Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నేలను వదలని కవిత్వం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 11,2020

నేలను వదలని కవిత్వం

తెలంగాణ వచనకవితా రంగంలో సిధారెడ్డిది ప్రత్యేక స్థానం. వివిధ పోరాటాల, ఉద్యమాల నేపథ్యంలో రూపొందిన వ్యక్తిత్వం ఆయనది. అధిక ప్రమాణంలో రాసి, రాశులు పొయ్యాలనేది ఆయన ధోరణి కాదు. ఆయన మాట ఏదైనా నాభి నుంచి పలికినదే. ''సభలో ఒకటి, స్వగతం ఒకటి'' లాంటి కపటాలను నిరసిస్తాడు. నిజాయితీ, ఆర్తి ఆయన కవిత్వానికి ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలు. ఆయన ఉపయోగించే భావచిత్రాలు, ప్రతీకలు, అన్ని స్థాయిల వారికి అనుభూతమయ్యే విధంగా ఉంటాయి. తెలంగాణ గ్రామీణ ప్రజల కవితాత్మకమైన నుడికారాన్ని సొంతం చేసుకున్న కవి సిధారెడ్డి. తెలంగాణా ప్రజల ఆరాటాలకు, పోరాటాలకు పర్యాయపదం ఆయన కవిత్వం. ధిక్కారం ఆయన కవిత్వ స్వభావం. సౌందర్యం ఆయన కవిత్వం సహజాతం.
''భూమి స్వప్నం'' నుంచి ''ఇక్కడి చెట్ల గాలి'' వరకు ఏడు కవితాసంపుటాలు ప్రచురించారు. ఆ వరుసలో ''నీటిమనసు'' ఎనిమిదవ కవితాసంపుటి.
''నా పుట్టువడే స్వప్నం
కరిగితే కవి
పారితే నది
కవిది నది అవతారం
నాకు రెండూ తెలుసు
నీటిమనసు, నీటి సొగసు!''
అంటూ ''భూమిస్వప్నం'' తోనే తాను కవిగా అవతరించిన అంశాన్ని స్ఫురింపజేశాడు. వ్యవసాయ క్షేత్రాలను సస్యశ్యామలం చేసినప్పుడే నదికి సార్థకత. కరిగిన కవి ఆర్తి ప్రజల మనోక్షేత్రాలను చేరినప్పుడే కవిత్వానికి సార్థకత. ''నీటి యొక్క మనసు'' అనీ, ''కరిగి నీరైన కవి మనసు'' అనే రెండు అర్థాలూ ''నీటిమనసు'' అనే శీర్షికకు అన్వయిస్తాయి.
ఈ సంపుటిలోని ''ఊరి నెత్తురు'' అనే కవిత కీలకమైనది. ''వసంతమేఘం గర్జిస్తుంటే/ వసంతం వచ్చినట్టే పరవశించిన/ గర్జించిన మేఘం చెప్పాపెట్టకుండ తరలిపోయింది!/ చెట్లు చిగురించక ముందే / పూలు పూయక ముందే వసంతం వెళ్లిపోయింది!'' అని సమీప గత, వర్తమాన రాజకీయ పరిణామాలను వాస్తవికదష్టితో సూచించాడు. ''అక్షరమంతా అమరత్వమే అయితే జీవితమేం కావాలి?'' అని ప్రశ్నించాడు. ''నీళ్ళ కోసం మొహం వాచిన వాణ్ణి/ నది తారసపడితే/ చేతులు చాచి ఆలింగనం చేసుకున్నా!'' అంటూ చాల గొప్పగా, తెలంగాణ ఆరాటాన్నీ, పోరాట లక్ష్యాలనూ పరోక్షంగా తెలిపాడు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్నీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునూ, ప్రజల ఆకాంక్షలనూ సూచించే వాక్యాలివి. ఇక్కడ ''నది'' ఉద్యమానికి, ఉద్యమనాయకుడికి కూడ సంకేతమే. తెలంగాణ ఉద్యమంతో తన మమైకత్వానికి కారణాలను, లక్ష్యాలను కూడ గుప్తంగానే అయినా కవి స్పష్టంగానే చెప్పాడు. తెలంగాణకు సమకూరాల్సిన తక్షణ, శాశ్వత ప్రయోజనాలనూ వ్యక్తపరిచాడు.
నీళ్ళు, నిధులు, నియామకాల పరమైన అనివార్య మైన తక్షణ ప్రయోజనాలకోసం (''రాజ్యానిది బహుముఖ వ్యూహం'' అని గుర్తిస్తూనే), ఇక్కడి ప్రజల కోసం ''బతుకుకు భ్రమ కూడ అవసరమే'' అని వివరించాడు. ''ఊరు ఊపిరి తీసుకుంటే/ ఊరట పడుతున్నా!/ వరదగూడు కడితే వాన పడుతుందని ఊరు ముచ్చటపడితే/ ముచ్చట పెడుతున్నా!'' అనే మాటలు ఎంతో భావగర్భితమైనవి, నర్మగర్భమైనవి. ''ఊరు ఊపిరి తీసుకోవడం'' ఉద్యమ సాఫల్యానికి సంకేతం. తెలంగాణ తక్షణ ప్రయోజనాల సాధన విషయంలో ''ప్రజా స్వామ్యం'' పైన ఆశ పెంచుకోవాల్సిన అవసరాలను సూచించాడు.
''శరీరం కోసం/ భూమి వదిలిన వాడికి/ భూమి మీద ప్రేమ ఉన్నట్టా?/శరీరం మీద ప్రేమ ఉన్నట్టా?'' అని ప్రశ్నించాల్సిన వారిని, మార్మికంగానే అయినా, సూటి గానే, కటువుగానే ప్రశ్నించాడు. ఇక్కడ శరీరం ''ఉద్యమాని''కీ, భూమి ''తెలంగాణ''కూ ప్రతీకలని భావించవచ్చు. దీర్ఘ కాలిక పోరాటాలతో, విశాల ప్రయోజనాల కోసం, విప్లవాత్మక పరిణామాల కోసం జరిగే ఉద్యమాలకూ, నిర్దిష్ట ప్రదేశాలలోని తక్షణ, అనివార్య, అత్యవసర ప్రయోజనాలకూ మధ్య ఉన్న భేదాలను ఈ కవితలో కవి నర్మగర్భంగా చర్చించాడు. ''అలవాటయిన భాష/ అంతర్జాతీయం మాట్లాడు తున్నది!/ ఇక్కడి ప్రజలేం కావాలి?'' తన హదయాన్ని ఆవిష్కరించాడు. తన సందేహాన్ని ప్రశ్నాత్మకంగా నివేదించాడు. తాను ఎప్పుడూ ''బతుకు వైపే'' అని, తనది ''ఇక్కడి భూమిస్వప్నం'' అని నొక్కి చెప్పాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విప్లవోద్యమ అభిమానుల అందరి మనోగతాన్ని కూడ ఈ కవిత ప్రతిఫలిస్తున్నది.
''నేను అడుగు తీసి అడుగు వేసిన చోటల్లా నది కావాలి!/ఆ నదుల్లో, నా నదుల్లో / జనులంతా స్నానం చేసే పంటపొలాలు కావాలి!'' (భూమిస్వప్నం) అని ఆనాడే ఆశించాడు. ''పాలు పడని పచ్చి బాలెంత లాంటి తెలంగాణ''ను చూసి బావురుమన్నాడు. ''నిండిన చెరువు ముందు'', ''వానపడని నేల మీద'', ''ఎండిన చెరువు ముందు'' (ఒక బాధ గాదు), ''బోరు దుఃఖం'', ''నీళ్ళకోసం'', ''దాహం'', ''కోమటి చెరువు'' (ప్రాణహిత) మొదలైన కవితలలో కూడ (గతంలోనే) నీటికోసం తెలంగాణ రైతుల తండ్లాటను ఆర్తితో చిత్రించాడు. ''వాక్పర్యంత స్వప్నం తలపుతో నేల వాలింది'' -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమయ్యింది. ''తరలి వచ్చిన నది కడుపు నింపుతుంది'' అని కలగన్నాడు. నీటికోసం కలగంటున్న నేల భూమి నుంచి మాట్లాడు తున్నానని తన స్థల కాలాల నేపథ్యాన్ని మరోసారి వివరించాడు.
''సహజాతం'' అనే కవితలో తన వ్యక్తిత్వాన్ని గుప్తంగా నిక్షిప్తం చేశాడు. సముద్రానికి గాంభీర్యం తోపాటు ఎగిసిపడే లక్షణమూ ఉంటుంది. వైశాల్యం, సహనం భూమి స్వరూప, స్వభావాలు. చెట్టుది ఉదారగుణం. ఈ లక్షణాలన్నీ సిధారెడ్డికీ వర్తిస్తాయి. సమస్త ప్రకతికీ, వివిధ కాలాలకూ, సకల సమాజాలకూ ప్రతినిధి ఆయన కవిత్వం. ''సిధారెడ్డి అందరికీ అందుతాడు/ ఎవరికీ అందడు!''. అందరికీ అందుబాటు లో ఉండే నిరహంకార, నిరాడంబర మూర్తి ఆయన. అలాగే ప్రతికూల విమర్శకులకు ఎవరికీ అందడు. ఒక కోపం, ఒక ఓపిక, ఒక ఆర్తి, ఒకింత సాహసం, అనివార్యమైనప్పుడు ఒకింత రాజీ....ఇదీ ఈ కవి తత్వం. ''ఇటీవల సిధారెడ్డి మారాడు'' అనే కొందరి ఆక్షేపణలకు ''సిధారెడ్డి మారడు'' అని కచ్చితంగా చెప్పాడు.
''లోకనం'' అనే కవిత ఇతరులను సంబోధించి చెప్పినట్లు బయటికి కనిపిస్తుంది. కాని, అది తనను తానే సంబోధించుకున్న స్వగతమని గుర్తించడం కష్టం కాదు. తనను ప్రతికూల దష్టితో విమర్శించేవారు, అసూయాగ్రస్తులు కొందరు ఎప్పుడూ ఉన్నారన్న ఎరుక ఉన్న కవి ఈయన.
నగరానికి సంబంధించిన ధనాంశాలనూ, రుణ అంశాలనూ కొన్ని కవితలలో వర్ణించాడు. జీవిక కోసం నగరానికి వలస వచ్చే కష్టజీవుల తొక్కులాటలను సహజ సుందరంగా చిత్రించాడు. విమాన ప్రయాణ అనుభూతులను అక్షరీకరించాడు. వివిధ కవితలలోని, వాక్యాలలోని నాదసామ్యం కలిగిన పదాల కూర్పు, జంట వాక్య విన్యాసాలు, అప్రయత్నకతంగా అమరిన పదాల పేర్పు సిధారెడ్డి శైలిని పట్టి చూపుతాయి. వివిధ భావాల సమ్మిశ్రితమైన మానసిక స్థితిని రూపు కట్టించిన ఇతర కవితలు కూడ పేర్కొనదగినవి. నేలను వదలనిది, తడి తడి గుణం విడువనిది ఆయన కవిత్వం. సంఖ్యా ప్రసిద్ధి కంటే, సారాంశ సిద్ధి ముఖ్యమని భావించే కవి సిధారెడ్డి.
- పెన్నా శివరామకష్ణ, 94404 37200

