Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేరా రచనల్ని 'చేకూరి రామారావు సర్వలభ్య రచనల సంకలనం' పేరుతో మనసు ఫౌండే షన్ ప్రచురిస్తోంది. చేరా రచనలన్నీ ఈ సంక లనంలో చేర్చాలన్నది లక్ష్యం. ఎవరి దగ్గరైనా చేరా రాసిన రచనలు (కవిత్వం, వ్యాసాలు, పీఠికలు, సంపాదకీయాలు, ఆంగ్లంలోని భాషాశాస్త్ర వ్యాసాలు, లేఖలు, ఇంటర్వూలు... వగైరా) ఉంటే సమాచారం అందించగలరు. చేరా 1986 నుండి 1996 వరకూ ఆంధ్ర జ్యోతి ఆదివారంలో ''చేరాతలు'' పేరుతో రాసిన వ్యాసాల ఒరిజినల్ ప్రతులు ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి తెలియజేయా ల్సిందిగా మనసు ఫౌండేషన్ నిర్వాహకులు సతీష్, జి.ఎస్. చలం విజ్ఞప్తి చేశారు. రచనలు అందించడానికి 9391614443, 9490106390 నెంబర్లలో సంప్రదించవచ్చు.