Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తెలంగాణలో స్థానిక పరిరక్షణల కోసం ఉద్దేశించిన నిబంధనలను ఏమంటారు? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 20,2020

తెలంగాణలో స్థానిక పరిరక్షణల కోసం ఉద్దేశించిన నిబంధనలను ఏమంటారు?

(నిన్నటి తరువాయి)
35) జిల్లా వినియోగదారుల ఫోరమ్‌
జిల్లా వినియోగదారుల ఫోరంలో 1 చైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. 20 లక్షల విలువ గల కేసులను ఇది పరిష్కరిస్తుంది.
36) దళితులంటే ఎవరు చర్చించండి?
దళిత అనే పదాన్ని మొదటిసారిగా డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ బహిష్కృత భారత్‌ అనే పత్రికలో పేర్కొన్నాడు. అణచివేసిన, వెలివేసిన, అణగారిన, బలహీన వర్గాల ప్రజలను ఉద్దేశించి వాడారు. బలహీన వర్గాలైన సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వర్గాల ప్రజలను దళితులుగా పిలుస్తారు.
37) తెలంగాణలో చాకలి ఐలమ్మ పాత్రను తెల్పండి?
తెలంగాణ ఉద్యమంలో స్త్రీలు పాల్గొనడానికి ప్రధానంగా రెండు సంఘటనలు కలవు. అందులో ఒకటి చాకలి ఐలమ్మ సంఘటన వరంగల్‌ జిల్లా జనగాం దేశ్‌ముఖ్‌ విసునూరు రామచంద్రరెడ్డి బలవంతంగా చాకలి ఐలమ్మ భూమి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించటంతో దానిని ఐలమ్మ ప్రతిఘటించింది
38) అదిలాబాద్‌ ''కొమరం భీం'' తిరుగుబాటు
కోమరంభీం గొప్ప గిరిజన నాయకుడు. గిరిజన తెగలను ముఖ్యంగా నిజాం ప్రభువుకు తన జాగిర్దార్‌ పాలకులకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌ గోండ్‌ గిరిజనులను సమాయత్తపరిచి, చైతన్య పరచిన ప్రజారంజక గిరిజన గోండ్‌ నాయకుడు. ఇతని నాయకత్వాన గోండ్‌ సైనికులు తాలుకాదారుడైన అబుల్‌సత్తార్‌, అతని 60 మంది పోలీసులపైన సైనిక ముట్టడిని చేపట్టారు.
39) తెలంగాణలో రజాకార్లు అంటే ఎవరు?
ఇత్తేహర్‌ నాయకుడైన కాశీం రజ్వి నిర్వహించిన స్వచ్ఛంద దళాన్ని రజాకార్లు అంటారు. రజాకార్లుగా పిలువబడే ముస్లిం స్వచ్ఛంద కార్యకర్తలను ప్రోత్సహించి, హిందువు లపై పగ నూరిపోశాడు. రజాకార్ల చర్యలు మజ్లిస్‌ ఇత్తే హద్‌లోని తీవ్రవాద అధికార భావాలకు అద్దం పట్టాయి.
40) ముల్కి నిబంధనలు
తెలంగాణలో స్థానిక పరిరక్షణల కోసం ఉద్దేశించబడిన వాటినే ముల్కి నిబంధనలు అంటారు. తెలంగాణలో 12 ఏండ్లు శాశ్వత నివాసం ఉండే వారికి తెలంగాణ విశ్వవిద్యాల యల్లో ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. 1913లో సుప్రీంకోర్టు కూడా ముల్కి నిబందనలు సరైనవేనని తీర్పు ప్రకటించింది.
41) శ్రీకష్ణ కమిటి రిపోర్టు (2010)
తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమ పరిస్థితి తీవ్రతను దష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 3 ఫిబ్రవరి 2010న రిటైర్డ్‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీకష్ణ నేతత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను 31 డిశంబరు 2010 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
42) సకలజనుల సమ్మె
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు మహాసమ్మె తల పెట్టారు. 13 సెప్టెంబర్‌ నుంచి 24 అక్టోబర్‌ 2011 వరకు 40 రోజులు తెలంగాణలో సాధారణ జనజీవనం స్తంభిం చింది. అన్ని వత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైన వంటా వార్పులు రైలు రోకోలు రోడ్డు దిగ్భందాలు సమ్మెలో నిత్యకృత్యమయ్యాయి.
43) మిలియన్‌ మార్చ్‌:
తెలంగాణ JAC 10 march 201న ఒక మిలియన్‌ జనాలను హైదరాబాదుకు ర్యాలీగా తరలిరమ్మని పిలుపు నిచ్చింది. అదే సంవత్సరం ఈజిప్టులో లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్భంధించి అధికార మార్పు కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తిగా దానికి మిరియన్‌ మార్చ్‌ అని పేరు పెట్టారు.
44) ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 పార్లమెంటు ఆమోదం పొందడంతో 2 జూన్‌ 2014 నుండి అమలు లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారత యూని యన్‌లో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ చట్టం ప్రకారం హైదారాబాదు 2014 నుండి 10 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొంది
45) పెద్ద మనుషుల ఒప్పందం
