Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బిఎస్-6 ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా యమహా మోటార్ ఇండియా (వైఎంఐ) సోమవారం మార్కెట్లోకి వైజెడ్‌ఎఫ్-ఆర్15 (వెర్షన్ 3.0)ను విడుల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.1.45 లక్షలుగా నిర్ణయించింది. 155 సిసి ఇంజన్‌తో రూపొందించింది. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ కొత్త బైక్ అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బిఎస్-6 ఆధారిత ఇంజిన్‌తో కొత్త వైజెడ్‌ఎఫ్-ఆర్ 15 కొత్త ఫీచర్లతో కొనుగోలుదార్లను ఆకట్టుకుటుందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి షితారా విశ్వాసం వ్యక్తం చేశారు.