Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వొక్కడవై మౌన కాసారంలో మునకలేస్తున్నపుడు
వెలుగు రేఖల జిలుగులు వెలిగించడానికి
ఓ ఇద్దరైనా నీ కుడి ఎడమలు నిలబడాలె...
నువ్వొక్కడవై చీకటి దారిలో అడుగుల శబ్దం చేస్తున్నప్పుడు
తొవ్వలో ఎన్నీలు పోయడానికి
ఓ రెండు హృదయాలు మిణుకు మిణుకు మనాలె...
నువ్వొక్కడవై ఈ పద్యం ఉచ్చరిస్తున్నపుడు
వెలుగుతున్న మొహమొక్కటి నీ వెనుక
జెండా పట్టుకు నడుస్తానని ఆస్వాసం ఇవ్వాలి
నీ ఆహ్వానానికి మద్దతు అంతకంతకు పెరిగి
ఊరేగింపయి ఉధృతం గావాలె...
నీ ఒంటికి ఇంటికే హస్తగతమై
సమస్త సంఘం దారిదప్పిందని విరోధాబాసమాడితే
చిత్రమెవడిది విచిత్రమెవడిది..?
- విలాసాగరం రవీందర్ - 94409 32934,
- సి.వి.కుమార్ - 98499 02910