Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గోదావరి నది తెలంగాణాలో ఎన్నిజిల్లాల్లో ప్రవహిస్తుంది? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 29,2020

గోదావరి నది తెలంగాణాలో ఎన్నిజిల్లాల్లో ప్రవహిస్తుంది?

సీనియర్‌ ఇంటర్‌ సివిక్స్‌-ముఖ్యమైన రెండు మార్కుల ప్రశ్నలు
గౌతమి పుత్ర శాతకర్ణి
శాతవాహన రాజుల్లో 23వ రాజు. అత్యంత పరాక్రమవం తుడు. సమర్ధుడు. సువిశాల సామ్రాజ్య నిర్మాతగా పేరు పొందాడు. ఇతని విజయాలును గురించి నాసిక్‌, కార్ణి శాస నాలు ద్వారా తెలుసుకోవచ్చు. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్‌ శాసనంలో తన కుమారున్ని క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదుతో వర్ణిస్తుంది. ఇదే శాసనంలో అసిక, అశోక, మూలక, సూరత, కకూర, పరాంత, అకార, అవంతి విదర్భ రాజ్యాలకు అదిపతి అని పేర్కొంది. అతడిని వొకబ్రహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన, మార్తన, త్రిసముద్ర తోయపీతవాహన, శాతవాహన కుల యశ ప్రతిష్టావనకార, వర్ణ సౌకర్య, నిరోదక బెణాతస్వామి మొదలైన బిరుదులు కలవు.
గుణాడ్యుడు
బృహత్‌కథను పైశాచి ప్రాకృతంలో రాసాడు ఈ గ్రంథం సంస్కృతం లోని కథానిక సాహిత్యానికి, సోమదేవుని కదా సరిత్సాగరం అనే గ్రంధానికి ఆధార గ్రంథం. శాతవాహ నులు ప్రాకృతం, సంస్కృతం వాడినట్లు ఈ గ్రంథంలో పేర్కొన్నాడు.
తెలంగాణలోని బౌద్ధ స్థూపాలు
తెలంగాణలో బౌద్ధ స్థూపాలు నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి, కరీంనగర్‌లోని కోటిలింగాల, పెద్దబంకూర్‌, దూళికట్ట మొదలైన ప్రాంతాలో ఉన్నాయి. స్థూపాలు, సమాదులే కాకుండా బౌద్ధుల ఆరాధ్య కేంద్రాలున్నాయి. ధ్యానం, యోగ, బౌద్ధ బిక్షువులు చేసుకునేవారు. స్థూపం అనేది ఇటుకలతో గాని, రాతితోగాని, మట్టితో గాని నిర్మించిన గుండ్రని కట్టడం. దీనికి చత్రం ఉంటుంది.
హలుడు
శాతవాహనులలో 17వ రాజు ఇతడు పాకృతంలో గాధా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. దీనిలో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి. ఇతనికి కవిరాజు, కవివత్సలుడు అనే బిరుదులు కలవు. ఇతని కాలాన్ని ప్రాకృతానికి స్వర్ణయుగం అంటారు.
నాసిక్‌ శాసనం
గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ. ఈమె తన కుమా రుడి విజయాలకు గుర్తుగా నాసిక్‌ శాసనం వేయించింది. ఈ శాసనంలో కుమారుడిని క్షహనాట వంశ నిరవశేషకర అనే బిరుదుతో వర్ణిచింది. శక, యవన, ప్రహ్లద, అనిక, యశోక, మూలక, సూరత, శకూర పరాంత ఆకార అవంతి విదర్భ ప్రాంతాలకు అధిపతిగా పేర్కొంది.
వశిష్టి పుత్ర శ్రీ శాంతమూలుడు
ఇక్ష్వాకు వంశీయులలో మొట్ట మొదటి రాజు శ్రీశాంత మూలుడు (180-193). అశ్వమేద వాజపేయ, రాజసూయ యాగాలను నిర్వహించి తన స్వతంత్రతను చాటుకున్నాడు. వైదిక మతాభిమాని. కార్తికేయుని భక్తుడు. రెంటాల, దాచేపల్లి, కేశనాపల్లి మొదలగు శాసనాలను వేయించాడు. ఈ శాసనాల్లో తన కుటుంబీకుల గురించి వివరించాడు. వ్యవసాయాభివృద్ధి కోసం బంగారు నాణాలను, లక్షల కొద్ది గోవులను, నాగళ్ళను, భూములను దానంగా ఇచ్చాడు. అందువల్లే ఇతనిని శత సహస్రహాలక, మహాదానపతి అంటారు.
ఇంద్ర భట్టారకుడు
విష్ణుకుండీన వంశపురాజు(క్రీ.శ. 528-555) ఇతని కాలం ఎంతో ఆసక్తి కరమైంది. ఇతను గుంటూరు ప్రాంతంలో తన ఆదిపత్యాన్ని, తన గొప్ప తనాన్ని తెలియజేశాడు. ఇతనిపై తిరగబడిన గంగా పృతృమూల (దుర్జయ) రాయకశ్యపుల రాజు కూటమిని అణిచివేశాడు. ఇతడు. నిర్విరామంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో మౌఖరి రాజైన ఈశనమ్మ చేతిలో పరాజం పాలై యుద్ధ భూమిలో మరణించాడు.
