Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సాహిల్‌ ఎందుకు రావాలి? | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

సాహిల్‌ ఎందుకు రావాలి?

అఫ్సర్‌ రాసిన 'సాహిల్‌ వస్తాడు' పుస్తకం గురించి నాకు నాలుగు మాటలు రాయాలనిపించింది. మనం ఏ పుస్తకం గురించైనా రాస్తున్నామనగానే సమీక్షనా అని అడుగుతుంటారు. ఇది సమీక్ష కాదని నేననుకుంటా. ఎందుకో కానీ దీన్ని సమీక్ష అనలేను, ఇది పూర్తిగా నాకు సంబంధించిన అనుభూతి. కాకపోతే నలుగురితో పంచుకోవాల్సిన అవసరం పెరిగి పెరిగి ఇది రాయాలనిపించిందంతే.
నేనొకసారి లక్డీకపూల్‌ నుంచి మణికొండ వెళ్లాలి. సాయంత్రం ఏడు దాటింది. పీక్‌ అవర్స్‌ కాబట్టి మామూలుగానే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది. ఊబర్‌ బైక్‌ బుక్‌ చేసి వెయిట్‌ చేస్తున్నా. ఆ అబ్బాయి పేరు రహీమ్‌, పల్సర్‌ బండి. దగ్గర్లోనే ఉన్నాడు కానీ ఎంతకూ రావడం లేదు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యడు. నా ఫోన్‌ ఏమో చార్జ్‌ అయిపోతోంది. అసలు వస్తాడా రాడా అని చూస్తున్నా, మొత్తానికి వచ్చేశాడు. నేనేం అడగకున్నా ఏదో కారణం చెప్పి ట్రిప్‌ స్టార్ట్‌ చేశాడు.
ట్రాఫిక్‌లో పడిపోతున్నాం. కాసేపటికి అతనే మాట కలిపాడు - ''క్యాషా సార్‌?'' అని. కాదు ఆన్‌లైన్‌ పేమెంట్‌ అని చెప్పా. అక్కణ్నుంచి మొదలుపెట్టాడతను గొణగడం. ''అరె క్యా సార్‌'', ''క్యాష్‌ లేకుంటే ఎట్ల?'' అని ఇలా ఏదో ఒకటి. నాకు విసుగొస్తోంది అతను అలా గొణుగుతూ ఉన్న ప్రతీసారి. ఏం మాట్లాడలేదు నేను.
చాలాసేపటికి ''మా అమ్మ ఎదురుచూస్తుంటది'' అన్నాడు.
నా అటెన్షన్‌ సంపాదించుకున్నాడు- ''ఎక్కడుంటరు మీరు?''
''మలక్‌పేట్‌. భయపడుతుంటది అమ్మ'' అన్నాడు.
''భయం దేనికి?''
''నేను ఇంత దూరం వచ్చిన అని తెలిస్తే భయపడ్తది సార్‌.''
''హైదరాబాదేగా ఇది!''
అతనెందుకో ఒక్కసారే నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెట్టాడు- ''హైదరాబాదే! కానీ అమ్మ ఇంటికి దగ్గర దగ్గర్లనే పని చేస్కోమని చెప్తది. ఇంత దూరం వచ్చిన అని తెలిస్తే భయపడ్తది'' అన్నాడు.
''ఎందుకట్ల?''
నవ్వాడు. ''ఆజ్‌ కల్‌ కైసే హై సాబ్‌! ముసల్మాన్‌ అనంగనే ఎవరు కొడ్తరో అని భయం. ఇంటికి దగ్గరే అయితే ఎట్లనో తప్పించుకోవచ్చు. ఇంత దూరం వచ్చిన అంటే ఏమన్న ఉందా? చీకటి పడకముందే ఇంటికి రా అంటది అమ్మ. అమ్మ కోసమే తొందరగ పోత. కానీ దూరం పోకుంటే పైసలు ఎట్లొస్తరు? ఆప్‌ క్యా.. క్యాష్‌ పేమెంట్‌ బీ నహీ దేరయిహై'' అన్నాడు.
ఆన్‌లైన్‌ పేమెంట్‌ అయితే వాళ్ల ఎకౌంట్స్‌లో వారానికి ఒకసారి వేస్తారట ఊబర్‌ వాళ్లు. డబ్బులయితే అప్పటికప్పుడు అవసరానికి పనికొస్తాయి కదా!
లొకేషన్‌ దగ్గరికి చేరగానే ట్రిప్‌ ఎండ్‌ చేశాక అతనితో అన్నా- ''ఏం భయపడకు. జాగ్రత్తగ ఇంటికిపో'' అని.
నేను చాలాసార్లు తీసుకున్న ఊబర్‌ ట్రిప్స్‌ లాగానే ఇది కూడా డెస్టినేషన్‌ దగ్గర నేను ఎవ్వరితోనైనా ఎప్పుడూ చెప్పే మాటతోనే ఎండ్‌ అయిపోయింది.
