Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. లోహ, బ్యాంకింగ్ షేర్ల ప్రధాన మద్దతుతో గురువారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 169 పాయింట్లు రాణించి 40,582కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 11,972 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లను ఆర్జించి 40,712 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. రూపాయి బలపడటంతో ఒక్క ఐటి రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా లోహ షేర్లు లాభపడ్డాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం దేశీయ మార్కెట్‌లో విశ్వాసాన్ని పెంచింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి మన మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభించింది.