1. రాజనీతి శాస్త్రం నిర్వచనం తెలపండి?
జ: ''రాజనీతి శాస్త్రం రాజ్యంతో ప్రారంభమై రాజ్యంతో అంతం అవుతుంది అని గార్నర్ నిర్వచించాడు''.
2. రాజనీతి శాస్త్రం ఒక శాస్త్రము అని తెలపండి?
జ: రాజనీతి శాస్త్రాన్ని ఒక శాస్త్రము అని ఈ కింది అంశాలు తెలుపుతాయి.
1) ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
2) ప్రయోగాలకు అవకాశం ఉంటుంది.
3) కార్యాకరణ సంబంధాన్ని అమలు చేస్తుంది.
3. రాజనీతి శాస్త్రం ఒక కళ అని తెలపండి ?
జ: రాజనీతి శాస్త్రాన్ని ఒక కళగా ఈ కింది అంశాలను బట్టి చెప్పవచ్చు...
1) భౌతిక శాస్త్రాలకు భిన్నంగా విశ్వవ్యాప్తి చట్టాలను కలిగి ఉండదు.
2) కొన్ని విషయాలను సమయం, సందర్భాన్ని బట్టి వర్గీకరించవచ్చు.
3) శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకథలు పాటించబడవు.
4. రాజనీతి శాస్త్రం పరిధిలోని ఏవైనా నాలుగు అంశాలు తెలపండి ?
జ: రాజనీతి శాస్త్ర పరిధిలోని అంశాలు :
1) సమాజం, మానవ సంబంధాల అధ్యయనం
2) రాజ్యం గురించి అధ్యయనం
3) ప్రభుత్వం గురించి అధ్యయనం
4) హక్కులు, విధులను గురించి అధ్యయనం
5. రాజ్యం నిర్వచనం తెలపండి?
జ: ''మానవునికి సుఖప్రదమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని ప్రసాధించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం'' అని అరిస్టాటిల్ నిర్వచించారు.
6. రాజ్యం ముఖ్య లక్షణాలు తెలపండి ?
జ: రాజ్యం ముఖ్య లక్షణాలు : 1) ప్రజలు 2) ప్రదేశం 3) ప్రభుత్వం 4) సార్వభౌమాధికారం 5) అంతర్జాతీయ గుర్తింపు
7. ప్రభుత్వం అంటే ఏమిటి?
జ: రాజ్యం తనకున్న అత్యున్నత అధికారాలను, తన ఆశయాలను, అకాంక్షలను ప్రభుత్వం ద్వారా చేర్చుకుంటుంది. రాజ్యానికి ప్రభుత్వం ప్రాణం వంటిది.
8. సమాజం అంటే ఏమిటి ?
జ: సమాజం అనేది సహజంగా ఏర్పడి అభివద్ధి చెందిన సంస్థ. సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే సమాజం అంటారు.
9. 'జాతి అర్థం' తెలపండి ?
జ: జాతి అనే పదాన్ని ఆంగ్లంలో ''చీa్‌ఱశీఅ'' అంటారు. ఈ పదాన్ని ''చీa్‌ఱశీ'' - అనే లాటిన్ పదం నుండి పుట్టింది. ''చీa్‌ఱశీఅ'' అంటే 'పుట్టుక', తెగ, ఒకే సంస్కతి అనే అర్థం.
10. జాతి నిర్వచనం తెలపండి ?
జ: ''ఒక నిర్ణీత భూభాగంలో నివాసం ఉంటూ, దాని ఆధారంగా ఐక్యమత్యంతో వ్యవహరించే వ్యక్తుల సముదాయమే జాతి'' అని భార్కర్ నిర్వచించారు.
11. జాతీయతా నిర్వచనం ?
జ: ''మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడియున్న సామాజిక, సాంస్కతిక సముదాయమే జాతీయత'' అని బర్గెస్ నిర్వచించారు.
12. జాతీయతా ముఖ్య లక్షణాలు ఏవైనా నాలుగు తెలపండి?
జ: జాతీయతా ముఖ్య లక్షణాలు : 1) ఒకే తెగ 2) ఉమ్మడి భాష '3) ఉమ్మడి మతం 4) భౌగోళిక ఐక్యత మొదలగునవి.
13. జాతీయ వాదం నిర్వచనం ?
జ: జాతీయత భావాలు గల ప్రజలు స్వాతంత్య్రాన్ని సాధించాలనే ప్రగాఢమైన ఆకాంక్ష గల ప్రజల సముదాయాన్నే, వారికి గల మానసిక వాంచనే జాతీయ వాదం అంటారు.
14. జాతీయతా వాదంలోని దశలను తెలపండి ?
జ: జాతీయ వాదంలో వర అనే రచయిత ఈ కింది పలు దశలును సూచించాడు.
