Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జా తీయంగా నెలకొన్న సానుకూ ల సంకేతాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 428 పాయింట్లు లేదా 1.05 శాతం పెరిగి 41,010కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 115 పాయింట్లు లేదా 0.95 శాతం లాభపడి 12,087 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 41,055 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 12,098.85 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు వెల్లువలా సాగాయి. విదేశీ మారకం మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రెండున్నర నెలల గరిష్టానికి బలపడటం మదుపర్లలో విశ్వాసాన్ని పెంచింది. అమెరికా చైనాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు రిపోర్టులు రావడంతో పాటు బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ మరోసారి అధికారాన్ని చేపట్టడం మార్కెట్లకు మద్దతునిచ్చాయి. అదే విధంగా ఆసియా మార్కెట్లు 8నెలల గరిష్టస్థాయిలో ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల ప్రారంభంతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదులుతుండటం భారత మార్కెటకు ఉత్సాహనిచ్చాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, లోహ షేర్ల ర్యాలీ సూచీలు భారీ లాభాల్ని అర్జించేందుకు దోహదపడ్డాయి.