Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 రంగాల్లో మైనస్ 6.5 శాతం క్షీణత
న్యూఢిల్లీ : దేశ ఆర్దిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన కీలక రంగాలు లాక్‌డౌన్ దెబ్బతో కుప్పకూలాయి. ప్రస్తుత ఏడాది మార్చిలో బొగ్గు మినహా ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ రంగాలన్నీ ప్రతికూల వద్ధిని చవి చూశాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చిలో ఈ 8 కీలక రంగాల ఉత్పత్తి మైనస్ 6.5 శాతం క్షీణించాయి. గతేడాది మార్చిలో ఈ రంగాల ఉత్పత్తిలో 5.8 శాతం వద్ధిని సాధించాయి. గడిచిన మార్చిలో బొగ్గు ఉత్పత్తిలో వద్ధి రేటు 4.1 శాతానికి తగ్గింది. 2019 ఇదే నెలలో ఈ విభాగ ఉత్పత్తి వద్ధి 9.1 శాతంగా చోటు చేసుకుంది. క్రితం మార్చిలో ముడి చమురు ఉత్పత్తి -5.5 శాతం క్షీణించగా, సహజ వాయువు రంగంలో -15.2 శాతం, శుద్ధి ఉత్పత్తుల విభాగంలో -0.5 శాతం చొప్పున పతనాన్ని చవి చూశాయి. ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ విభాగాల ఉత్పత్తిలో వరుసగా -11.9శాతం, -13శాతం, -24.7శాతం, -7.2 శాతం మేర ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. 2019-20లో కీలక రంగాల ఉత్పత్తి 0.6 శాతానికి తగ్గింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో ఇవి 4.4 శాతం వృద్ధిని సాధించాయి.