Authorization
Mon Jan 19, 2015 06:51 pm
12న కామారెడ్డిలో ఎన్నీల ముచ్చట్లు
తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కర్షక్ బియిడి కళాశాలలో ఈ నెల 12 న సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమంలో సూరారం శంకర్, డా||వి.ఆర్.శర్మ, గన్ను కృష్ణమూర్తి, పీతాంబర్ మోహన్రాజ్, గఫుర్ శిక్షక్ లు పాల్గొంటారు
- ఎనిశెట్టి గంగా ప్రసాద్
'దండెం' కవితా సంపుటి ఆవిష్కరణ సభ
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ చైతన్య సాహితి ఆధ్వర్యంలో ఈ నెల 13 తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో 'దండెం' దాసరి మోహన్ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరుగుతుంది. నందిని సిధారెడ్డి, ఎం.నారాయణ శర్మ, డా||రాయారావు సూర్యప్రకాష్ రావు, వఝల శివకుమార్, డా||ఏనుగు నరసింహా రెడ్డి, మామిడిహరికృష్ణ, డా||నాళేశ్వరం శంకరం, డా||చెమన్, గోగులపాటి కృష్ణమోహన్, . ముదిగొండ సంతోష్ లు పాల్గొంటారు.
- తెలంగాణ చైతన్య సాహితి
రంజని-నందివాడ భీమారావు కథానికల పోటీ
'రంజని - నందివాడ భీమారావు' కథానికల పోటీలకు కథానికలను ఆహ్వానిస్తున్నారు. తెలుగువారి జీవితం, సంప్రదాయాలను ప్రతిబింబించే, చేతి రాతలో పది పేజీలకు మించని కథలను ఈ నెల 30వ తేదీ లోపు పంపాలి. చిరునామా : ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, అకౌంటెంట్స్ జనరల్ ఆఫీస్, లకడీకాపూల్, హైదరాబాద్ - 500005.
- నందిరాజు పద్మలతా జయరాం, 9492921383
జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2019
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. 2015 - 2019 మధ్యకాలంలో ప్రచురించిన వచన కవితలు/ పద్యాలు/ గేయాలు/ లఘు కవితలు/ బాలగేయాల సంపుటాలలో ఏవైనా ఒక పుస్తకం డిసెంబర్ 31 లోపు పంపాలి. చిరునామా : నర్రా ప్రభావతి, 101,శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్ 5వ లైన్ తూర్పు, గోరంట్ల, గుంటూరు- 522034. ఫోన్ : 9247581825.
బాలల సాహిత్య పురస్కార ప్రదానోత్సవం
నారంశెట్టి బాలసాహిత్య పీఠం అందించే బాలసాహిత్య పురస్కారాలను డి.కె.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణలకు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు పార్వతీపురం ఆర్.సి.ఎం బాలికోన్నత పాఠశాలలో ప్రదానం చేస్తారు. ఈ సభలో నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎల్.ఆర్.స్వామి, సిస్టర్ ప్రశాంత, డా||మంచిపల్లి శ్రీరాములు, సముద్రాల గురుప్రసాద్, కొల్లూరు స్వరాజ్యం వెకట రమణమ్మ, దత్తి అప్పలనాయుడు, శిరేల సన్యాసిరావు, చివుకుల లక్ష్మి తదితరులు పాల్గొంటారు.
'అక్షరాల తోవ' జాతీయస్థాయి కథల పోటీ ఫలితాలు
అక్షరాల తోవ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలో ప్రతాప వెంకట సుబ్బారాయుడు (కథ : సంగమయ్య), వురిమళ్ళ సునంద (కథ : కాపాడుకుందాం), తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి (కథ : కొత్తా దేవుడండీ!) మొదటి మూడు బహుమతులకు ఎంపికయ్యారు. 'అక్షరాల తోవ' ద్వితీయ వార్షికోత్సవ సభలో వీరికి బహమతులు ప్రదానం చేస్తారు.
కళ్ళే శేషశయనం స్మారక సాహితీ రత్న జాతీయ పురస్కారం - 2019
కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య నిర్వహించిన కళ్ళే శేషశయనం స్మారక సాహితీ రత్న జాతీయ పురస్కారం -2019' ఫలితాలు వెల్లడించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (బడి), కటుకోఝ్వల రమేష్ (అగ్నిశిఖ), శ్రీరామ్ పుప్పాల (అద్వంద్వం) లు మొదటి మూడు బహుమతులకు ఎంపికయ్యారు. వీరికి నవంబర్ 10వ తేదీ ఉదయం బెంగళూరు ఇండోఏషియన్ అకాడమిలో జరిగే సాహిత్య సభలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
2020 సంక్రాంతి కథల పోటీ
విడదల నీహారిక ఫౌండేషన్, సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో 2020 సంక్రాంతి కథల పోటీ నిర్వహిస్తున్నది. ఇందుకు తెలుగువారి జీవనశైలి, కుటుంబ వ్యవస్థ నేపథ్యంలోని డి.టి.పిలో మూడు పేజీలకు మించని కథలను నవంబర్ 30వ తేదీ లోపు పంపాలి. చిరునామా.. 2020 సంక్రాంతి కథల పోటీ, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్ నెం.3, హైదరాబాద్ - 500102. వివరాలకు : పొత్తూరి సుబ్బారావు, 9490751681
వృద్ధాప్య కవితా సంకలనానికి కవితలు ఆహ్వానం
వృద్ధాప్యం శీర్షికతో ప్రచురించే కవితా సంకలనానికి రెండు రాష్ట్రాలలోని తెలుగు కవుల నుండి కవితలను జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆహ్వానిస్తున్నది. కవులు 20 లైన్లకు మించని కవితలను నవంబర్ 30వ తేదీ లోపు గుడిబండి వెంకటరెడ్డి, జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, బి.70/ఎఫ్. 1, పి.ఎస్.నగర్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ 500057 చిరునామాకు పంపాలి.
- గుదిబండి వెంకటరెడ్డి