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్యగల అభిప్రాయ భేదాలను తొలగించి విశాలాంధ్ర రాష్టాన్ని నిజం చేసేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ 1956 ఫిబ్రవరి 20న ఇరు ప్రాంతాల కాంగ్రెస్‌ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది. దీనినే పెద్ద మనుషులు ఒప్పందం అంటారు. ఆంధ్ర ప్రాంతం ప్రతినిధులుగా బెజవాడ గోపాలరెడ్డి నాటి ఆంధ్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.సత్యనారాయణరాజు, తెలంగాణ నుంచి బూర్గుల రామకష్ణరావు, తెలంగాణ ముఖ్య మంత్రి కె.వి.రంగారెడ్డి, ఎం. చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్‌ రావులు పాల్గొన్నారు.
46) తెలంగాణ జాగృతి
తెలంగాణ జాగతిని కల్వకుంట్ల కవిత జూన్‌ 2008లో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, విలువలను, కళారూపాలు, జానపదకళలు, సాహిత్యం, తెలంగాణ ప్రాంత తెలుగు మాండలికం మొదలైన వాటిని పరిరక్షించడానికి ఒక సాంఘిక సాంస్కృతిక సంస్థగా తెలంగాణ జాగతి ఏర్పడింది.
47) విద్యార్థి జేఏసీ
తెలంగాణ రాష్ట్ర సాధన లక్య్షంతో వివిధ కళాశాలలు, విశ్వద్యా లయాల విద్యార్థులు ఏకమై జేఏసిగా ఏర్పడి ఉద్యమాన్ని నడిపారు. వీటిలో ఉస్మానియా విద్యార్థుల జేఏసీ, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీలు ఉద్యమాన్ని నడపడంలో కీలక పాత్ర పోషించారు.
48) కుల సంఘాల జేఏసీ
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారిలో కుల సంఘాలు, దళితులు, అల్ప సంఖ్యాకులు ఒకే వేదికపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి.
49) ఎం.ఐ.ఎం. మజ్లీస్‌పార్టీ
ఈ పార్టీని అబ్దూల్‌ వహిద్‌ ఓవైసీని స్థాపించారు. మజ్లిస్‌ పార్టీ తొలి దశలో ఆంధ్రప్రదేశ్‌ను సమర్థించింది. ఆ తరువాత తన అభిప్రాయన్ని మార్చుకుంది. ఈ పార్టీ రాయల తెలంగాణ పేరుతో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
50) సీపీఐ(ఎం.ఎల్‌ ) న్యూడెమోక్రసీ
రాజకీయ జేఏసీలో భాగంగా ఈ పార్టీ వివిధ నిరసన కార్య క్రమాల్లో, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నది. తెలంగాణ ఆర్థిక దోపిడికి సాంఘిక అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంగా ఈ పార్టీని చెప్పవచ్చు.
51) లోక్‌ సత్తా పార్టీ
1996లో ఒక ప్రభుత్వేతర సంస్థగా ఏర్పడి 2006లో ఒక రాజకీయ పార్టీగా లోక్‌సత్తా పార్టీ అవతరించింది. తెలంగాణ అంశంపైన తన నిర్ణయంలో భాగంగా అభివృద్ధి అనే అంశంపైన చర్చ జరపడానికి ప్రయత్నిం చింది. అయితే ఈ పార్టీలోని తెలంగాణ నాయకులు ఒత్తిడి చేయడంతో సమస్యకు సమగ్ర సామరస్య పూర్వక పరిష్కారంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తామని ప్రకటించింది.
52) అవినీతి రూపాలు
ప్రభుత్వ పదవిని ప్రైవేటు లాభర్జన కోసం వినియోగించడమే అవినీతి అని వరల్డ్‌ బ్యాంకు నిర్వచించింది. అవినీతి రూపాలు అనేక రకాలు. వీటిలో లంచాలు, బందు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం వంటివి ఉన్నాయి.
53) ప్రజావేగులు
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యకర్తలే ప్రజావేగులు.
10 మార్కుల ప్రశ్నలు
1. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి?
పరిచయం: రాజ్యాంగం దేశానికి మౌళిక, శాసనం. ప్రభుత్వానికి మూలచట్టం, ఇతర శాసనములన్నింటికి జన్మస్థానం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు రూపొందించింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
1. అతి పెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం : భారత రాజ్యంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సుదీర్ఘమైన, వివరణాత్మకమైన లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగం ప్రారంభంలో 395 అధికరణలు, 8షెడ్యూళ్లు, 22 భాగాలు ఉంటే ప్రస్తుతం 467 నిబంధనలు, 12 షెడ్యూళ్ళు, 24 భాగాలు కలవు. అందువల్ల హెచ్‌.వి కామత్‌ రాజ్యాంగాన్ని 'ఐరావతం'తో పోల్చాడు.
2. ధృడ, అధృడల మేలు కలయిక : భారత రాజ్యాం గాన్ని ధృడ, అధృడ పద్ధతుల ద్వారా సవరించవచ్చు. పార్లమెంటుకు రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారం కలదు. ఉదా: నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం ఇది అధడ పద్ధతి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మొదలగువాటిని సవరించాలంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారీటీతో సవరించ వచ్చు. ఇది అధడ పద్ధతి.
3. ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు: భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితులలో సమాఖ్య లక్షణాలను అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉంది. ఒక కేంద్ర లక్షణాలకు ఉదా: ఏక పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం తదితర లక్షణాలు. ఇక సమాఖ్య లక్షణాలకు ఉదా : ద్విసభ విధానం, ధడ రాజ్యాంగం అధికారాల పంపిణీ తదితర లక్షణాలు కలవు. అందువల్ల కె.సి.వేర్‌ భారత రాజ్యాంగాన్ని 'అర్థసమాఖ్య'గా వర్ణించాడు.
4. పార్లమెంటరీ ప్రభుత్వం : భారత రాజ్యాంగం కేంద్రంలో బ్రిటిష్‌ తరహా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్‌ తరహా వారసత్వాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా ఐర్లాండ్‌ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు. అలాగే ఇతర లక్షణాలైన ప్రధానమంత్రి నాయకత్వం సమిష్టి బాధ్యత. మంత్రి మండలి నియంత్రణ రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు మొదలగు వాటిని బ్రిటిష్‌ రాజ్యాంగం నుండి స్వీకరించారు.
5. స్వతంత్ర న్యాయశాఖ: రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. న్యాయమూర్తుల నియామకం పదవీకాలం జీతభత్యాలు తదితర అంశాల్లో స్వతంత్రలను కలిగి ఉంటుంది.
6.రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు : ఆదేశిక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్‌ రాజ్యాంగం నుండి గ్రహించారు. వీటిని రాజ్యాంగంలోని నాల్గవ భాగంలో నిబంధన 36-51 వరకు పొందుపరిచారు. అదేశక సూత్రాలు భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి దోహదపడుతాయి.
7. ప్రాథమిక హక్కులు : ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. రాజ్యాంగం లోని మూడవ భాగంలో అధికరణ 12-35 వరకు పొందుపరిచారు. ఇవి రాజ్యాంగం ప్రారంభంలో 7 ఉండేవి. ప్రస్తుతం 6 కలవు. ప్రస్తుతం 11 విధులు కలవు.
8. ప్రాథమిక విధులు : ప్రాథమిక విధులను స్వరణ్‌సింగ్‌ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలోని 4ఏ భాగంలో ఆర్టికల్‌ 5ఏ లో 1976 సం||లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 విధులను చేర్చారు. తిరిగి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో మరో విధిని చేర్చారు. వీటిని మరో రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించారు.
9. సార్వజనీన వయోజన ఓటు హక్కు: రాజ్యాంగం పౌరులందరికి ఓటు హక్కును కల్పించింది. పౌరులు కులం, మతం, ప్రాంతం, లింగ, వర్గం, సంపద వాటితో సంబంధం లేకుండా కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు. ఓటింగ్‌ వయస్సు 1950-87 మధ్య కాలంలో 21 సం||లుగా ఉండేది. అయితే రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో 18 సం||లకు తగ్గించారు.
10. ద్విసభా పద్ధతి : భారత రాజ్యాంగం కేంద్రంలో ద్విసభా పద్ధతి ప్రవేశపెట్టింది. పార్లమెంటులో లోక్‌సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలు ఉంటాయి. లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే రాజ్యాంగంలో ద్విసభ పద్ధతిని ఎంచుకునే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.
11. ఏక పౌరసత్వం: భారత రాజ్యాంగం భారతదేశం లో జన్మించిన వారందరికీ లేదా ఒక నిర్దిష్ట కాలం పాటు భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత - సమగ్రతను పరిరక్షించడానికి అది అవకాశం కల్పిస్తుంది.
- దారావత్‌ సైదులు నాయక్‌
సివిక్స్‌ లెక్చరర్‌
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌
జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా
ఫోన్‌ 9908569970

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

03:43 PM

రైతులు, కేంద్రం మధ్య 10 దఫా చర్చలు ప్రారంభం

03:30 PM

వ్యవసాయశాఖ మంత్రిని అడ్డుకున్న రైతులు..

03:24 PM

కరోనా వ్యాక్సిన్..మందు బాబులకు షాక్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.