Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భాషాసాహిత్యవేత్త పోరంకి దక్షిణామూర్తి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Feb 15,2021

భాషాసాహిత్యవేత్త పోరంకి దక్షిణామూర్తి

డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి అనగానే ''తెలుగు కథానిక - స్వరూప స్వభావాలు'' సిద్ధాంత గ్రంథం గుర్తుకొస్తుంది. కథానికా ప్రక్రియకు సంబంధించి సాహిత్యశాస్త్రం అంతగా రూపొందని సమయంలో, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి సమగ్రమైన పరిశోధన చేసినవారు పోరంకి వారు. అది తెలుగు కథానికా సాహిత్య శాస్త్రంలో మొట్టమొదటి సిద్ధాంత గ్రంథం. ఆ గ్రంథాన్ని రాస్తున్న సమయం నుంచి పోరంకి వారితో నాకు పరిచయం. విహారి-శాలివాహన కథానికా సంపుటి ''పళ్ళచక్రం'' గురించి వారు తమ సిద్ధాంత గ్రంథంలో విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు.
దేశవిదేశాల్లో అనన్యసామాన్య ప్రచారం పొందిన పరమహంస యోగానంద వారి ''ఒక యోగి ఆత్మకథ'' గ్రంథాన్ని పోరంకి వారు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథం 20 ఏళ్ళలో 25 ముద్రణలు పొంది, కొన్ని వేల ప్రతులు అమ్ముడుపోయాయి. పాఠకుల విశేష ఆదరణని పొందింది. ఇదికాక పోరంకి వారు జస్టిస్‌ పమిడిఘంటం కోదండరామయ్య గారి ''ది లైట్‌ ఆఫ్‌ రామాయణ'' అనే విశిష్ట గ్రంథాన్ని ''రామాయణ ప్రభ'' పేరుతో అనువదించారు. ఇది కూడా పోరంకి వారికి అపూర్వమైన ప్రశంసల్ని, అభినందనలల్నీ తెచ్చిపెట్టింది. ఇవిగాక, ''మన ఆధ్యాత్మిక వారసత్వం'' వంటి అనువాద గ్రంథాలు, శతాధికమైన మౌలిక ఆధ్యాత్మిక వ్యాసాలు, వారి మేధా సంపత్తికి తార్కాణంగా వెలువడినాయి. 1914లో వెలువడిన గురజాడ వారి ''మినిట్‌ ఆఫ్‌ డిసెంట్‌'' గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి, 1964లో ఆంధ్రప్రభలో ధారావాహిక తొలిసారిగా ప్రచురించింది పోరంకి వారే! 1928లో అది పుస్తక రూపంగా విశాలాంధ్ర ప్రచురణగా వచ్చింది. 90 ఏళ్ల తర్వాత డాక్టర్‌ వేదగిరి రాంబాబు పునర్ముద్రించారు. తెలుగు భాషోద్యమ కారులకు తోడుదీపం వంటి డిసెంట్‌ పత్రం ఈ విధంగా మళ్లీ వెలుగు చూడటం ఒక సాహిత్య అవసరాన్ని, సామాజిక అవసరాన్ని నెరవేర్చింది. దక్షిణామూర్తి గారికి నవలాకారుడుగా ఇతరులకు లేని ఒక అపూర్వమైన, ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకత కూడా ఉన్నది. తెలుగులో తొలిసారి కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో విడివిడిగా ''వెలుగు వెన్నెల గోదారి'', ''ముత్యాల పల్లకి'', ''రంగవల్లి'' అనే మూడు నవలలు రాశారు. వారివి ''నివేదన'', ''నీడలు-జాడలు'' అనే మరో రెండు నవలలూ ఉన్నాయి. 1956 నుండి కథా రచయితగా పోరంకి వారు సుప్రసిద్ధులు. ఐదు దశాబ్దాల తర్వాత వారి మొట్టమొదటి కథానిక సంపుటి ''చంద్రవంక'' వెలువడింది. వారి కథానికలు అన్నిటా సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆదర్శం, ఒక స్వచ్ఛమైన అభ్యుదయ ఆకాంక్ష కనిపిస్తాయి. పాఠకుడిలో ఉత్తమ మానవతా విలువల్ని ప్రేరేపింపచేసి, బతుకు అర్థాన్ని విడమరిచి చెబుతూనే, జీవనాన్ని జాగతి చేయగలగడం, మనిషి పట్ల, మానవత పట్ల వారికి గల నిబద్ధతను తెలియజేస్తాయి. పోరంకి దక్షిణామూర్తి గారు 1935 డిసెంబర్‌ 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించారు. తెలుగులో పట్టభద్రులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్‌.డి పొందారు. భాషాశాస్త్రాన్ని శాస్త్రీయంగా అభిలషించారు. 1957లో హైదరాబాదులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్యాషియర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించినా, లెక్కలు రాస్తూ ఉండటం తన జీవిత పరమార్ధం కాదనిపించి, 1962లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పండితారాధ్యుల నాగేశ్వరరావు నెలకొల్పిన ''ప్రజాప్రభ''లో ఉపసంపాదకులుగా చేరి, ఆరు నెలలు మాత్రమే పని చేయగలిగారు. అది అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కోసం ఆచార్య భద్రిరాజు కష్ణమూర్తి గారి నేతత్వంలో మాండలిక వత్తిపదకోశ నిర్మాణ పథకంలో పర్యటన పరిశోధకులుగా, సహాయసంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు. 1968లో తెలుగు అకాడమీలో చేరి, అనేక పదవులు నిర్వహించి, 1993 చివర అకాడమీ ఉపసంచాలకులుగా పదవీ విరమణ చేశారు.
వ్యక్తిగా దక్షిణామూర్తి గారు మదుభాషి, సౌజన్యమూర్తి. ''ప్రపంచంలో ఎవరి బతుకు వాళ్లది. ఎవరి దారి వాళ్ళది. ఆశయాలు, ఆదర్శాలు, అలవాట్లు ఎవరివి వారికి ఉంటాయి. మనకు అసంతప్తులు అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటప్పుడు ఒక మంచిమాట, ఆప్యాయమైన ఒక పలకరింపు, కొంత సానుభూతి, మరికొంత మంచితనం, చేతనైన సాయం, లేనప్పుడు ఉపాయం అందిస్తూ, మనసు నిండిన ఆదరణ చూపడానికి అందరూ ప్రయత్నిస్తే- ఈ సమాజం ఇంతకంటే అందంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది కదా!'' అనేది దక్షిణామూర్తి గారి సదాశయం, సుమనోవాంఛ.
డాక్టర్‌ వేదగిరి రాంబాబు కథానిక శతజయంతి ఉత్సవాలు విజయనగరంలో మొదలెట్టి, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని 23 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు జరిపినప్పుడు- ఆయన వెంట నేనూ, దక్షిణామూర్తి, సుధామ, కొంపెల్ల శర్మ వంటి వాళ్ళం అనేక ప్రదేశాలకు, అనేక వ్యయప్రయాసలకు లోనై వెళ్లడం, రాంబాబుకు వెన్నుదన్నుగా నిలవడం, నా మనసులో చెరగని జ్ఞాపకం. ఆ సందర్భంలో మేము జరిపిన పర్యటనల్లో చివరికి రిజర్వేషన్‌ లేని బోగీలోకి ఎక్కి, రాత్రంతా నిద్ర లేకుండా కూర్చుని ప్రయాణం చేయటం వంటి సంఘటనలు తలచుకుంటే దక్షిణామూర్తి ఎంత నిగర్వియో, ఎంత ప్రశాంత మనస్కులో, వారిది ఎంత సహకార గుణమో, ఔదార్యమో తెలుస్తుంది.
డాక్టర్‌ పోరంకి వారికి ప్రతిష్టాత్మక బహుమతులు, సత్కారాలు, పురస్కారాలు, కొన్ని లభించాయి. అయితే ''బిరుదులు, బహుమతులు వంటివి సఫలమైన జీవితానికి కొలబద్ద కాదు. అని నా నమ్మకం. అవి 'నేను-నాది' అనే వాటి నోరు మూయించి, 'మనం-మనది' అనే భావాన్ని నిలుపుతుంటే, చూపు విశాలమవుతుంది. హదయం అమతకలశం అవుతుంది,'' అని తన జీవిత ఆశయాన్ని చెబుతూ, మరో మాట కూడా అన్నారు: ''అన్ని రంగాలలోనూ శక్తివంచన లేకుండా పని చేసేవాళ్ళు ఎంతో కొంత మంది ఉంటారు. వాళ్లు సాధించిన ఫలితాలు గొప్పవి అనే ప్రశ్నకు తావు లేదని నా అభిప్రాయం. ఫలితాలను ఎవరూ సాధించరు. చిన్న పనులకు కొందరికి ఫలితాలు వస్తాయి అంతే'' అన్నారు ఒక ఇంటర్వ్యూలో.
దక్షిణామూర్తి గారికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లంతా వాళ్ళ, వాళ్ళ పిల్లాపాపలతో వర్ధిల్లుతూ ఉన్నారు. తెలుగు భాషా సాహిత్యాల ప్రాంగణంలో తమ రచనలతో వన్నె చిన్నెల రంగవల్లులు దిద్దిన డాక్టర్‌ పోరంకి వారి మరణం సాహితీలోకానికి తీరని లోటు.