నరసింహా-2
ఇతను వేములవాడ చాళుక్య రాజు (915-930) రాష్ట్ర కూట రాజైన ఇంద్ర-3కు పరాక్రమవంతుడైన సామంత రాజు. ఇతను అనేక విజయాలు సాధించి యమునా నది ఒడ్డున కళాప్రయ అనే ప్రదేశంలో ఒక విజయస్థూపాన్ని స్థాపించాడు. ఇతని ధైర్య శౌర్యాలను చూసి ముచ్చట చెంది రాజైన ఇంద్ర-3 తన సోదరి జకల్సినిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా నరసింహ -2 కాలంలో వేముల వాడ చాళుక్యుల ప్రచారం జరిగింది.
చాళుక్యుల పాలన విధానం
చాళుక్యులు తెలంగాణ ప్రాంతంలో 50-70 గ్రామాల సమూహంలో కూడిన రాష్ట్రాలు, విషయాలు, భక్తులుగా విభజించి పరిపాలించారు. రాష్ట్ర విషయవలి, బోగపతి పరి పాలన నిర్వర్తించేవారు. గ్రామాలలో గ్రామాధికారులైన నల్ల వుండా/ గవుండా సహకారంతో పరిపాలన సాగించేవారు.
బౌద్దమతానికి ఇక్ష్వాకులు చేసిన సేవ
ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతంలో చాల ప్రాచుర్యం పొందింది. రాజులకంటే రాణులు ఈ మతాన్ని పోషించారు. వారు బుద్ధుని పరమాత్మునిగా అతని వల్లనే కీర్తి ప్రతిష్టలు కలుగునని నమ్మారు. ఆ నమ్మకంతోనే నాగర్జున కొండ, నేలకొండపల్లి(ఖమ్మం), అరుపు నందికొండ (నల్గొండ) మొదలైన ప్రాంతాలలో చాలా విహారాలు, చైత్యాలు, స్థూపాలు నిర్మించారు.
రెండో మాధవ వర్మ
విష్ణుకుండీన రాజు(464-502) గోదావరి నదీతీరాన గల శాలంకాయనులను ఓడించి వెంగిని ఆక్రమించాడు. పదకొండు అశ్వమేదయాగాలు, అగ్నిహోమాలు, హిరణ్యగర్భ యాగాలు చేశాడు. ఇతన్ని జనాశ్రయ అనే బిరుదు కలదు. ప్రజాదరణ పొందిన రాజు. మంచి పరిపాలన దక్షుడు. ప్రజలందరికీ సమన్యాయం అందించేవాడుగా ప్రజలు కీర్తించేవారు. తన కుమారుడికి సైతం మరణశిక్ష విధించ డానికి వెనుకాడ లేదు. తన గొప్పతానానికి గౌరవానికి మధ్య తూర్పు దక్కన్‌ పెంచుకున్నాడు.
చందుపట్ల శాసనం
రుద్రమదేవికి వ్యతిరేకంగా కాయస్థ అయిదేవుడు తిరుగు బాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఈ తిరుగుబా టును అణచడానికి రుద్రమ స్వయంగా సైన్యంతో వెల్లగా త్రిపురాంతకం వద్ద జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణిం చిందని నల్లగొండ జిల్లాలోని చందుపట్ల (1289) శాసనం తెలియజేస్తుంది.
శాతవాహనుల కాలంనాటి సాహిత్యం
శాతవాహనులు మొదట ప్రాకృత భాషను ఆ తర్వాత కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతంలను పోషించారు. హాలుడు ప్రాకృత భాషలో గాథాసప్తసతి అనే గ్రంధాన్ని రచించాడు. గుణాడ్యుడు బృహత్కథ అనే గ్రంధాన్ని పైశాచి ప్రాకృతంలో రచించాడు. శర్యవర్శ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. వాత్సయనుడు- వాత్సయన కామ సూత్రాలు కుతుహాలుడు-లీలవతి కావ్యం, సోమదేవసూరి కథసరిత్సాగరం అనే గ్రంథాలు శాతవాహనుల కాలానికి చెందినవే. బౌద్ధమత తత్వవేత్తలైన ఆచార్య నాగార్జునుడు అతని శిష్యుడు ఆర్యాదేవుడు అనేక గ్రంథాలు రచించారు.
ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు
బౌద్ధ మత తత్వవేత్త సంస్కృతంలో అనేక గ్రంధాలు రచిం చాడు. ప్రజ్ఞాపరమిత శాస్త్రం సుహృల్లేఖ, శూన్యసప్తశతి, రసరత్నాకరం (రసాయన వాదం), ద్వాదశని కాయశాస్త్రం, ఆరోగ్య మంజరి, మధ్యమిక కారిక ప్రమాణ విచేతన శాస్త్రం, రస రంజనీ, దశభూమి.
