Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అస్తమిస్తున్న తడి ఆరిన సంధ్య పెదవుల మీద
ఎర్ర సూర్యుడు ఎక్కడో, వాడి రాలిపోతున్నప్పుడల్లా...,
జీవన రెక్కల ప్రాణులు
సాహస గాథలు చెప్పుతూనే వున్నయి,
భూమి విత్తనంగా మనిషి రైతు చెట్టైన
చెట్టుమీద.., గూటిలోని పిచ్చుక పిల్లలకు-
మట్టి శ్రమ శిల్పం కోల్పోతున్న కథ... ఒక రాత్రి
మట్టి బొడ్డు చుట్టూ మూడు తలల కార్పొరేట్ అతిపెద్ద
సర్పం చుట్టుకున్న, కొత్త చట్టాల కథ... ఒక రాత్రి
కథ... కథ.. ఒక్కటే కథ!
దు:ఖ ధ్వనుల కథ... దిక్కార కథ...
గురుజాడ కొత్త జాడలోకి జారిపోతున్న కథ...
దేశ భక్తి గీతం ఆత్మ హత్య కథ... కొత్త ముఖం కవి
పాలక కథ... కథలు ఎన్నో..!
చలిగాలికి రంగులు తారుమారైన జాతి జెండా కథ...
హిమ పొరల మధ్య స్పర్శ కోల్పోయిన దేశం తల కథ...
ఇప్పుడు రాత్రి పగలు ఒక్కటే..
తల స్పర్శ వెతుక్కుంటున్న జెండాలేని దేశం కథ...
దేశం ఒక కథగా మళ్ళీ... ఒక రాత్రి
సాహస గాథలు : మనిషి రైతు చెట్టైన చెట్టు కథ
బహుశా ఇది జమ్మి చెట్టు కథనేమో..!!
- జనజ్వాల,
9949163770