1) మానవతావాద దశ
2) సాంప్రదాయక దశ
3) అధికార ధిక్కార వాద దశ
4) ఉదరవాద దశ
5) సమీకత దశ
15. జాతుల స్వయం నిర్ణయాధికారం గురించి తెలపండి?
జ: జాతుల స్వయం నిర్ణయాధికారం డిమాండ్ ప్రపంచంలో నేడు పెరిగింది. అనేక తెగలు సంస్కతులు కలిగిన ప్రజలు ప్రత్యేక జాతిగా రూపొందాలనే ఆకాంక్షతో జాతుల స్వయం నిర్ణయాధికారం అనే డిమాండ్ ఆవిర్భవించింది.
16. జాతి, రాజ్యంల మధ్య గల రెండు వ్యత్యాసాలు తెలపండి?
జ:1) జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం. రాజ్యం అనేది అనేక జాతుల ప్రజా సముదాయం.
2) జాతి అనేది చారిత్రక, సాంస్కతిక సముదాయాన్ని కలిగి ఉంటే, రాజ్యం అనేది రాజకీయ, చట్టబద్ధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
17. జాతీయ వాదంలోని రెండు లాభాలు తెలపండి ?
జ: జాతీయవాదంలోని రెండు లాభాలు :
1) ప్రజలలో ఐక్యమత్యం సమగ్రతా సాంఘీభావం పెరుగుతుంది.
2) ప్రజలకు ప్రభుత్వం పట్ల వినయ విధేయతలు పెరుగుతాయి.
18. జాతీయ వాదంలోని రెండు నష్టాలను తెలపండి?
జ: జాతీయ వాదంలోని రెండు నష్టాలు :
1) ప్రజలలో అహంకారం, ఆసూయ పెరుగుతుంది.
2) ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారి తీస్తుంది.
19. జాతి, జాతీయత మధ్య గల రెండు తేడాలు తెలపండి ?
జ: 1) జాతి అనేది రాజకీయ భావన, జాతీయత అనేది మానసిక భావన అని చెప్పవచ్చు.
2) జాతి సంగటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది. జాతీయత అసంగటితమైన స్వంత్రతను కలిగి ఉంటుంది.
20. చట్టం నిర్వచనం తెలపండి?
జ: ''న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయంనే చట్టం'' అని జాన్ సాల్ మాండ్ నిర్వచించారు''.
21. చట్టమునకు గల ఏవైనా నాలుగు ముఖ్య లక్షణాలు తెలపండి?
జ: చట్ట ముఖ్య లక్షణాలు :
1) సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయం.
2) చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది.
3) చట్టం నిర్దిష్టమైనది. కచ్చితమైనది.
4) చట్టం ఉల్లంగించిన వారికి శిక్షకు దారి తీస్తుంది.
22.చట్టానికి సంబంధించి ఏవైనా నాలుగు ఆధారాలు తెలపండి?
జ: చట్టానికి గల ఆధారాలు: 1) ఆచారాలు 2) మతం 3) శాసన సభలు 4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు
23. రాజ్యాంగ చట్టం?
జ: రాజ్యం యొక్క మౌలిక చట్టాన్ని రాజ్యాంగ చట్టం అంటారు. ఇది ప్రభుత్వ నిర్మాణాన్ని, ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని, పరిధిని గురించి వివరిస్తుంది. రాజ్యంగ చట్టం అత్యున్నతమైనది.
24. సమన్యాయ పాలన ?
జ: బ్రిటీష్ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే అంశాన్ని చేర్చారు. డైసీ అనే రచయిత ప్రకారం సమన్యాయ పాలన అంటే రాజ్యంలోని ప్రజలందరూ చట్టం ముందు సమానులు అని సూచిస్తుంది.
25. సమత అంతే ఏమిటి ?
జ: సమత అంటే సహజ న్యాయం అని అర్థం. అమలులో ఉన్న చట్టాలు, వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భా లలో న్యాయమూర్తులు తమ విజ్ఞత అనుభవంతో పరిష్క రించే న్యాయాన్ని సహజ న్యాయం లేదా సమత అంటారు.
26. స్వేచ్ఛ నిర్వచనం?
జ: వ్యక్తులకు ఎటువంటి ఆంక్షలు లేకపోవడం కాదు. వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో ఇమిడి ఉండే దానినే స్వేచ్ఛ అని గాంధీజీ నిర్వచించారు.
27. సహజ స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జ: సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రకతి ద్వారా ప్రసాదించే గాలి, నీరు, వెలుతురు మొదలగు వాటిని పొందటాన్ని సహజ స్వేచ్ఛ అంటారు.
28. స్వతంత్ర న్యాయ శాఖ?
జ: న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్ధించి ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. అందుకు అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తిని న్యాయశాఖ కలిగి ఉంటుంది.
29. ఆర్థిక సమానత్వం ?