ఆర్యదేవుడి గ్రంథాలు: శతుశ్యతకం, అక్షర శతకం, శతశాస్త్రం.
శాతవాహనుల పరిపాలన
శాతవాహనుల పరిపాలనలో మౌర్యులకు వారసులు, పల్లవులకు మార్గదర్శకులు. రాచరికం వంశ పారంపర్యంగా తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించేది. రాజు దైవాంశసం భూతుడనే భావన కలదు. మనుధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, పాలనకు మార్గ దర్శకాలు. శాత వాహనులు రాజ్యాన్ని ఆహరాలుగా, ఆహరాన్ని విషయాలుగా, విషయా లను గ్రామాలుగా విభజించారు.
రాజ్యానికి-రాజు, ఆహారాన్ని- అమాత్యులు, విషయాలకు- విషయపతి, గ్రామాలకు-గ్రామణి/ గోపుడు పాలన బాధ్యతలు నిర్వర్తించేవారు.
తెలంగాణ నదులు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి. అవి గోదావరి, కృష్ణా
గోదావరి: మహారాష్ట్రలోని నాసిక్‌వద్ద త్రయంబక్‌లో పుట్టి తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా బాసర వద్ద ప్రవేశించి 576 కి.మీ. తెలంగాణాలో ప్రవహించి తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో 144 కి.మీ. ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తూర్పు సరిహద్దు గుండా ప్రవహించి ఇంద్రావతిని కలుపుకొని వరంగల్‌ ఖమ్మం జిల్లాల గుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది.
ఉపనదులు: ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్దా, తెన్‌గంగా, పెన్‌గంగాలు ఉపనదులు. ఈ నదిపై శ్రీరాం సాగర్‌ బహుళార్దసాధక ప్రాజెక్ట్‌ను నిజమాబాద్‌లో నిర్మించారు. మంజీర నదిపై సింగూర్‌ ప్రాజెక్ట్‌, నిజాంసాగర్‌ నీటిపారుదల ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
కృష్ణానది: పశ్చిమ పర్వతాల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించి మహాబూబ్‌నగర్‌లోని అలంపూర్‌ వద్ద తెలంగాణలో ప్రవేశి స్తుంది. దీనికి తుంగభద్ర, బీమ, దిండి, పెద్దవాగు, హాలియా, మూసీ, మున్నేరు, ఉపనదులు కలుపుకొని తెలంగాణ రాష్ట్రం లో (మహబూబ్‌నగర్‌, నల్గొండ) 68 శాతం, రాయలసీమ (కర్నూల్‌)లో 18 శాతం, కోస్తాంధ్ర (కృష్ణ, గుం టూరు)లో ప్రయాణించి హంసలదీవి వద్ద బంగాళఖాతంలో కలుస్తుంది.
తెలంగాణ జిల్లాలవారి నదులు
మహబూబ్‌నగర్‌ - దిండి కృష్ణ, తుంగభద్ర
నిజామాబాద్‌ - మంజీరా
రంగారెడ్డి- మూసి
ఆదిలాబాద్‌- గోదావరి, ప్రాణహిత, వెన్‌గంగా
కరీంనగర్‌- మానేరు, గోదావరి,
ఖమ్మం- వైరా, కిన్నెరసాని, గోదావరి, శబరి, సీలేరు
నల్లగొండ- కృష్ణ మూసీ, హాలియా
మహబూబ్‌నగర్‌ జిల్లాలో కృష్ణనదిపై జూరాల ప్రాజెక్ట్‌, నల్లగొండలో నందికొండవద్ద నాగార్జునసాగర్‌ నీటిపారుదల ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
మార్కోపోలో
వెనిస్‌(ఇటలి) యాత్రికుడు. రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన చక్కగా ఉందని ప్రశంసించాడు. మోటుపల్లి ఓడరేవును సందర్శించి ఆరేవునుండి వజ్రాలు, నాజుకైన సన్నని నూలు వస్త్రాలు ఎగుమతి చేసేవారని పేర్కొన్నాడు. కాకతీయ రాజ్యం సిరిసంపదతో తులతూగుతుండేదని తెలిపాడు.
నాయంకర విధానం
కాకతీయుల సైనిక విధానంలో నాయంకర విధానం ముఖ్యమైంది. ఈ విధానం జాగీర్థారి విధానాన్ని పోలి ఉంది. రాజులు నాయంకరులకు కొన్ని గ్రామాలను ఇచ్చేవారు. గ్రామాల నుంచి వచ్చే ఆదాయంలో నాయంకరులు సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో రాజుకు తోడ్పడే వారు. రెండో ప్రతాపరుద్రుడి కాలంలో 72 మంది నాయంకరులుండేవారు.
రామప్ప దేవాలయం
గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు 1213లో నిర్మించారు. రామప్ప దేవాలయం వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలో తలమానికమైంది. ఇదిశివాలయం. దీనిని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. పైకప్పులో రామా యణం, భాగవతం, శివపురాణం గాథలు చెక్కారు. వివిధ భంగిమల్లో మదనిక నాగినీ శిల్పాలు చెక్కరు. ఇందులోని నంది విగ్రహం ఎటువైపు నుంచి చూసిన తన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ దేవాలయ గోపురాన్ని నీటిలో తెలియాడే ఇటుకలతో నిర్మించారు.