కానీ ఆ రహీమ్‌ మాత్రం ఆ తర్వాతి క్షణం నుంచి నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. చిన్నవాడు, పాతికేళ్లు కూడా ఉండవు. దేనికి అంత భయపడుతున్నాడు? ఒక మనిషికి ఇంత పెద్ద సమాజం భయాన్నే ఎందుకివ్వాలి?
ఇది జరిగి నెలలైనా నన్ను ఆ ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ మధ్యే ఎందుకో.. నేనెప్పుడో ఏడేళ్ల క్రితం 'తెలంగాణ కథ'లో చదివిన ఒక కథ గుర్తొచ్చింది- 'సాహిల్‌ వస్తాడు'. ఆ పేరుతోనే అఫ్సర్‌ కథల పుస్తకం పోయిన ఏడాది వచ్చింది. ఆ పుస్తకం ఇంట్లోనే ఉంది గానీ ఎప్పుడూ చదవలేదు.
కరోనా వైరస్‌ కాలం, ఒక మధ్యాహ్నం పూట. ఒక్కసారి ఆ పుస్తకాన్ని తీసి చూశా. 'గోరీమా' కథ చదివా. ఈ పుస్తకం నేను వెంటనే పూర్తి చేసేది కాదనిపించింది. చాలాకాలం తర్వాత ఊరికెళ్లిన అతను ఊరిని గుర్తు తెచ్చుకుంటాడు. గోరీమాని గుర్తు తెచ్చుకుంటాడు. గోరీమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆమె కొంగు చుట్టూ చేరి ఆడుకున్న గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ గతంలో ఉన్న అందమేదో ఇప్పుడు లేకపోవడం అతనికి తెలుసు. ఆ ఊరు ఊరిలా లేదన్నది కూడా అర్థమవుతుంటుంది. సొంతవాళ్లు సొంతవాళ్లలా లేరు. కానీ గోరీమా చేసిన ఒక పోరాటం మాత్రం అతనికి బాగా గుర్తుంటుంది. అతను అన్నేళ్ల తర్వాత ఊరికి తిరిగొచ్చి, తిరిగి ఇంకోసారి మోసుకెళ్లేది గోరీమా జ్ఞాపకాలనే.
ఎందుకోగానీ ఈ కథను చదివిన వెంటనే రెండోసారి చదివా. వెంటనే రెండో కథకి దూకాలనిపించలేదు. ఆ కథ బరువును కాసేపు మోయాలనిపించింది.
ఆ తర్వాత మళ్లీ అలాంటి మధ్యాహ్నమే 'ముస్తఫా మరణం' చదివా. ఒకరోజు 'చమ్కీ పూల గుర్రం', ఇంకోరోజు 'సహేలీ'.. రెండు కథలను ఒకేరోజు ఎప్పుడూ చదవలేదు నేను. 'సాహిల్‌ వస్తాడు' చదివినప్పుడు నేను అప్పుడెప్పుడో చదివినప్పటికంటే ఇప్పుడు ఈ కథ అవసరం ఎంత ఉన్నదో కదా అనిపించింది.
ఎందుకుంది అవసరం?
ముస్లింల మీద ఎన్నెన్ని చోట్ల ఎన్ని రకాలుగా కుట్ర జరుగుతున్నదో ఇవ్వాళ మనం చూస్తున్నాం. తన పని తాను చేసుకునే ఒక అతి మామూలు ఊబర్‌ డ్రైవర్‌... ఇంటికి దూరంగా కొంచెం దూరం పోవాలంటే భయపడుతున్నాడు. ఇంటి దగ్గర అమ్మ ఎదురుచూస్తుందన్నాడు. అందరిలాగే నా కొడుకు ఇంటికొస్తాడని ఎందుకు అనుకోలేకపోతోందామె?
ఇస్లామోఫోబియా ఒక ట్రెండ్‌ అయిపోయింది ఈ మధ్య. అదొక విషం. కొత్తగా ఆ విషాన్ని ఎక్కించుకుంటున్న వాళ్లెవ్వరికీ అది విషమని తెలియకపోవచ్చు. ఎవరు చెప్పాలి మరి వాళ్లకు? ఒక కథ చెప్తుందా? చెప్తుందేమో కానీ ఎప్పుడు?
ఆ కథ జీవితాల నుంచి వచ్చినప్పుడు.
'సాహిల్‌ వస్తాడు' కథలన్నీ అచ్చంగా జీవితం నుంచి వచ్చిన అలాంటి కథలు. ముస్లిం కుటుంబాలు, ఇళ్లు, మాటలు, నమ్మకాలు, ఇష్టాలు.. అన్నీ ఉన్నాయి ఈ కథల్లో. ఒక్కొక్క కథలోంచి వాటిని ఏరుకొని చూసినప్పుడల్లా కన్నీళ్లొస్తాయి, మన చూపులో పేరుకుపోయిన మలినమంతా తుడిచిపెట్టేందుకేనేమో!
