Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ముంచినోళ్లనే సలహాలడిగితే...! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 13,2020

ముంచినోళ్లనే సలహాలడిగితే...!

- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కార్పొరేట్లతో ప్రధాని సమావేశాలు
- బడ్జెట్‌ వేళ.. ఎడతెగని మీటింగ్‌లు
- ఆర్థికమంత్రి లేకుండానే...
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికని ప్రధాని మోడీ కార్పొరేట్లతో ఎడతెగని సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్‌ వేళ తన కార్పొరేట్‌ మిత్రులతో చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఆ సమావేశాలకు మోడీ మిత్రులు అంబానీ, అదానీలతో పాటుగా రతన్‌ టాటా, భారతీ మిట్టల్‌, ఆనంద్‌ మహీంద్రా, అనిల్‌ అగర్వాల్‌ వంటి వారే గాక దేశవ్యాప్తంగా 120 మంది సీఈవోలతో సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఆర్థిక మందగమనంలో కార్పొరేట్ల పాత్ర కూడా ఉన్నదని ఆర్థిన నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ సర్కారు.. తిరిగి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి వారినే సలహాలు అడగటం విడ్డూరమని వారు విమర్శలు చేస్తున్నారు. నీరవ్‌ మోడీ, విజరు మాల్యా వంటి వారే గాక దేశంలో ఉన్న టాప్‌-50 కార్పొరేట్లలో చాలా మంది బ్యాంకుల వద్ద కోటానుకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారేనని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే మోడీ సర్కారు దృష్టిలో వారే (కార్పొరేట్లు) 'సంపద సృష్టికర్తలు' కావడంతో.. ఆయన కూడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని వారికి అప్పగించారని వారు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, మోడీ నిర్వహిస్తున్న సమావేశాలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం లేకపోవడం గమనార్హం.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతోనే ఆర్థిక వ్యవస్థ పతనానికి పూనుకున్నా.. దాని ప్రభావం గతేడాది నుంచే తీవ్రతరమైంది. ఫలితంగా నిర్మాణ, తయారీ, ఆటోమొబైల్‌ వంటి రంగాలు తీవ్ర కుదుపునుకు గురయ్యాయి. గతేడాది బడ్జెట్‌లో జీడీపీ వృద్ధిరేటు 7 శాతం నమోదవుతుందని సర్కారు అంచనా వేసింది. కానీ, మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం అది 5 శాతానికి (పదకొండేండ్ల కనిష్టానికి) మించేలా లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తయరీ రంగం 2 శాతం కంటే వృద్ధి రేటు నమోదుకాదని గణాంకాలు చెబుతున్నాయి. 2005-06 తర్వాత ఇంత తక్కువస్థాయి నమోదవడం ఇదే ప్రథమం. నిర్మాణరంగంలోనూ వృద్ధిరేటు 3.2 శాతానికి మించదని (ఆరేండ్ల కనిష్టం) ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రెండు రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఊడి ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీటన్నింటితో పాటు ప్రజల వినిమయ శక్తి కూడా భారీగా తగ్గింది.
మందగమనం నేపథ్యంలో ప్రజల వినిమయ శక్తిని పెంచాల్సిన సర్కారు.. కార్పొరేట్లకే తాయిలాలు ప్రకటించింది. వారికే పన్నులు తగ్గించి ప్రోత్సహకాలు పెంచింది. అయినా కూడా గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో కార్పొరేట్‌ వసూళ్లు పెరగలేదు. మరోవైపు పెట్టుబడులు రాక దేశంలో ఉపాధిరంగం అడుగంటింది. ఈ ఆర్థిక ఏడాదిలో పెట్టుబడుల వృద్ధిరేటు ఒక్క శాతానికి మించలేదు. 2004-05 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పెట్టుబడులు నమోదవడం ఇదే ప్రథమం. 2008-09 మాంద్యంలోనూ పెట్టుబడులు మందగించలేదు. ప్రజల వినిమయ శక్తి తగ్గడంతో పెట్టుబడిదారులు సైతం దేశంలో పెట్టుబడులు పెట్టడంలో వెనుకాడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం భారీగా వ్యయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నది. కాగ్‌ ఇటీవలే వెలువరించిన నివేదిక ప్రకారం.. కేంద్రప్రభుత్వం ఈసారి ఖర్చులను తగ్గించుకునే అవకాశాలున్నాయనీ, తద్వారా సంక్షేమ పథకాలకు కోత విధించనున్నట్టు తేలింది. తదనుగుణంగా మోడీ సర్కారు వచ్చే బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్లను తగ్గించుకోనున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
సెన్సెక్స్‌ భారీ ర్యాలీ
స్టార్టప్‌ లకు కేరళ నిధుల మద్దతు
కొలీన్­ నూతన ఆవిష్కరణ
భారత్ కేంద్రంగా బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.