కాకతీయుల నీటి పారుదల
కాకతీయుల తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులను నిర్మించి నీటి సౌకర్యాలను అభివృద్ధి చేశారు. ఒక చెరువు నిండిన తర్వాత మిగులు నీరు కింది చెరువులోకి ప్రవహించే విధంగా గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. చెరువుల నిర్మాణం వల్ల వ్యవసాయ అభివృద్ధి జరిగింది. జలాశయాల నిర్మాణం మహపుణ్యకార్యంగాను సప్త సంతానాలలో ఒకటిగా పరిగణించారు.
పాల్కురికి సోమనాథుడు
పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలంనాటి ప్రముఖ వీరశైవ కవి. వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి ఇతని జన్మస్థలం బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాదిపత శతకం మొదలగు గ్రంథాలను రచించాడు. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుడి చేత ప్రభావితమయి వీరశైవమతాన్ని ప్రచారం చేశాడు. సంస్కృత చందస్సును వదిలి ద్విపద చందస్సులో దేశీయ పదాలతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే జాను తెలుగులో రచనలు జేశాడు.
పేరిణీ నాట్యం
కాకతీయుల కాలంలో పేరిణీ నాట్యాన్ని పురుషులు ప్రదర్శిం చేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రేరణగా ఈ నృత్యాన్ని చేసే వారు. శివుడు తన శరీరంలో అవహించాడని విశ్వసించేవారు.
గోల్కొండ
సుల్తాన్‌ కులీ గోల్కొండ రాజ్యాన్ని, కోటను బలోపేతం చేయ డానికి కృషి చేశాడు. గోల్కొండ కోటలో రాజప్రసాదాలు, భవనాలు, తోటలు, మసీదులు కట్టించాడు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో మహమ్మద్‌ నగర్‌ అనే పేరుతో కొత్త నగరాన్ని కట్టించాడు.
చార్‌మినార్‌
మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1590-91 హైదరాబాద్‌లో చార్మినార్‌ నిర్మించాడు. ఈ నిర్మాణం మధ్యయుగ వాస్తు శిల్పకారుల పనితనానికి మచ్చుతునక. దీని నిర్మాణంలో ఆనాటి మేస్త్రీలు చూపిన కళానైపుణ్యత పనితనం సాంకేతిక పరిపక్వత నేటి తరాలకు మార్గదర్శకం. చతురస్రాకారంలో నాలుగు ఎత్తైన మినార్‌లతో కట్టిన అద్భుత కట్టడం.
మక్కా మసీదు
మహ్మద్‌ కులీకుతుబ్‌షా 1617లో తన అధికారులైన దరోగ మీర్‌ ఫజిడల్లా బేగ్‌, చేదరి రాజయ్యల మార్గదర్శకత్వంలో పునాది వేశాడు. దీనిని మొగలు చక్రవర్తి ఔరంగజేబు 1694లో పూర్తిచేశాడు. దీని నిర్మాణానికి 77 సంవత్సరాలు పట్టింది. మక్కా మసీదు ఒక అద్భుత కట్టడం. దీని నిర్మాణంలో పర్షియా, అరేబియా ప్రాంతాల నుంచి మేస్త్రీలు, పనివారు పాల్గొన్నారు. ఈ మసీదులో 15 ఆర్చ్‌లు ఉన్నాయి. 10 వేల మంది ప్రార్థనలు చేయడానికి వసతి ఉంది. దీని నిర్మాణంలో పవిత్రా మక్కా నుంచి కొన్ని ఇటుకలు వాడినందువల్ల మక్కామసీదు అనే పేరొచ్చింది.
హయాత్‌ బక్షీ బేగం
మహమ్మద్‌ కులీకుతుబ్‌షా ఏకైక కుమార్తె. రాజనీతిలో, పరిపాలనలో తెలివితేటలు ప్రదర్శించింది. మాసాహెబా అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. హయత్‌నగర నిర్మాణం, సరాయిలు, ఖైరతాబాద్‌ ప్రాంతంలో పెద్ద మసీదు నిర్మించింది. 1666లో 76వ ఏట మరణించింది. సుల్తానుల సమాధుల వద్దనే ఈమెను సమాధి చేశారు. ఈ సమాధి పక్కనే ఈమె కొడుకైన అబ్దుల్లా కుతుబ్‌షా తల్లి జ్ఞాపకార్థం సమాధి పక్కనే అందమైన మసీదు కట్టించాడు.
సర్వజ్ఞ సింగభూపాలుడు
రాచకొండను ఏలిన వెలమ రాజులలో గొప్పవాడు బహుమనీ సుల్తానుల చేతిలో పరాజయం పొంది విజయనగరం పారి పోయి సాళువ నరసింహుని శరణు పొందాడు. విజయ నగర గజపతుల మధ్య జరిగిన యుద్ధంలో పురుషోత్తమ గజపతి చేతిలో మరణించాడు. 1475లో వెలమ రాజ్యం అంతరించింది.