'సాహిల్‌ వస్తాడు' కథలో.. ''నాన్నా సాహిల్‌ మామూ వస్తాడు.. మాతో ఆడుకుంటాడు'' అని చెప్తుంది తితలీ. అమాయకపు ప్రాణాలు. మతాలు, కులాల పట్టింపు లేకుండా ప్రేమించడంలోనే బతికేస్తుంటాయి. సాహిల్‌ వస్తాడు కథలన్నింటిలో అమాయకపు ప్రాణాలు ఉన్నాయి. అవన్నీ ముస్లిం జీవితాలే. ఆ ముస్లిం జీవితాల్లో ఎవరినో భయపెట్టే ఆలోచనలు లేవు, ఎవరిపైనో కోపం కూడా లేదు. ఎప్పట్లానే అతి మామూలుగా బతికేస్తున్నాయంతే.
ఈ కథలన్నీ చదివితే.. సరిగ్గా ఈ రోజున సాహిల్‌ అనేవాడు ఎందుకు రావాలో అర్థమవుతుంది. ఒకవేళ సాహిల్‌ రాలేకపోతే.. నేను కలిసిన రహీమ్‌ ఇంటికి పోలేడేమో అన్న భయం నన్ను జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది!
ఇంకొన్ని మాటలు....
సాహిల్‌ వస్తాడు (మరికొన్ని కథలు), రచన : అఫ్సర్‌, ప్రచురణ : చాయా పబ్లికేషన్స్‌
మొత్తం 11 కథలున్న ఈ పుస్తకంలో అన్ని కథలూ చదివించేవే. సగానికి పైగా కథలు కచ్చితంగా వెంటాడతాయి. అఫ్సర్‌ గొప్ప కవి. అయినప్పటికీ అతను కవితలకన్నా కథలు రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతాడని అనుకుంటా. ఈ కథల్లో అఫ్సర్‌లోని రచయితను అప్పుడప్పుడు కవి కదిలిస్తుంటాడు. మాటల మధ్యలో జొరబడుతుంటాడు. కొన్నిసార్లు నేనే 'ఎందుకొచ్చావు కవి అఫ్సర్‌' అనాలనుకుంటాను. ఇంకొన్నిసార్లు 'అరె, అఫ్సర్‌, బాగా చెప్పావిది' అంటాను. అఫ్సర్‌ వాక్యం చెక్కినట్టు చాలా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చిన కొన్నింటిని ఇక్కడ పెడుతున్నా-
నమాజ్‌ చదవడమంటే నాకు చాలా ఇష్టం. అది దైవకార్యం అనో ఇంకొకటనో నాకు తెలియదు. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అంతే!
ఎవరూ లేని నాలుగు చేతులు మాత్రమే ఎత్తి నిల్చున్న వొంటరి చార్మినార్‌. వచ్చీ రాని నిద్రలో వెంటాడే కల- చార్మినార్‌.
ఈ పొద్దున వాడు వచ్చేసి ఉంటే బాగుండేది.. అని అప్పటికే పాతిక ముప్ఫై సార్లు లోపలా, ఇంకొ డజను సార్లు పైకే అనుకున్నాను. కానీ, పొద్దున ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి సాయంత్రం సజావుగా వస్తాడో రాడో తెలియని ఈ నగరపు బతుకులో- మతం అనేది చివరికి కలహ కారణంగానే మిగిలి పోయిన ఈ రోజూవారీ హింసలో...
- వి. మల్లికార్జున్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కవి కాలంతో పరిగెత్తాలి
బాల సాహిత్య సంపన్నుడు వాసాల నర్సయ్య
ఆగిన అంతశ్చేతన
ఒక జ్ఞాపకం
పల్లె బస్సు
పువ్వులా విచ్చుకునే వరకు
రైతు స్టేటస్‌..!
SORRY DEAR..!?
చేరా రచనల కోసం..
'ఏ క్రిస్మస్‌ కెరోల్‌' చార్లెస్‌ డికెన్స్‌ నవల : ఒక పరిశీలన
భాషాసాహిత్యవేత్త పోరంకి దక్షిణామూర్తి
పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం
ఉన్నారా...?
సాహితీ వార్తలు
కన్నీటి చుక్కలు
అక్షర సంఘీభావం..!
ఆత్మను అమ్మకు
కొత్తవాక్యాల కవిత్వం 'ఇన్‌బాక్స్‌'
అచ్చమైన కవి
కంచంలో మేకులు..!
లుప్తమౌతున్న విలువల వేదనా స్రవంతి
సెమటగుళిక
గోస
బరి
వలస బతుకుల ఛిద్ర కవిత్వం-దుఃఖపాదం
'కాలం నేర్పిన పాఠం' కథాసంపుటి- ఒక అవలోకనం
నేలబిడ్డలది కూడా...
తలవొంచని గర్వం నా జెండా
దేశం ఓ కథగా మళ్ళీ.. ఒక రాత్రి!
ఒక అనుభవం తర్వాత

