Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Feb 15,2021

పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం

వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే వరంగల్‌ పట్టణం ఆర్థిక రాజకీయ సాంస్కతిక విలువలకు కేంద్రంగా భాసిల్లింది. అనేక ఉద్యమాలకు ఆయువు పట్టు వెలుగొందింది. వరంగల్‌లో కమ్యూనిస్టు ఉద్యమం కంచుకోటగా ఉన్న కాలంలో పుడుతూనే ఆ స్ఫూర్తి నింపుకున్నాడు పసునూరి రవీందర్‌.
పాఠశాల స్థాయి నుంచి బాల కళాకారునిగా మొదలైన ప్రస్థానం పదేళ్ల ప్రాయంలోనే ప్రజా నాట్య మండలి కళా వేదికల మీద గజ్జ కట్టి గళమెత్తారు. ఇంటర్మీడియట్‌ స్థాయిలో సజన కారునిగా కొన్ని పాటలు రాయడం మొదలుపెట్టాడు. డిగ్రీలో విద్యార్థి ఉద్యమానికి పాటలు రాసి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఆలోచనను తనదైన దక్పథాన్ని అందించాడు. విద్యార్థి దశ నుండే అనేక సమస్యలను తనదైన వాణిలో బాణీలో వేదికల మీద, సమావేశాలలో ఉర్రూతలూగించాడు. విద్యార్థి ఉద్యమం లో అసువులు బాసిన అమరుల గురించి వామపక్ష పోరాటాల్లో నేల రాలిన త్యాగాలను, విడిచివెళ్లిన మిగిలిన వారి కలలను, తన కలం, గళం పాటల ప్రవాహం సంగమంలా సాగేది. ఆనాటి గీతాలు నేటికీ ప్రజలు పాడుకుంటున్నారు అంటే పసునూరి అక్షరాలు ఔచిత్యానికి, పదునైన భావజాలానికి నిదర్శనం. ఇట్లా విద్యార్థి యువజన కార్మిక కర్షక సమస్యల మీద పసునూరి రచించిన పాటలు ప్రజల నాలుకలలో ఇల్లు కట్టుకున్నాయి. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో పసునూరి రచించిన 'జైకొట్టు తెలంగాణ' పాట లక్షలాది మంది హదయాల్లో వేళ్ళూనుక పోయింది. కాలర్‌ ట్యూన్‌, రింగ్టోన్‌ అయి ఖండాంతరాలకు వ్యాపించి ప్రతి ఫోన్‌లో ఉద్యమ స్మరణయి బీజాక్షర మంత్రంలాగా స్ఫూర్తి నింపేది. ఈ పాట మీద పోటీపరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి. యూ ట్యూబ్‌లో మూడు మిలియన్లలకు పైగా వ్యూస్‌ దాటాయంటే ఆ పాట ప్రజాదరణను మనం అంచనా వేయవచ్చు.
వారి కొన్ని పాటల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
'ఊరువాడ ఏకమయి జై కొట్టరండిరో జైకొట్టు తెలంగాణ / ఇయ్యరమయ్యర వాళ్ళు రయ్యన ఎగేసిండ్రో జై కొట్టు తెలంగాణ' అని తెలంగాణ వాదాన్ని నింపుతాడు.
'విద్యార్థి ఉద్యమ పోరు కెరటాలు వీరులు మా శూరులోయమ్మ చదువుతూ పోరాడి నేలకొరిగారు' అని తెలంగాణ ఉద్యమ కాలంలో అసువులు భాసిన విద్యార్థి యువకుల అమరత్వం గురించి ఆలపి స్తాడు. తెలంగాణ అధికారం ఆత్మగౌరవంతో గోల్కొండ కోటలో జరుపుతున్న జెండా వందనాన్ని గానం చేస్తూ 'గోలుకొండ నిండుగా నవ్వింది / జెండా పండుగ జై జై అంటుంది / పది జిల్లాల పబ్బతి పడుతుంది' అని తెలంగాణ సంబరాన్ని సంతోషాన్ని అస్తిత్వాన్ని ఆలపించారు. 'ఊరువాడ అంతా బోనాలు మట్టి బిడ్డల బోనాలు.. 'చెమట చుక్క బోనాలు / సేను సెలక బోనాలు' అని బోనాల ఆత్మ తత్వాన్ని వివరించాడు. 'కడుపుతీపి నీ కన్న ప్రేమను కాసుల తేగలవా?/ కడదాకా రాగలవా'అని విదేశాలకు వెళ్తున్న బిడ్డలకు కాసుల వేటలో విదేశాలకు పంపుతున్న తండ్రులకు గొప్ప మానవ సంబంధాలు వివరించే అత్యున్నత సందేశాన్ని అందిస్తాడు. పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఆ కట్టడాలు చూసి, విలపిస్తున్న కవిస్వరం దుఃఖ భాస్వరమైతాడు.
'రేలా పాటలు రాగం మూగబోయినాది / దిగులుతో గూడెం కునుకు మరచి నాది. మనపై ఒక దుఃఖపు తెరను విసురుతాడు. జర్నలిస్ట్‌గా వర్క్‌ చేయడం వల్ల జర్నలిస్టు విలువలను పెంపొందిం చడానికి 'నమ్మబోకు నకిలి వార్తను నమ్మబోకు ఫేక్‌ వార్తలు' అంటాడు. 'గద్దచ్చి కోడిపిల్ల నెత్తుక పోయినట్లు / ఉరి మీద రాబందు ఉరుమి ఉరిమి చూసినట్లు ఆడపిల్లల కన్నోల్లారా' అని ప్రస్తుత కాలంలో దుష్కత్యాలను, మానవ అక్రమ రవాణా పరిస్థితిని తెలియజేస్తారు. 'అన్నీ తానై నోడు ఆశల దీపమైనోడు నాన్న / పేరు లేని శిల్పి లాగా కడదాకా బ్రతికేటోడు నాన్న'అని నాన్న విశిష్టత చక్కగా విశ్లేషిస్తాడు.
బహుజన ఉద్యమంలో పసునూరి దారి విభిన్నం. వినూత్నమైన అభివ్యక్తి. ఆలోచనతో ఆశే స్పూర్తిని రగిలించాయి. బహుజన నేతల త్యాగాలను అంకిత భావాన్ని ఆచరణ నేటి తరానికి కర్తవ్యాన్ని బోధించేది సందేశం ఇస్తున్నాయి.
స్వేరో అనగా ఆకాశమే హద్దుగా సాగిపో అనే సూక్తితో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు పసునూరి పాట ప్రార్ధన గీతం. బుద్ధుని జ్ఞానబోధలం / శ్రమణుల తేజ దీప్తులం / సర్వమంగళం / బాబాసాహెబ్‌ బిడ్డలం / బాధ్యత వీడని సాహసులం / జై హౌ స్వేరో' అని లక్ష్యాన్ని గురి పెట్టిన అస్త్రంలా మస్తిష్కంలో వాస్తవ విషయాలను సంధిస్తాడు.
కళాకారులలో కొంతమంది రాస్తారు. మరికొంత మంది పాడతారు. రాసి పాడేవాళ్ళే వాగ్గేయకారులు. పసునూరి ఈ కాలపు బహుజన వాగ్గేయకారుడు. ఇప్పటి వరకే వందకు పైగా పాటలు రాసి పలు ఆల్బంలలో స్వయంగా పాడి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. పదాల్లో పస. పాటల్లో వాసి. ఆదరణలో మేటిగా ఉన్న పాటలు సినీ ఇండిస్టీలో తాకాయి. సంత, విరాట పర్వం, ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ వంటి సినిమాలలో బహుళ ఆదరణ పొందాయి. బతుకమ్మ పండుగ సందర్భాల్లో పసునూరి రచించిన పాటలకు లక్షల్లో వ్యూస్‌ లభించాయి.
అభిరుచి మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో పాట మీద పీహెచ్డీ పూర్తి గావించి విమర్శకుల ప్రశంసలు పొందారు. గ్రంధానికి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్‌ ఉత్తమ పరిశోధన గ్రంథం సురవరం ప్రతాపరెడ్డి అవార్డు యాభై వేల రూపాయలు లభించాయి. పసునూరి రవీందర్‌కి ఎర్ర ఉపాలి అవార్డు దక్కడం అభినందనీయం. అక్షరాల అగ్గిబరాటా, జంబుద్వీప స్వాప్నికుడు. మనువు విరోధంపై నిరసన అలంకారమై అంకితమైన నిప్పుల తప్పెట. జీవితమంతా ధిక్కారమై బతికిన ఎర్ర ఉపాలి నేనే. పాటై, పదమై, కవితై జంబుద్వీప కలలు కన్న ఆధునిక వాగ్గేయకారులు ఇండియన్‌ బాబ్‌ మార్లే ఎర్ర ఉపాలి తొలి అవార్డ్‌ పసునూరి రవీందర్‌కు ఈ నెల 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రదానం చేస్తున్న సందర్భంగా...