సైన్య సహకార పద్ధతి
బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్‌ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతి ప్రవేశ పెట్టారు. ఈ పద్ధతిని అనుసరించిన మొదటి సుల్తాన్‌ నిజాం అలీఖాన్‌. ఈ పద్ధతి ప్రకారం హైదరాబాద్‌లో కంపెనీ సైన్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ సైన్య పోషణ బాధ్యత నైజాం ప్రభువుదే.
బీరార్‌ అప్పగింత
హైదరాబాద్‌ కాంటింజెెంట్‌ పోషణార్థం నిజాం ప్రభుత్వం 64 లక్షల రూపాయలను కంపెనీ వద్ద అప్పుతీసుకున్నది. ఆనాటి బ్రిటిష్‌ గవర్నర్‌ డిసెంబర్‌ 31, 1850లోపు అప్పుతీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో నిజాం సంవత్సరానికి చెల్లిస్తాననీ వాగ్దానం చేశాడు. కాని ఈ వాగ్దానాన్ని నిలుపుకోలేక పోయాడు. దీంతో మే 21, 1853న ఒక ఒప్పందం కుదుర్చు కున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం బీరార్‌ను అప్పగించాడు.
అగ్రహారాలు
నిజాం కాలం నాటి ప్రధాన విద్యా కేంద్రాలు బ్రాహ్మణులు విద్య నేర్పినందుకు అగ్రహార గ్రామాలను ఇచ్చేవారు. ఈ అగ్ర హార గ్రామాలు ప్రాచీన విద్యను విస్తరింపచేయడానికి కృషి చేశాయి
సుభాలు
మొగలు పాలనా విధానమైన సుభా పాలనను కుతుబ్‌ షాహీలు అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం విభజించారు. సుభాకు అధికారి సుబేదారు. ఇతడిని నిజాం నియమిస్తాడు. భూమిశిస్తు, క్రిమినల్‌, సివిల్‌ వ్యవహారాలు నిర్వర్తించేవాడు.
తాలుకాదారులు
సుభాలను జిల్లాలుగా విభజించారు. దీని పాలన బాధ్యతలు అన్సత్‌ తాలుకాదారులు నిర్వర్తించేవారు. జిల్లాలను డివి జన్లుగా, డివిజన్లను తాలుకాలుగా విభజించి వాటి పాలనా బాధ్యతలను తాలుకాదార్లకు అప్పజెప్పారు.
గ్రామపాలన
నిజాం కాలంలో రెండు మూడు కుగ్రామాల కలయిక గ్రామం. గ్రామపాలనలో ఈకింది అధికారులుండేవారు. దూల్‌ పటేల్‌, పోలీస్‌ పటేల్‌, పట్వారి, తలారీ, నిరడి, దేహరి మొదలగు వారుండేవారు.
అమరచింత సంస్థానం
అమరచింత సంస్థానం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. నిజాం రాజ్యంలో అతిపురాతనమైనది. నిజాం రాజ్యం కంటే దీని మొదటి రాజధాని తిప్పాడంపల్లి. ఆ తర్వాత ఆత్మకూరుకు మార్చారు. ఈ సంస్థానాన్ని పాలకనాటి రెడ్డి కులస్థులు పాలించారు. ఈ సంస్థానంలో తయారైన మస్లిన్‌ వస్త్రాలు దక్షిణ భారతంలో పేర్కొనదగినవి.
గద్వాల సంస్థానం
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. గద్వాల సంస్థానాన్ని అభివృద్ధి చేసింది సోమనాద్రి. పరిరక్షించినవారు మాలిశెట్టి వంశీయులు. క్రీ.శ. 1901లో ఈ సంస్థానం జనాభా 9,68491. ఈ సంస్థానం పరిధిలోని గద్వాల పట్టణంలో 214 గ్రామాలు ఉండేవి. మొగలు చక్రవర్తి ఔరంగజేబు ఆధీనంలో ఉండేది. పతనాంతరం దక్కన్‌ సుభాలో అంతర్భాగం.1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు నిజాంకు ఇచ్చారు.
వనపర్తి
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఈ సంస్థాన విస్తీర్ణం 450 చదరపు మైళ్లు, జనాభా 65,000. గ్రామాల సంఖ్య 54. సంస్థానం పాలకుల ఇంటిపేరు జనుంపల్లివారు. వీరు మోటాటేరెడ్డి వంశానికి చెందినవారు. వీరకృష్ణా రెడ్డి సంస్థానం స్థాపకుడు విజయనగర రాజుల వద్ద నంద్యాల సీమ సామంతునిగా ఉండేవారు.
సిర్నపల్లి సంస్థానం
సిర్నపల్లి సంస్థానం నిజామాబాద్‌లో ఉంది. ఈ సంస్థాన స్థాపకులు చెన్నమరెడ్డి. అత్తముడిగి కీర్తిని పొంది వ్యవసాయాభివృద్ధి కోసం చెరువులు, కాలువలు త్రవ్వించాడు. ఈ సంస్థానాన్ని పరిపాలించిన వారిలో చిలమ్‌ జాతకీచారు దానధర్మం, దయాగుణాలతో పరిపాలించింది.