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నడుస్తున్న తెలంగాణకు 'రూబిడి'
మన గిజుభాయి సుమిత్ర
సాహితీ వార్తలు
గాలికి ఎగిరిపోతోంది
అరిగోస
గాయపు తడి
పండగొచ్చిన వేళ ..
తప్పు ఒప్పుల బేరీజు !
ఆకుపచ్చ ఎడారి...
పాటిగడ్డ
సహృదయ ప్రేమికునికి నివాళి
సాహిల్‌ ఎందుకు రావాలి?
భూమిపుత్రులు
నేను వేచివున్నాను!..
దేశమంటే మేమే
రైతుకు జేజేలు
హారు ! ఆనంద భూమి
సాహితీ వార్తలు
అలిశెట్టి యాదిలో...
'సామ్యవాదం సాగుబాటు చేస్తాను నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను'
కలగంటున్న దృశ్యం!
ఒక చలి దేశం, కొన్ని చలి దేహాలు
అది
సాహితీ వార్తలు
కొత్త తొవ్వ
విత్తనం తల ఎత్తి మొలకెత్తితే...
ప్రాభాత సమీరం
'నోట్స్‌ ఫ్రం అండర్‌ గ్రౌండ్‌' దోస్తోవిస్కీ నవల, ఒక పరిశీలన
సమ'కాలిన' సమస్యలకు సరైన అయింట్మెంట్‌ అయినంపూడి కవిత్వం
కొత్త పేజీ మొదలు

తాజా వార్తలు

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

09:42 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం..

09:32 AM

ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్..

09:24 AM

పొగమంచు కారణంగా 17రైళ్లు ఆలస్యం..

09:13 AM

జనగామలో రోడ్డుపై మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..

09:04 AM

మహిళను వేధించిన యువకుడు అరెస్ట్..

08:55 AM

రూ.3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

08:46 AM

వారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

08:44 AM

మటన్ దుకాణాలు బంద్..జీహెచ్‌ఎంసీ ప్రకటన

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.