు, అవి చెప్పిన కన్నీటి కథలను జనం ఎలా మరచిపోగలరు? చెప్పుకోవడానికి ఇవేమి ఘనతలు కావుకదా! ఇక మిగిలిందేమిటి? దేశవ్యాప్తంగా మేధావులు, రచయితలు, కళాకారులు వంటి ప్రజాతంత్ర శక్తులపె జరిగిన దాడుల నిరంకుశ పోకడలు. గో గూండాలు సృష్టించిన బీభత్సం. విశ్వవిద్యాలయాలను మతోన్మాదానికి వేదికలుగా మార్చడం. విజ్ఞాన శాస్త్రంపై దాడి చేసి అభూతకల్పనలు, కట్టుకథలతో పాఠ్యాంశాలను నింపడం! మహిళలు, మైనార్టీలు, అణగారిన వర్గాల గొంతును అమానుషంగా నులిమివేయడం..! వీటి గురించి ఏమని చెప్పుకోగలదీ ప్రభుత్వం? అందుకే..మోడీ వ్యవస్థాపక దినోత్సవం రోజునా ప్రతిపక్షలపై విషం గక్కారు. దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రను ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో చెప్పకుండా నూతన వ్యవసాయ చట్టాలను, సీఏఏను, కార్మిక చట్టాలను ఆయన ప్రస్తావించారు. వాటి వలన రైతులకు, కార్మికులకు, సామాన్య పౌరులకు కలిగిన ప్రయోజనం ఏమిటో చెప్పగలిగారా? లేదు. నిజానికి ఒకపక్క మోడీ తన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం కొనసాగిస్తున్నప్పుడే మరోపక్క యూపీ, రాజస్థాన్‌, హర్యానాల్లో ఆ పార్టీ ఎంపీలను రైతులు ఛీత్కరించి మళ్లీ తమ ఊళ్ల వైపు రావొద్దని చెప్పారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? కార్మికుల మధ్యకు వెళ్లినా అదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. విశాఖ ఉక్కు ఉద్యమకారుల దగ్గరకు వెళ్లి కార్మికులకు సమాధానం చెప్పుకోలేక అప్పటి నుంచీ మొహం చాటేసిన బీజేపీ నేతల ప్రహసనం మనందరికీ ఎరుకే! దానికి బదులుగా అవాస్తవాలను ప్రచారం చేయడానికి మోడీ పూనుకుంటున్నారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవంటారు కదా..! కమలనాథులను దేశ రాజకీయ చిత్ర పటం నుంచి పూర్తిగా తుడిచిపెడితేగానీ తిమ్మిని బమ్మి చేసే టక్కుటమార గారడీల నుండి ప్రజలకు విముక్తి లభించదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విలయం
ప్రభుత్వాలకు ఇది తగునా?
విభజన రాజకీయాల్లో బెంగాల్‌
ఈ ఆగడాన్ని తిప్పికొట్టాలి
తలొగ్గిన కేంద్రం
''ఉత్తుత్తి ఉత్సవం''
ఆశ
బలిదానాలొద్దు...
ఎన్నికలుంటే ఎంత బాగుంటుందీ...
ప్రమాదఘంటికలు
ప్రచార తంత్రం
అమ్మ
అభివృద్ధిలో ''ఆమె'' ఎక్కడ?
సహేతుకత ఏదీ?
నిరుద్యోగ రక్కసి
అబద్ధమూ ఓ కళే!
బంతాట!
భౌతిక భక్తి
అందని టీకా
కేరళ ఎన్నికలలో రాజకీయ దుష్ట త్రయం
మానని లాక్‌డౌన్‌ గాయాలు
ఢిల్లీకి సంకెళ్లు
మోడీ బ్రాండ్‌ ''సవ్య సాచిత్వం!''
కవనలోకం
''ఫీడింగ్‌''కు సీడింగ్‌ అడ్డు!
లోగుట్టు కేసీఆర్‌ కే ఎరుక!?
అమెరికా ప్రమాదకర వ్యూహం - క్వాడ్‌
అంగట్లో దేశం..
''లోకల్‌'' పాలిట్రిక్స్‌
డబ్బు

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.