పాల్వంచ సంస్థానం
ఒకప్పటి శంకర గిరియే నేటి పాల్వంచ ఖమ్మంలో ఉంది. దీని విస్తీర్ణం 800 చ. మైళ్లు. 40,000 జనాభా కలిగి ఉంది. రాజ్య ఆదాయం 70,000. ఇది నిజాం రాజ్యంలోని సామంత రాజ్యం. భద్రాచలం జమీందారుల ఆధీనంలో ఉండేది. దీన్ని వెలమ సామాజిక కులంవారు పరిపాలించారు. అశ్వరావు కండిమల్ల జలగమ తండ్రి డామరు. ముత్యాల వంశం వారు పరిపాలించారు.
నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే
ప్రారంభ దశలో ఇంగ్లీష్‌ కంపెనీ రైల్వేలోపెట్టిన పెట్టుబడికి నష్టం రావడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోవటంతో దీన్ని అధిగమించ డానికి నిజాం ప్రభుత్వం పెట్టుబడికి 5% గ్యారెంటి వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందువల్ల ఇది నిజాం గ్యారెంటెడ్‌ రైల్వే వ్యవస్థగా పిలువబడింది. దీని పర్యవసానంగా ఒక ప్రైవేటు బ్రిటిష్‌ సంస్థ, నిజాం ప్రభుత్వం మధ్యలో 1883లో ఒప్పందం కుదుర్చుకుంది.
టెలిఫోను సర్వీసులు
1885లో హైదరాబాద్‌ నగరంలో మొదటి టెలిఫోన్‌ సౌకర్యం ప్రవేశపెట్టబడింది. టెలిఫోన్‌ లైన్ల నిర్మాణం బొంబాయి కంపెనీకిచ్చింది. 1910 వరకు టెలిఫోను నిర్మాణం కోసం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం అనుమతి తప్పనిసరైంది. ఆ తర్వాత అనుమతి లేకుండానే టెలిఫోను నిర్మించుకునే అధికారం సంస్థానాల రాజులకు ఇవ్వబడింది. 1922- 1947లలో మధ్యలో హైదరాబాద్‌ రాజ్యంలో 10 టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫీసులు, 200 టెలిఫోన్‌ కనెక్షన్‌లు ఉండేవి.
విశ్వవిద్యాలయ విద్య
హైదరాబాద్‌ రాజ్యంలో భారత భాష (ఉర్దూ)లో ఒక విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పాలని 1873లో ఆనాటి ప్రముఖ విద్యావేత్తలు 'అపట్‌మార్‌ జంగ్‌' 'జములుద్దీన్‌ అఫ్ఘనీలు' ప్రతిపాదించారు. వీరి విన్నపం మేరకు ఔూ బ్లంటా అనే ఆంగ్లేయుడు యూనివర్సిటీ ఆవశ్యకత గురించి ఆనాటి నైజాం రాజు మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌కు ప్రతిపాదన అందజేశాడు.
1913లో దారుల్‌ ఉలుం కాలేజీ విద్యార్థులు ఉశ్రీస దీశీyర సంఘంగా ఏర్పడి విశ్వవిద్యాలయ అవసరాన్ని గురించి ఒక ప్రతిపాదనను నిజాం రాజుకు సమర్పించారు. దీంతో నైజాం ఉస్మానియా యూనివర్సిటీ 1400 ఎకరాల్లో స్థాపించడానికి 28 ఆగస్టు 1918 ఒక శాసనానికి ఖచ్చితంగా నిర్మించాలని 7 ఆగస్టు 1919లో రాజశాసనానికి జారీ చేశాడు. ఉర్దూ భాషలో బోధన ప్రారంభించినా ఇంగ్లిష్‌ ఖచ్చితమైంది. 1948 వరకు యూనివర్సిటీ కింద 11 ఆర్ట్స్‌ సైన్స్‌ కళాశాలలు, 7 వృత్తి విద్య కళాశాలలు ప్రారంభించారు. 6, 239 మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించారు.
తెలంగాణ పండితులు
తెలంగాణ పండితులు తెలుగు భాషకు, సంస్కృతికి ఎనలేని కృషి చేశారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృ ష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, కాళోజి నారాయణ రావు, పి.వి. నరసింహారావు, దేవులపల్లి రామానుజరావు మొదలగువారు ప్రసిద్ధులు.
ఆంధ్రయువతి మండలి
1935లో హైదరాబాద్‌లో డా|| లక్ష్మీ నర్సమ్మ, శ్రీమతి ఎల్లా ప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతి దేవి, సంగం లక్ష్మీబాయి వంటి ప్రసిద్ధ మహిళలు ఆంధ్రయువతి మండలి స్థాపించారు. సంగం లక్ష్మీబాయి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లింది. ఈ మండలి హైదరాబాద్‌లో ఒక శిశు విహార్‌ను స్థాపించింది. కుట్టుపని చేతివృత్తులు, సంగీతం మొదలగు శిక్షణను, సాంస్కృతిక కార్యక్రమాల జాతీయ పండుగల ఉత్సవాలను నిర్వహించింది.