జ: ఆర్థిక సమానత్వం అంటే ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి ప్రభావాల నుండి బయట పడేందుకు వ్యక్తులకు సరిపడినన్ని అవకాశాలు కల్పించటాన్నే ఆర్థిక సమానత్వం అంటారు. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.
30. సాంఘిక సమానత్వం అంటే ఏమిటి?
జ: వ్యక్తుల మధ్య గల మతం, కులం, వర్గం, లింగం, ప్రాంతీయ విభేదాలు లేకుండా సమాన హౌదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం అంటారు.
31. హక్కులు నిర్వచనం తెలంపడి ?
జ: 'వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్య పరిస్థితులనే హక్కులు' అంటారని భార్కర్ నిర్వచించారు.
32. హక్కులకు గల నాలుగు లక్షణాలు తెలపండి ?
జ: హక్కులు లక్షణాలు : 1) సామాజిక జీవనానికి ప్రతీకలు 2) సామాజిక స్వభావం 3) ప్రకతి సిద్ధమైనవి
4) విశ్వవ్యాప్తమైనవి.
33. హక్కులు వర్గీకరణ తెలపండి ?
జ: హక్కులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.
1) సహజ హక్కులు
2) నైతిక హక్కులు
3) చట్టబద్ధమైన హక్కులు
34. ఏవైనా మూడు రాజకీయ హక్కులను తెలపండి ?
జ: రాజకీయ హక్కులు : 1) ఓటు వేసే హక్కు 2) ఎన్నికలలో పోటీ చేసే హక్కు 3) ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కులు
35. జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి తెలపండి?
జ: జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో నలుగురు సభ్యులు ఉంటారు. దీనికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిషన్ మానవ హక్కులను పరిరక్షిస్తుంది.
36. మానవ హక్కుల లక్షణాలు ఏవైనా నాలుగు తెలపండి?
జ: మానవ హక్కుల లక్షణాలు : 1) ఎటువంటి వివక్షత ఉండదు 2) ఇది సార్వజనీనమైనది. 3) ప్రజలందరిని సమానంగా పరిగణిస్తాయి 4) భౌగోళిక సరిహద్దులు ఉండవు
37. బాధ్యతలు రకాలు తెలంపడి?
జ: బాధ్యతలు రెండు రకాలుగా పేర్కొనవచ్చును.
1) నైతిక బాధ్యతలు
2) చట్టబద్ధమైన బాధ్యతలు .
38. నైతిక బాధ్యతలు తెలపండి?
జ: నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాలపై ఆధారపడి వ్యక్తులు నిర్వహించవలసిన కర్తవ్యాలను నైతిక బాధ్యతలు సూచిస్తాయి. వీటిని రాజ్యం గాని, చట్టం కాని రక్షించగలవు. కాని ఆచార సాంప్రదాయాలు నైతిక బాధ్యతలను రక్షిస్తాయి.
39. న్యాయం నిర్వచనం తెలపండి?
జ: ''న్యాయం అంటే మిత్రులకు మేలు చేయటం. శత్రువులకు హాని చేయటమే'' అని పాలీ మార్కాస్ నిర్వచించారు.
40. న్యాయం ఆధారాలు తెలపండి ?
జ: న్యాయం ఆధారాలు : 1) ప్రకతి 2) నైతికత 3) మతం
4) ఆర్థిక అంశాలు
41. న్యాయం రకాలు తెలంపడి ?
జ: న్యాయం రకాలు : 1) సహజ న్యాయం 2) సామాజిక న్యాయం 3) రాజకీయ న్యాయం 4) ఆర్థిక న్యాయం 5) చట్టబద్ధమైన న్యాయం
42. సామాజిక న్యాయం అంటే ఏమిటి ?
జ: సమాజంలోని బలహీన వర్గాలు ప్రజలకు, వెనుకబడిన వర్గాల ప్రజల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి సమాన అవకాశాలు కల్పించడాన్నే సామాజిక న్యాయం అంటారు.
43. పౌరసత్వం నిర్వచనం తెలపండి ?
జ: ''ప్రజలకు ఉపయోగానికి వ్యక్తులు అందించే నిర్ణయక సేవయే సౌరసత్వం'' అని లాస్కీ నిర్వచించారు.
44. జస్సోలీ అంటే ఏమిటి ?
జ: జస్సోలీ అంటే భూమి లేదా జన్మ స్థలం అని అర్థం. జస్సోలీ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపాదికపై పౌరసత్వం నిర్వహించ బడుతుంది.
45. జస్ సాంగ్వీనాన్ అంటే ఏమిటి ?
జ: జస్ సాంగ్వీనాస్ అంటే బందుత్వం లేదా రక్త సంబంధం అని అర్థం. జస్ సాంగ్వీనాస్ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంలో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.
- వి.శేషారావు
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
దోమకొండ, కామారెడ్డి జిల్లా
Authorization