Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించమని ఆదేశించే రిట్‌? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 26,2020

అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించమని ఆదేశించే రిట్‌?

1. భారత రాజ్యాంగాన్ని అనుసరించి, కేంద్ర మంత్రి మండలిలో మంత్రులు?
ఎ) మంత్రులందరూ సమానులే
బి) మిగిలిన మంత్రులకంటే కేబినేట్‌ మంత్రులు ఉన్నతులు
సి) డిప్యూటీ మంత్రులు స్టేట్‌ మంత్రులకన్నా ఉన్నతులు కానీ కేబినేట్‌ మంత్రులకన్నా హౌదాలో చిన్నవారు
డి) ఏ పోర్ట్‌ పోలియో లేని మంత్రి అందరికంటే కింది స్థాయిలో ఉండును
2. పార్లమెంటు సభా సమాప్తమనగా?
ఎ) పార్లమెంటు రద్దు
బి) పార్లమెంటు వాయిదా
సి) పార్లమెంటు సమావేశ ముగింపు
డి) పైవేవీకాదు
3. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం ఎవరి కుంటుంది?
ఎ) పార్లమెంటు బి) ఉన్నత న్యాయస్థానం
సి) రాష్ట్రపతి డి) ప్రధానమంత్రి
4. అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్‌ 21?
ఎ) రాష్ట్రపతి ఆజ్ఞపై సస్పెండ్‌ చేయబడును
బి) స్వతహాగా సస్పెండగును
సి) అమలులో ఉండును
డి) పైవేవీకాదు
5. ప్రాథమిక హక్కులపై నిర్బంధాలను విధించువారు?
ఎ) ప్రధానమంత్రి బి) రాష్ట్రపతి
సి) పార్లమెంటు డి) సుప్రీంకోర్టు
6. పార్లమెంటులో నక్షత్రం గుర్తుగల ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభిస్తుంది?
ఎ) మౌఖిత సమాధానం
బి) రాతపూర్వక సమాధానం
సి) చర్చ ద్వారా సమాధానం
డి) సమాధానం రాదు
7. భారతదేశంలోని రాజ్యాధికారమునకు మూలం?
ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంటు
సి) ప్రధానమంత్రి డి)ప్రజలు
8. ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్‌ 41లో లేనిది?
ఎ) ఆశ్రయపు హక్కు బి) విద్యా హక్కు
సి) ప్రభుత్వ సహాయం పొందు హక్కు
డి) పని హక్కు
9. భారత రాజ్యాంగాన్ని అధికరణ 368 ప్రకారం సవరిం చవచ్చు. అయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి కలదు?
ఎ) ప్రజలు బి) ప్రధానమంత్రి
సి) పార్లమెంటు డి) అసెంబ్లీ
10. కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు ఈ కింది వారిలో ఎవరు?
ఎ) సుప్రీంకోర్టు బి) హైకోర్టు
సి) అడ్వకేట్‌ జనరల్‌ డిి) అటర్నిజనరల్‌
11. నూతన రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దు లలో మార్పులు చేసేది?
ఎ) రాష్ట్రపతి
బి) సబంధిత రాష్ట్ర అసెంబ్లీ
సి) పార్లమెంటు చట్టం
డి) ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి
12. ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ వారిని నియమించునది?
ఎ) కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
బి) రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
సి) రాష్ట్రపతి డి) కేంద్ర హౌం శాఖ
13. ఏ దేశ ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి?
ఎ) ఇండియా బి) ఇంగ్లాండ్‌
సి) జపాన్‌ డి) కెనడా
14. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌..
ఎ) ఉద్యోగుల నియామకానికి పరీక్షల నిర్వహణ
బి) ఒక సలహా సంఘం
సి) క్రమశిక్షణ విషయాలలో సంప్రదించబడును
డి) పదోన్నతి సిఫార్సులకు కమిషన్‌ సమ్మతి కోరబడును
15. కేంద్ర ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ అధికారం ఎవరికి ఉంది?
ఎ) ఆర్థిక మంత్రి బి) ప్రధానమంత్రి
సి) రాజ్యసభ డి) లోక్‌సభ
16. భారత రాజ్యాంగంలోని 3వ భాగం దేని గురించి తెలియజేస్తుంది?
ఎ) ప్రాథమిక విధులు బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) రాజ్యాంగ సవరణ అధికారం
17. నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
ఎ) 3 ఏప్రిల్‌ 2013 బి) 16 డిసెంబర్‌ 2012
సి) 13 జూన్‌ 2014 డి) 24 అక్టోబర్‌ 2013
18. రాజ్యాంగపు ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు పొందు పరిచారు?
ఎ) భాగం - 3 బి) భాగం - 4
సి) భాగం - 5 డి) భాగం - 6
19. భారత రాష్ట్రపతి హౌదా?
ఎ) ప్రభుత్వానికి అధినేత
బి) దేశానికి, ప్రభుత్వానికి అధినేత
సి) దేశానికి అధినేత డి) ఇవేవీకాదు
20. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
ఎ) ముఖ్యమంత్రి బి) గవర్నర్‌
సి) ప్రధానమంత్రి డి) రాష్ట్రపతి
21. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
ఎ) అశోక్‌మెహతా కమిటీ
బి) బల్వంత్‌రారు కమిటీ
సి) ఎల్‌.ఎం.సింఘ్వి కమిటీ డిి) పైవేవీకాదు
22. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు?
ఎ) ఆర్టికల్‌ 356 బి) ఆర్టికల్‌ 352
సి) ఆర్టికల్‌ 360 డి) ఆర్టికల్‌ 358
23. ఒక అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించ మని ఆదేశించే రిట్‌?
ఎ) మాండమస్‌ బి) కోవారెంట్‌
సి) ప్రొహిబిషన్‌ డి) సెర్షియోరరీ
24. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఈ మధ్య ప్రతిపాదించిన భాషలలో లేనిది?
ఎ) డోగ్రి బి) బోడో
సి) భోజ్‌పూర్‌ డి) సంవాలి
25. ఈ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి రాదు?
ఎ) సిక్కిం బి) త్రిపుర
సి) అస్సాం డి) మణిపూర్‌
26. ఇటీవల జార్ఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్ని కయ్యారు?
ఎ) అరవింద్‌ కేజ్రీవాల్‌ బి) హేమంత్‌ సోరేన్‌
సిి) ఉద్దవ్‌ఠాక్రే డి) యడ్యూరప్ప
27. ఇటీవల దేశరాజధాని నగరం ఢిల్లీకి శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 80 బి) 81 సి) 75 డి) 70
28. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసన మండలి కలదు?
ఎ) 7 బి) 6 సి) 5 డి) 8
29. 'స్వరాజ్యము అడుగనిదే బ్రిటీష్‌ పార్లమెంటు ఇచ్చే బహుమతి కాదు. అది భారతదేశపు సంపూర్ణ మరియు స్వయంగా వెలిబుచ్చే ప్రకటన'' -
ఎ) గోపాలకృష్ణ గోఖలే బి) జవహర్‌లాల్‌నెహ్రూ
సి) గాంధీ డి) బాలగంగాధర్‌తిలక్‌
30. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధి గాంచిన ఈ కింది వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఏది?
ఎ) గోలక్‌నాద్‌ కేసు బి) మినర్వా మిల్స్‌ కేసు
సి) కేశవనందా కేసు డి) ఏ.కె. గోపాలన్‌ కేసు
31. ఏ సాధారణ ఎన్నికలలో భారతదేశం మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది?
ఎ) 5వ సాధారణ ఎన్నికలు
బి) 6వ సాధారణ ఎన్నికలు
సి) 8వ సాధారణ ఎన్నికలు
డి) 3వ సాధారణ ఎన్నికలు
32. రాజ్యాంగ సభలోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ కింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది?
ఎ) స్టీరింగ్‌ కమిటీ - జవహర్‌లాల్‌ నెహ్రూ
బి) అడ్వయిజరీ కమిటీ - వల్లభారు పటేల్‌
సి) రూల్స్‌ కమిటీ- రాజేంద్ర ప్రసాద్‌
డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.ఎ.కృపలానీ
33. ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) ఆస్ట్రేలియా బి) జపాన్‌
సి) జర్మనీ డి) ఇంగ్లాండ్‌
34. విద్య ఏ జాబితాలో కలదు?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా డి) అవశిష్ట జాబితా
35. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడి మీద మహాభియోగ (అభిశంసన) తీర్మానం ప్రతిపాదించబడింది?
ఎ) జర్మనీ బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా డి) ఫ్రాన్స్‌
36. గవర్నర్‌ నియామకానికి ఈ కింద పేర్కొన్న అర్హత లలో తప్పుగా పేర్కొన్న అర్హత ఏది?
ఎ) భారతీయ పౌరుడై ఉండాలి
బి) 30 సం||లకు తక్కువ వయస్సు ఉండరాదు
సి) అతడు లేదా ఆమె పార్లమెంటులోని ఏ సభలోని గాని రాష్ట్ర శాసనసభల్లో గాని సభ్యులై ఉండరాదు
డి) అతడు లేదా ఆమె ఆదాయము లభించే ఏ ఇతర పదవిలో ఉండరాదు
37. పార్లమెంటరీ నియమాల ప్రకారం 'జీరో అవర్‌' అనగా?
ఎ) సభ ప్రారంభమునకు ముందు సమయం
బి) సభ ప్రారంభ సమయం
సి) ప్రశ్నోత్తరాల సమయం
డి) ప్రశ్నోత్తరములకు తరువాత సమయం
38. రాజ్యాంగ సభ కూర్పు రమారమి ఎవరి సలహాల మార్గంలో రూపొందించారు?
ఎ) కాబినేట్‌ మిషన్‌ బి) క్రిప్స్‌ మిషన్‌
సి) మౌంట్‌ బాటన్‌
డి) భారత స్వాతంత్య్ర చట్టం
39. ఎవరి సలహా మేరకు అంతర్‌ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు?
ఎ) ఎం.ఎం.ప్రంఛా కమిషన్‌
బి) సర్కారియా కమిషన్‌
సి) వెంకటచలయ్య కమిషన్‌
డి) రాజ్‌మన్నార్‌ కమిషన్‌
40. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎన్నో సారి?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
41. జీవించే హక్కును ఏ దేశం నుంచి తీసుకొన్నారు?
ఎ) జర్మనీ బి) జపాన్‌
సి) ఇంగ్లాండ్‌ డి) ఆస్ట్రేలియా
42. రాజ్యాంగ పరిషత్‌లోని ఆర్థిక (ఫైనాన్స్‌) కమిటీకి అభ్యర్థులు?
ఎ) నెహ్రూ బి) పటేల్‌
సి) అంబేద్కర్‌ డి)రాజేంద్ర ప్రసాద్‌
43. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్‌ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
ఎ) 2014 బి) 2015 సి) 2013 డి) 2016
44. భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం?
ఎ) తమిళనాడు బి) ఒరిస్సా
సి) ఆంధ్రప్రదేశ్‌ డి) ఉత్తరప్రదేశ్‌
45. భారత పార్లమెంటు వ్యవస్థలోని రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి?
ఎ) బదిలీకి వీలు లేని ఓటు పద్ధతి
బి) ఏక ఓటు బదిలీ పద్ధతి
సి) సంచిత ఓటు పద్ధతి
డి) భారత సగటు ఓటు పద్ధతి
46. నామినేట్‌ చేసిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌ సభ్యులను కలుపుకొని మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య?
ఎ) 543 బి) 545 సి) 552 డి) 542
47. నూతన అభిల భారత సర్వీసులను ఏర్పాటు చేయు ఆధారం ఎవరిది?
ఎ) కేంద్ర హౌం శాఖ బి) రాజ్యసభ
సి) రాష్ట్రపతి డి) పార్లమెంటు
48. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించువారు?
ఎ) గవర్నర్‌ బి) హైకోర్టు న్యాయమూర్తి
సి) స్పీకర్‌ డి) ఎవరూ కాదు
49. భారతదేశంలో నగరపాలక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 72వ రాజ్యాంగ సవరణ
బి) 74వ రాజ్యాంగ సవరణ
సి) 73వ రాజ్యాంగ సవరణ
డి) 69వ రాజ్యాంగ సవరణ
సమాధానాలు
1.ఎ 2.సి 3.బి 4.సి 5.బి
6.ఎ 7.డి 8.ఎ 9.సి 10.డి
11.సి 12.సి 13.బి 14.ఎ 15.డి
16.బి 17.ఎ 18.బి 19.సి 20.డి
21.బి 22.ఎ 23.ఎ 24.సి 25.ఎ
26.బి 27.డి 28.బి 29.సి 30.డి
31.బి 32.ఎ 33.ఎ 34.సి 35.బి
36.బి 37.డి 38.ఎ 39.బి 40.సి
41.బి 42.డి 43.బి 44.ఎ 45.బి
46.బి 47.బి 48.ఎ 49.బి
- దారావత్‌ సైదులు నాయక్‌
సివిక్స్‌ లెక్చరర్‌
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌
జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా
ఫోన్‌్‌ 9908569970

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.