Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అలిశెట్టి యాదిలో... | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

అలిశెట్టి యాదిలో...

హైదరాబాద్‌లో నేను ఎం.ఏ. తెలుగు చదువుతున్నపుడు ఉస్మానియా క్యాంపస్‌లో ప్రతి ఉదయం అలిశెట్టి 'సిటీ లైఫ్‌' కోసం కండ్లు నలుచుకుంటూ నిద్ర లేచే వాళ్ళం. ఆంధ్రజ్యోతి దినపత్రిలో అలిశెట్టి ప్రభాకర్‌ ఐదారు లైన్ల సిటీలైఫ్‌ కవిత ఎందరినో సమ్మోహన పరిచేది. ఆనందం, ఆవేశం, ఆక్రోశం అన్నీ కలిపి అలిశెట్టి వర్తమాన సమాజాన్ని కడిగి పడేసేవాడు. రక్త రేఖ, సంక్షోభ గీతం, ఎర్ర పావురాలు, లాంటి వచన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవిగా పేరుగాంచినా, సిటీలైఫ్‌ మినీ కవితలతో మాస్‌ పబ్లిక్‌కు, ముఖ్యంగా యువతకు మరింత దగ్గరైండు.
అనుకోకుండా ఒక రోజు నామిత్రుడు గోపి కిషన్‌ సింగ్‌ ఎల్‌.ఎల్‌.బి. విద్యార్థి. ఇప్పుడు లాయర్‌ నన్ను అలిశెట్టి ఇంటికి తీసుకెళ్లిండు. గోపి కిషన్‌తో అప్పుడప్పుడు అలిశెట్టి ఇంటికి వెళ్లడం వల్ల మా పరిచయం మరింత గట్టి పడింది. అలిశెట్టిని కలిసినప్పుడల్లా ఏదో ఒక కవిత నగిషీలతో తొణికిసలాడేది. కవితకు తగిన భావంతో బొమ్మ గీసేవాడు. వచ్చిపొయ్యె వారు దాని పుట్టుపుర్వోత్తరాలు చర్చించుకునేవారు.
కల్లోల కరీంనగర్‌లో 1954లో జన్మించిన అలిశెట్టి పేదరికం చివరంచుదాకా చివరి శ్వాస దాకా చవిచూసిండు. ఫొటో గ్రఫీ, కవిత్వం రెండూ అతనికి పిచ్చిప్రేమ. చిత్రమైన జీవితాలను, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మస్కట్‌, దుబాయి వలసబతుకుల గోసలను చిత్రాలుగా మలిచిన గొప్ప అక్షర శిల్పి అలిశెట్టి. అస్తిపంజరంలో శ్వాస తప్ప ఏమీలేని శరీరం,ఉంగరాల క్రాఫింగ్‌, ఐదు నిమిషాలకు ఒకసారి తెమడ దగ్గు, ఆయాసం, ఈ క్షయవ్యాధి అతన్ని రోజూ కొంచెం కొంచెం కొరుక్కు తింటున్నా అతనిలో కవిత్వ జిజ్ఞాస తగ్గలేదు. కవిత్వమే అతని కుటుంబాన్ని బతికించింది. సినిమా డైరెక్టర్లు ఎందరు వారించినా వినలేదు. ఒక్క వ్యాపార పాటా రాయలేదు. అతని కవిత్వ నిబద్ధతని చంపుకోలేదు. అతని కవితలు వేమన పద్యాల్లాగా బాణాల్లాగా గుచ్చుకుంటాయి. బుల్లెట్‌ లాగా దూసుకెళ్తాయి. అందుకే అతడు దోపిడిలేని సమాజాన్ని కోరుకునే వారికి ఆత్మీయుడైండు.
మామూలుగా ఒక రోజు నల్లకుంటలో ఉన్న ప్రభాకర్‌ ఇంటికెల్తుంటే అతని ఇంటి దగ్గర కారు మీద చెయ్యి పెట్టి నిల్చున్న తెల్లటి పెద్ద మనిషి నన్ను పిలిచి ''అలిశెట్టి ప్రభాకర్‌ ఇల్లు ఎక్కడుంది'' అని అడిగిండు. నేనూ అతని దగ్గరకే వెల్లున్నా అదిగో అ కనబడేదే. రండి అంటూ తీసుకెళ్లిన. ఇద్దరం ప్రభాకర్‌ ముందు కూర్చోని మాట్లాడుతున్నాం. ''నీ సిటీలైఫ్‌ కవితలు నన్ను చాలా కదిలించినయి. అవి నాకెంతో నచ్చుతున్నయి'' అన్నాడు. చాలా థాంక్స్‌ సర్‌ అన్నడు ప్రభాకర్‌. ''ఏం జెయ్యాలే సార్‌. ఈ కవిత్వమే నా కుటుంబాన్ని నడిపిస్తున్నది'' అనగానే ఆ డాక్టరు కండ్లు, నా కండ్లు కన్నీళ్లతో నిండిపొయ్యాయి. ''నేను ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ డాక్టరుని. నీకున్న టీబీని నయం చేసే ప్రయత్నం చేస్తా. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిపోండి'' అనగానే, ఈ కవితలు రోజూ రాసి పంపిస్తే ఆంధ్రజ్యోతి వాళ్లు నెలకు తొమ్మిది వందలిస్తున్నారు. నేను హాస్పిటల్‌లో ఉంటే ఇక్కడ నా భార్యా ఇద్దరు కొడుకుల పరిస్థితి ఎట్లా?'' అని జవాబిచ్చాడు. డాక్టర్‌ ఎంత సర్ది చెప్పినా వినలేదు. చాలా సార్లు అతని మిత్రులు ఆత్మీయులు చాలా ప్రయత్నం చేసినా వినలేదు. గంట కాలంలోనే ఒక ప్రజాకవి జీవితాన్ని పరీక్షించిండు డాక్టరు. అతను వట్టి ప్రభాకరుడు కాదు కదా! నిబద్ధత కవి, నికార్సైన విప్లవ కవి. ఈ డాక్టరు తీరే జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌. ఇతని కవిత్వాభిమానియై ప్రభాకర్‌ ఇద్దరు పిల్లల్ని హైస్కూల్‌ దాకా ఉచితంగా చదివించాడు.
అప్పుడు నేను ఎం.ఏ., చదువుతూనే ఆకాశవాణి హైదరాబాద్‌ యువవాణిలో కాజువల్‌ అనౌన్సర్‌ కమ్‌ ప్రొడక్షన్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నాను. ఒక రోజు ప్రభాకర్‌ వద్దన్నా ఒప్పించి రేడియో స్టేషన్‌కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశాను. అలిశెట్టి ప్రభాకరంటే సినారె, శేషేంద్ర లాగా హుందాగా, ఠీవిగా ఉంటారనుకున్నారు. కాని అతన్ని చూడడానికి గుమిగూడిన ప్రోగ్రామ్‌ ఆఫీసర్స్‌, సిబ్బంది ఆశ్చర్యపోయారు. మెట్ల ద్వారా పైకి వెళ్లడానికే అరగంట సమయం పట్టింది. అలిశెట్టి గారిని వారంతా ప్రత్యేకమైన అభిమానంతో మంచి నీళ్లు, టీ తెప్పించి మా ఇంటర్వ్యూ అయ్యేదాక అక్కడే ఉండిపోయారు. అతనికొచ్చే ఏఐఆర్‌ డబ్బుల సంగతి గురించి నారాయణ నాకోసం ఎందుకింత తండ్లాడుతున్నవ్‌ అన్నడు. తరువాత అతన్ని సిబ్బంది గేటు దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అప్పుడప్పుడు అలిశెట్టి సిటీ లైఫ్‌ పుస్తకాలను తీసుకొచ్చి ఆదిలాబాద్‌లో అమ్మి డబ్బు ఇచ్చేవాణ్ణి. ఒక కవికి అభిమానిగా ఇంతకన్నా ఏమి చేయలేకపోయాను.
అలిశెట్టి మరణించడానికి వారం రోజులు ముందు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోయింది. అయినా కవిత్వం రాయడం మానుకోలేదు. చివరి దినాల్లో ''గుండె నిండా బాధ కళ్లనిండా / నీళ్లున్నప్పుడు / మాట పెగలదు కొంత సమయం కావాలి దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై / హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి / భారమవుతున్న ఉచ్ఛాసనిశ్వాసల మధ్యే / మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి'' అంటూ మరణానికి ముందు తన శారీరక మానసిక ఇబ్బందుల్ని ధైర్యంగా చెప్పాడు. తన జీవితంలో పూర్ణాకాశమైన భార్య భాగ్యం గురించి చివరి దినాల్లో ''తెర వెనుక మృత్యువు / తేలగా కదలాడుతున్నట్టు / తెరలు తెరలుగా దగ్గు / గుండెల్ని పిండేస్తుంటే / తెగిన తీగను సవరించడానికన్నట్లు / తెల్లవార్లు సపర్యలు చేసే / నా భాగ్యమే / నా కన్నీళ్లను తూచే / సున్నితపు త్రాసు'' అన్నాడు.
1993 జనవరి 12వ తేదీన అలిశెట్టి మరణ వార్తను ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం విషాదంగా చెప్పగానే ఎక్కడలేని దు:ఖం సాహితీ లోకాన్ని ఆవరించింది. ''మరణం నా చివరి చరణం కాదు అని నిర్భయంగా నిష్క్రమించాడు. తెలుగు సాహితీ లోకాన్ని ఎంతో ప్రభావితం చేసిన ప్రభాకర్‌ మన మధ్య లేకపోయినా ''తనువు శవమై ఒకరివశమై / తాను పండై ఒకరికి పండై / ఎప్పుడూ ఎడారై / ఎందరికో ఒయాసిస్సై'' కవిత రోజూ ఏదో ఒక సాహితీ సభలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రభాకర్‌ నిష్క్రమించినా అతని అక్షరాలు రగిలిస్తూనే ఉంటాయి. అందుకే అతడు అక్షర ప్రభాకరుడు.
(12.01.2021 అలిశెట్టి జయంతి, వర్థంతి సందర్భంగా)

- డా|| ఉదారి నారాయణ,
9441413666

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కవి కాలంతో పరిగెత్తాలి
బాల సాహిత్య సంపన్నుడు వాసాల నర్సయ్య
ఆగిన అంతశ్చేతన
ఒక జ్ఞాపకం
పల్లె బస్సు
పువ్వులా విచ్చుకునే వరకు
రైతు స్టేటస్‌..!
SORRY DEAR..!?
చేరా రచనల కోసం..
'ఏ క్రిస్మస్‌ కెరోల్‌' చార్లెస్‌ డికెన్స్‌ నవల : ఒక పరిశీలన
భాషాసాహిత్యవేత్త పోరంకి దక్షిణామూర్తి
పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం
ఉన్నారా...?
సాహితీ వార్తలు
కన్నీటి చుక్కలు
అక్షర సంఘీభావం..!
ఆత్మను అమ్మకు
కొత్తవాక్యాల కవిత్వం 'ఇన్‌బాక్స్‌'
అచ్చమైన కవి
కంచంలో మేకులు..!
లుప్తమౌతున్న విలువల వేదనా స్రవంతి
సెమటగుళిక
గోస
బరి
వలస బతుకుల ఛిద్ర కవిత్వం-దుఃఖపాదం
'కాలం నేర్పిన పాఠం' కథాసంపుటి- ఒక అవలోకనం
నేలబిడ్డలది కూడా...
తలవొంచని గర్వం నా జెండా
దేశం ఓ కథగా మళ్ళీ.. ఒక రాత్రి!
ఒక అనుభవం తర్వాత

తాజా వార్తలు

03:57 PM

భారత దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా సరికొత్త రికార్డు

03:48 PM

బర్డ్ ఫ్లూ కలకలం.. 21 రోజులపాటు చికెన్ షాపులు బంద్

03:38 PM

పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

03:28 PM

బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి

03:16 PM

కాంగ్రెస్ కార్యకర్తలు గీతదాటితే కఠిన చర్యలు..

03:08 PM

అరెస్ట్ అయిన రైతుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతికి రైతుల లేఖ

02:57 PM

సీఎం కీలక నిర్ణయం.. 9,10,11 తరగతుల విద్యార్ధులకు శుభవార్త..

02:40 PM

కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ సర్కార్ ను హెచ్చరించిన హైకోర్టు

02:26 PM

పెళ్లి బరాత్ లో కొత్త జంటపై రాళ్లతో దాడి..

01:46 PM

పెట్రోధరలపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

01:25 PM

నగరంలో భారీ ట్రాఫిక్ జామ్...

12:45 PM

ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు

12:11 PM

రేపు భారత్‌ బంద్‌

12:02 PM

అడ్డాకులలో ఆటో డ్రైవర్ అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి

11:42 AM

ఘట్‌కేసర్‎ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం

11:35 AM

చిరుత దాడిలో నాలుగు మేకలు మృతి

11:24 AM

ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం

11:11 AM

పాత‌బ‌స్తీ‌లో పోలీసుల త‌నిఖీలు..పేలుడు ప‌దార్థా‌లు ల‌భ్యం

11:09 AM

యూసుఫ్‌గూడలో దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ...

10:56 AM

ఒకే స్కూల్ లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

10:27 AM

కాళేశ్వరం మరో ఘనత

10:11 AM

ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

09:51 AM

కూతురి భర్తతో తల్లి జంప్..మనవడు పుట్టేసరికి..!

09:37 AM

హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం..50 గొర్రెలు మృతి

08:57 AM

మహిళను చంపి..ఆమె గుండెను ఆలుగడ్డలతో కలిపి కర్రీ చేసి..!

08:30 AM

మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్..చిన్నకూతురిని చంపింది.!

08:20 AM

ఇబ్రహీంపట్నంలో పాత కక్షలకు వ్యక్తి బలి

08:13 AM

బంగారు గనిలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

08:06 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

07:39 AM

మహబూబ్‌నగర్‌లో దారుణం..బాలుడి గొంతు నులిమి హ‌త్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.