- విహారి,
9848025600

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అండ్‌ క్వయిట్‌ ఫ్లోస్‌ ద డాన్‌
లెక్కలు సరిచేస్తున్న కవిత్వం
నీలో-నాలోనా-అదే వాన
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు
మీ శవానికి ఇక్కడ జాగా లేదు
చంపుడు పందెం!
ప్రగతిశీల కళాసైనికుడు సఫ్దర్‌ హష్మి
యువతరంగ ప్రస్థానం
చేదెక్కిన జీవితం!
పిల్లి మెడకు గంటకట్టేదెవరు?
నివురు
మహాత్మా...!!
అంబేద్కర్‌
17న 'అంబేద్కర్‌ సూర్యుడు' ఆవిష్కరణ
సాహితీ సోపతి పదేండ్ల ప్రస్థానం
'కేరె జగదీష్‌ గారు వందనాలు'
'నిజం' కవిత్వంలో నియోలాగిజమ్‌
కవితాకాశపు తూరుపు అంచున విరిసిన అక్షర నక్షత్రాల రంగుల హరివిల్లు 'నెయిసెస్‌'
తండ హరీష్‌ గౌడ్‌ కు సాహితి పురస్కారం
'తొలి కిరణాలు''
ఏప్రిల్‌ 11 న 'తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌' సదస్సు
నీ కోసం
బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌
అగ్రహారపు టోపోగ్రఫిని గ్లోరిఫరు చేసిన కథలు
ఆసాంతమూ కథలన్నీ నోటికి అందాకా హృదయం నవ్వుతుంది.
చరిత్ర కావాలి
ఆగమాగం బిజీ బిజీ
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
సాహితీ సోపతి పదేండ్ల పండుగ
పీచర్‌ సునీతా రావు అవార్డుల కోసం రచనలకు ఆహ్వానం

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.