Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులు పగబట్టినప్పుడు
ద్రోహులు పొగబెట్టినప్పుడు
నువ్వు నట్టేట మునిగినప్పుడు
వేరే గట్టేదీ దొరకనప్పుడు
తప్పదంటే తల తాకట్టు పెట్టేరు
మరలా చిగురించే కలయినా తోడుంటుంది
ఎట్టి స్థితిలోనూ ఆత్మను అమ్మకానికి పెట్టకు
అరచేతులు వట్టివైనా,
వాటిని తాకట్టు పెట్టకు
మట్టిలో వేళ్ళులాంటివవి
ఎప్పటికైనా,
నిన్ను మానవ మహా వక్షంగా నిలిపేవి
- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.
94408 36931