Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వారు ఊళ్లను చేరాలి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 17,2020

వారు ఊళ్లను చేరాలి

అవును వారిప్పుడు
ఊరి వైపుకు చేరాలి
చారెడు మెతుకుల కోసం
ఊళ్లను వదిలిపెట్టి
ఊహల పందిరిని విడిచిపెట్టి
సన్నజాజి తీగెల్లాంటి
తల్లిదండ్రులను వదిలి పెట్టి
మాయల మర్రి లాంటి
నగరాలకు వచ్చినందుకు
అవును దీనంగానే కదులుతున్నారు
రోడ్డుపై ఒంటెలు కదులుతున్నట్టు
ఆగి ఆగి వెళుతున్నారు
వాళ్ళను ఆపకండి
గుక్కపట్టిన పిల్లల్లా ఉన్నారు
గొంతు పొలమారినట్టు ఉన్నారు
నిస్తేజంగా నడుస్తున్నారు
నిర్వేదంగా కదులుతున్నారు
వాళ్ళను నిర్బంధించకండి
లాఠీలతో నిరోధించకండి
దయచేసి వారి కడ్డుపడకండి
కఠిన పరీక్షలు పెట్టకండి
దరిద్రపు ఆకలిని జయించ లేక
ఇంతదూరం వచ్చారు కదా
ఇక వారిని ఆపకండి
రోడ్లపై చెమట చుక్కలే నడుస్తున్నట్టు
కదులుతున్న దేహాలు వారివి
బతుకు పోరులో భీతిల్లిపోయారు
బిత్తర బిత్తర అవుతున్నారు
తత్తర తత్తర పడుతున్నారు
ఎర్రటి ఎండల్లో ఎండుటాకుల్లా కదులుతున్నారు
సందిగ్ధ రేఖను భారంగా దాటుతున్నారు
వారి కాళ్లకు లక్ష్మణ రేఖలు గీయకండి
వాళ్ళిపుడు దుఃఖ నదిని దాటుతున్నారు
దేహంలో మిణుకు మిణుకు మంటున్న
ప్రాణదీపాన్ని కాపాడుకుంటూ
కత్తివాదర మీద నడుస్తున్నారు
పరి పరి విధాలుగా శోకిస్తున్న
ఆత్మలు వారివి
కంటిమీద రెప్పవాలితే
అంతు చిక్కని అలజడి
నేటి కరకు కాలం
రేపటి బతుకు తీరం
ఎడతెరిపిలేని ప్రశ్నల వర్షం
ముసురుకుంటున్న కటిక చీకటి
ఐనా వాళ్ళనేమి అనకండి
అడ్డగించకండి
అలిసిపోయిన బహుదూరపు బాటసారులు
వారు దిక్కుల్ని దాటుకుని
శూన్యాన్ని మోసుకుంటూ
నదిలో నాటు పడవల్లా సాగుతున్నారు
ఐనప్పటికీ వాళ్ళు వాళ్ల ఊళ్లను చేరాలి
ఉదయించే సూర్యుణ్ణి చూడాలి
పచ్చని పొలాలను కళ్లతో చూడాలి
కాసింత ధాన్యపు రాశిని
దోసిట్లోకి తీసుకోవాలి
ఆ ధ్వని గుండెల్లో కొత్తగా మోగాలి
చేతుల్లోకి ఒక పచ్చనాకు అందుకోవాలి
ఎండిపోయిన కళ్లకు
కాసింత చెమ్మకావాలి
బతుకు పోరులో అలసిపోయిన
భూమిపుత్రులు వారు
ఇప్పుడు
వారి తలపై భారాన్ని
దింపుకోనివ్వండి.
- సుంకర రమేశ్‌, 9492180764

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సహృదయ ప్రేమికునికి నివాళి
సాహిల్‌ ఎందుకు రావాలి?
భూమిపుత్రులు
నేను వేచివున్నాను!..
దేశమంటే మేమే
రైతుకు జేజేలు
హారు ! ఆనంద భూమి
సాహితీ వార్తలు
అలిశెట్టి యాదిలో...
'సామ్యవాదం సాగుబాటు చేస్తాను నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను'
కలగంటున్న దృశ్యం!
ఒక చలి దేశం, కొన్ని చలి దేహాలు
అది
సాహితీ వార్తలు
కొత్త తొవ్వ
విత్తనం తల ఎత్తి మొలకెత్తితే...
ప్రాభాత సమీరం
'నోట్స్‌ ఫ్రం అండర్‌ గ్రౌండ్‌' దోస్తోవిస్కీ నవల, ఒక పరిశీలన
సమ'కాలిన' సమస్యలకు సరైన అయింట్మెంట్‌ అయినంపూడి కవిత్వం
కొత్త పేజీ మొదలు
నస్రీన్‌ ఖాన్‌ కు హేమలత స్మారక పురస్కారం
నేల నీది, రేపు నీది
దుస్సప్నం
మట్టి పాదాల మార్చ్‌
ప్రజాగొంతుకలై కదలిన కలాలు, గళాలు
ఆఖరి అస్త్రం 'ఐదోస్తంభం'!
మార్నింగ్‌ వాక్‌
ఇంటిచెట్టు
మేమో...మీరో
రెండు మార్కెట్లు

తాజా వార్తలు

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

03:43 PM

రైతులు, కేంద్రం మధ్య 10 దఫా చర్చలు ప్రారంభం

03:30 PM

వ్యవసాయశాఖ మంత్రిని అడ్డుకున్న రైతులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.