తాజా వార్తలు

03:57 PM

భారత దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా సరికొత్త రికార్డు

03:48 PM

బర్డ్ ఫ్లూ కలకలం.. 21 రోజులపాటు చికెన్ షాపులు బంద్

03:38 PM

పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

03:28 PM

బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి

03:16 PM

కాంగ్రెస్ కార్యకర్తలు గీతదాటితే కఠిన చర్యలు..

03:08 PM

అరెస్ట్ అయిన రైతుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతికి రైతుల లేఖ

02:57 PM

సీఎం కీలక నిర్ణయం.. 9,10,11 తరగతుల విద్యార్ధులకు శుభవార్త..

02:40 PM

కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ సర్కార్ ను హెచ్చరించిన హైకోర్టు

02:26 PM

పెళ్లి బరాత్ లో కొత్త జంటపై రాళ్లతో దాడి..

01:46 PM

పెట్రోధరలపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

01:25 PM

నగరంలో భారీ ట్రాఫిక్ జామ్...

12:45 PM

ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు

12:11 PM

రేపు భారత్‌ బంద్‌

12:02 PM

అడ్డాకులలో ఆటో డ్రైవర్ అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి

11:42 AM

ఘట్‌కేసర్‎ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం

11:35 AM

చిరుత దాడిలో నాలుగు మేకలు మృతి

11:24 AM

ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం

11:11 AM

పాత‌బ‌స్తీ‌లో పోలీసుల త‌నిఖీలు..పేలుడు ప‌దార్థా‌లు ల‌భ్యం

11:09 AM

యూసుఫ్‌గూడలో దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ...

10:56 AM

ఒకే స్కూల్ లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

10:27 AM

కాళేశ్వరం మరో ఘనత

10:11 AM

ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

09:51 AM

కూతురి భర్తతో తల్లి జంప్..మనవడు పుట్టేసరికి..!

09:37 AM

హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం..50 గొర్రెలు మృతి

08:57 AM

మహిళను చంపి..ఆమె గుండెను ఆలుగడ్డలతో కలిపి కర్రీ చేసి..!

08:30 AM

మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్..చిన్నకూతురిని చంపింది.!

08:20 AM

ఇబ్రహీంపట్నంలో పాత కక్షలకు వ్యక్తి బలి

08:13 AM

బంగారు గనిలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

08:06 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

07:39 AM

మహబూబ్‌నగర్‌లో దారుణం..బాలుడి గొంతు నులిమి హ‌త్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.