- డా. సిద్దెంకి యాదగిరి,
9441244773

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అండ్‌ క్వయిట్‌ ఫ్లోస్‌ ద డాన్‌
లెక్కలు సరిచేస్తున్న కవిత్వం
నీలో-నాలోనా-అదే వాన
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు
మీ శవానికి ఇక్కడ జాగా లేదు
చంపుడు పందెం!
ప్రగతిశీల కళాసైనికుడు సఫ్దర్‌ హష్మి
యువతరంగ ప్రస్థానం
చేదెక్కిన జీవితం!
పిల్లి మెడకు గంటకట్టేదెవరు?
నివురు
మహాత్మా...!!
అంబేద్కర్‌
17న 'అంబేద్కర్‌ సూర్యుడు' ఆవిష్కరణ
సాహితీ సోపతి పదేండ్ల ప్రస్థానం
'కేరె జగదీష్‌ గారు వందనాలు'
'నిజం' కవిత్వంలో నియోలాగిజమ్‌
కవితాకాశపు తూరుపు అంచున విరిసిన అక్షర నక్షత్రాల రంగుల హరివిల్లు 'నెయిసెస్‌'
తండ హరీష్‌ గౌడ్‌ కు సాహితి పురస్కారం
'తొలి కిరణాలు''
ఏప్రిల్‌ 11 న 'తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌' సదస్సు
నీ కోసం
బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌
అగ్రహారపు టోపోగ్రఫిని గ్లోరిఫరు చేసిన కథలు
ఆసాంతమూ కథలన్నీ నోటికి అందాకా హృదయం నవ్వుతుంది.
చరిత్ర కావాలి
ఆగమాగం బిజీ బిజీ
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
సాహితీ సోపతి పదేండ్ల పండుగ
పీచర్‌ సునీతా రావు అవార్డుల కోసం రచనలకు ఆహ్వానం

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.