సురవరం ప్రతాపరెడ్డి
తెలుగు భాషకు, సంస్కృతికి సేవ చేసినవారు ప్రతాపరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు చారిత్రక పరిశోధక గ్రంథాలు వంటి పలు రచనలు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి ప్రజానాయకుడు. 1925లో గోల్కొండ పత్రికను స్థాపించి నిజాం ఆంధ్ర మహాసభ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఆంధ్ర సారస్వత పరిషత్‌
తెలుగు భాషా సాహిత్యాల కోసం హైదరాబాద్‌లో 1943లో ఆంధ్రసారస్వత పరిషత్‌కు ఏర్పాటు చేశారు. లోక నంది శంకర నారాయణరావు దీని మొదటి అధ్యక్షుడు. బూర్గుల రంగనాథరావు, భాస్కరబట్ల కృష్ణమరావులు దీని కార్య దర్శులు. ఈ పరిషత్‌ ఏర్పాటులో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హన్మంతరావు, కోదాటి నారాయణరావు, పులిజాల హన్మంతరావు దేవులపల్లి రామానుజరావు, ఆదిరాజు వీరభద్ర రావు పరిషత్‌ కార్యక్రమాలలో ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు భాషా సాహిత్యాలను భవిష్యత్‌ తరాల కోసం భద్రపరచడానికి శాసనాలు, రాతప్రతులను, గ్రంథాలను సేకరించి గ్రంథాలయంలో పొందుపరచడం దీని విధి.
ఆంధ్ర మహిళా సభ
1930 లో ఆంధ్రమహాసభతో పాటు ఆంధ్ర మహిళా సభ కూడా ప్రారంభమైంది. ఆంధ్ర మహిళా సభలు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల విద్య రాజకీయ వెనుకబాటుతనం మొదలయిన సమస్యలు చర్చించి పరిష్కరించడం కోసం ఏర్పడింది. ఆంధ్ర మహిళాసభ మొదటి సమావేశం కూడా 1930 జోగిపేట్‌లో ఏర్పాటు చేశారు. నడింపెల్లి సుందరమ్మ అధ్యక్షురాలిగా ఏర్పాటు చేయడమైంది.
రామానంద తీర్థ
హైదరాబాద్‌ స్వాతంత్య్ర పోరాటంలో రామానంద తీర్థ ప్రముఖ పాత్ర పోషించారు. 1941లో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని మొదటిసారిగా ప్రారంభించాడు. స్టేట్‌ కాంగ్రెస్‌ మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో చేర్చా లని 1947 ఆగస్టు 7ను విలీన దినంగా ప్రకటించి, ఆగస్టు 15, 1947 స్వాతంత్య్ర దినోత్సవంగా జరగాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.
అధ్యాయం-9
నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు
1. కొమరం భీం: నిజాం పాలకుడు మీర్‌ ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ గిరిజనులపై సాగిస్తున్న దోపిడికి వ్యతిరేకంగా తిరుగు బాటు చేసిన గిరిజన గొండు నాయకుడు కొమరం భీం. గెరిల్లా బలగా లను తయారుచేసి ఆదిలాబాద్‌ అడవిలో యు ద్ధాన్ని కొనసా గించాడు. జల్‌-జంగల్‌-జమీన్‌ (నీరు, అడవి, భూమి) అనే నినాదాన్ని ఇచ్చి అడవి భూములు గిరిజనులకే దక్కాలని కోరుకున్నాడు. భయమన్నది తెలియని ఈ గోండు వీరుడిని 1940 ఆగస్టు 8న జోడేఘాట్‌ పోలీసులు చంపివేసారు. అప్పటి నుండి అమరవీరుడు కొమరం భీం గోండు గిరిజన జాతికి ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు.
2. వెట్టి చాకిరి
శ్రామికుల చేత ఉచితంగా, బలవంతంగా, దౌర్జన్యంగా పనిచేయించుకునే విధానాన్ని వెట్టి చాకిరి అంటారు. ఈ విధానం హైదరాబాద్‌ రాజ్యంలో అమలులో ఉంది. జాగీరు దారులు భూస్వాములు ప్రభుత్వాధికారులు గ్రామీణ ప్రాంతా లలోని ప్రజలను అనేక రకాలుగా దోపిడి చేసేవారు. కుల వృత్తులైన చాకలి, మంగళి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వారిని బానిసల కంటె హీనంగా చూశారు. ఇక అంటరాని కులాలైన మాల మాదిగలను పురుగులకంటే హీనంగా చూసారు.
3. పోలీస్‌ చర్య 1948
భారతదేశపు కడుపులో ఉన్న హైదరాబాద్‌ రాజ్యమనే క్యాన్సర్‌ కణితి తొలగించడానికి ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ, ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభభారు పటేల్‌ 1948 సెప్టెంబర్‌ 13న పోలీస్‌ చర్యను 'ఆపరేషన్‌ పోలీస్‌' అనే పేరుతో ప్రారంభించారు. 1948 సెప్టెంబర్‌ 17న జెఎన్‌ చౌదరి నేతృత్వంలోని భారత సైన్యాన్ని అండ్రస్‌ నేతృత్వంలోని నిజాం పోలీసుల బలగాలు లొంగి పోయాయి.
4. దొడ్డి కొమురయ్య అమరత్వం : వరంగల్‌ జిల్లా జనగామ తాలుకాలోని విసునూర్‌ రామచంద్రారెడ్డి ఆధీనంలో గల కడవెండి గ్రామంలో జులై 4, 1946న సుమారు 1000 మంది రైతులు కర్రలతో సాయుధులై ఊరేగింపుగా బయలుదేరగా విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి తన కిరాయి గూండాల చేత ఊరేగింపుపై కాల్పులు జరిపించాడు. ఈ సంఘటనలో గ్రామసంఘం సభ్యుడైన దొడ్డి కొమురయ్య చనిపోగా ఊరేగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెరతీసింది.
5. రజాకార్లు : 1927లో నవాబు బహదూర్‌ యార్‌ జంగ్‌ మజ్లీస్‌ ఇత్తేహదుల్‌ ముసల్మాన్‌ అనే మత సంస్థను స్థాపించాడు. 1944లో ఈ సంస్థ కాశీంరజ్వి అధ్యక్షడిగా ఎన్నికయ్యాడు. ఇది మతోన్మాద సంస్థగా మారి, ముస్లిం రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో పరిపాలనలో జోక్యం చేసుకుంటూ హిందువులపై దుర్మార్గాలకు పాల్పడ్డారు. నిజాం పోలీసులతో కుమ్మక్కై అనేక గ్రామాలపై దుర్మార్గాలకు పాల్పడ్డారు. (నిజాం పోలీసులలో నల్గొండ జిల్లాలోని సూర్యా పేట, బాలెంల, పాతర్లా పహడ్‌) బైరాన్‌పల్లి, పాలకుర్తి, దేెవరు వుల, కడవెండి, ధర్మపురం, కోటకొండ, కోడకండ్లి మొదలగు గ్రామాలు రజాకార్ల దుర్మార్గాలకు కళ్ల ముందున్న సాక్ష్యాలు.
6. జాఠోత్‌రాను : జాఠోత్‌ రాను వరంగల్‌ జిల్లా దేవరు ప్పుల మండలం ధర్మపురం గ్రామానికి పక్కన గల పడమటి లుండాకు చెందిన హము మంగ్లీల కుమారుడు రజాకార్లకు నిజాం పోలీసులకు దేశ్‌ముఖ్‌ బాలు దొరకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎన్నోసార్లు దొరల రజాకారులు, పోలీసుల దాడుల నుంచి తప్పించుకున్నాడు. కాని చివరికి ఉద్యమ ద్రోహులు నెలువత్‌ సంధ్యా భూక్య హరిసింగ్‌, వాంక్యోత్‌ నిమ్లా అందించిన సమాచారంలో కేంద్ర పోలీస్‌ బలగాలు రానును పట్టుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేసినా.. అతని ధైర్యం ఉద్యమ స్ఫూర్తి మిలటరీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి రాను భూస్వాముల చేత - హత్యకు గురయ్యాడు. చనిపోతూ కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్‌- శత్రువులు నశించాలి అని నినాదం చేశాడు.
7. పెద్ద మనుషుల ఒప్పందం : ఆంధ్ర-తెలంగాణ మధ్యనున్న అపార్థాలను తొలగించడానికి కాంగ్రెస్‌ అదిష్ఠానం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రాంతం నుండి ముఖ్య మంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి, మంత్రులు నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, ఆంధ్రకాంగ్రెస్‌ అధ్యక్షులు అల్గూరి సత్యనారా యణ రాజు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మంత్రులు మర్రిచెన్నారెడ్డి, కె.వి. రెడ్డి, కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు జె.వి. నరసింగరావ్‌ హాజర య్యారు. కాగా ఢిల్లీలోని హైదరాబాద్‌ అతిథి గృహంలో జరిపిన చర్చల అనంతరం విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేసే ఒప్పందం చేసారు. అయితే తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పిస్తూ చేసుకున్నదే పెద్ద మనుషుల ఒప్పందం.
8. కమ్యూనిస్టులు :పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పెరవెల్లి వెంకటరమణయ్య, చిర్రాపురిలక్ష్మి నరసయ్య, ముఖ్దుం మొహియుద్ద్దీన్‌, ధర్మభిక్షం, బి.ఎన్‌. రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నల్లనర్సింహులు కమ్యూనిస్టులుగా పేరొందారు.
- దారావత్‌ సైదులు నాయక్‌
సివిక్స్‌ లెక్చరర్‌
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌
జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా
ఫోన్‌ 9908569970


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.