Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక టెలికాం చార్జీల మోతచార్జీల పెంపు ఎందుకంటే.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 21,2019

ఇక టెలికాం చార్జీల మోతచార్జీల పెంపు ఎందుకంటే..

- 35 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం..
- కాల్‌ చార్జీలతో సహా డేటా సేవలకూ వడ్డింపు
- వచ్చే నెల నుంచి అమలులోకి కొత్త చార్జీలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టెలికాం సేవలలోని కొత్తకొత్త ఉపయోగాలను వినియోగదారులకు పరిచయం చేసిన టెలికాం సంస్థలు.. తాజాగా అవి ప్రజలకు బాగా అలవాటవడంతో చార్జీల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. తమకు నష్టాలు పెరిగిపోతున్నాయని.. ఫలితంగా చార్జీలను పెంచాల్సి వస్తోందని చెబుతున్న సంస్థలు భారీగానే వడ్డనకు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవాల్లోకి వెళితే అసలు సమస్యకు కేంద్ర బింధువు రిలయన్స్‌ జియో అని ఇతర కంపెనీలు అరోపిస్తున్నాయి. ఉచిత డేటా, కాల్స్‌, మెసేజ్‌లతో 4జీ సేవల సంస్థగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో సంచల నాలకు కేంద్ర బింధువైంది. చౌక ఇంటర్నెట్‌ ప్యాకేజీలతో పెద్ద ఎత్తున వినియో గదారులను ఆకర్షించింది. ఫలితంగా అప్పటికే ఉన్న ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడి యా సంస్థల ఆదాయం భారీగా పడిపోయింది. జియోకు పోటీగా చార్జీలు తగ్గించ డం వల్లే ఆయా సంస్థలకు నష్టాలు వాటిల్లాయి. డేటా ధరలు ఒకప్పటితో పోలీస్తే దాదాపు 95 శాతం పడిపోయి ఒక జీబీ విలువ రూ.11.78 పైసలకు పరిమిత మైందని ట్రారు ఇటీవల తెలిపింది. మొబైల్‌ కాల్స్‌ చార్జీలూ సుమారు 60 శాతం తగ్గి జూన్‌ 2016, డిసెంబర్‌ 2017 మధ్య నిమిషానికి దాదాపు 19 పైసలకు చేరాయని వివరించింది. ప్రస్తుతం జియో తన అన్ని ప్యాకేజీల్లో అపరమిత వాయిస్‌ కాల్స్‌ అందించింది. ఇటీవల ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున ఐయూసీ వసూలు చేస్తామని ప్రకటించింది. పోటీ తట్టుకునేందుకు జియో మార్గాన్నే అనుసరించిన సంస్థలు ఇప్పుడు ఎటూ తోచని స్థితిలో ఉన్నాయి. చౌక ధరలకే సేవలందించి కాస్తో కూస్తో పేరు మూటగట్టు కున్నా ఆర్థికంగా కుదేలవ్వాల్సి వచ్చింది. ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ సంస్థలు వేల కోట్ల రూపాయలు నష్టపోవడమే ఇందుకు నిదర్శనం. అందుకే ఈ నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డాయి ఆయా సంస్థలు. ఇందులో భాగంగా డిసెంబ ర్‌ నుంచి కాల్‌, డేటా చార్జీలు పెంచుతున్నట్లు వినియోగదారులకు పిడుగులాంటి వార్త చెప్పాయి. దీంతో వచ్చే నెల నుంచి ఆచితూచి కాల్స్‌ చేయాల్సిన పరిస్థితి రానుంది. డేటా కూడా పరిమితంగా వాడుకోక తప్పని వాతావరణం రానుంది. ఎందుకంటే డిసెంబర్‌ ఒకటో తేది నుంచి చార్జీల మోత మోగనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు వేరువేరు ప్రకటనలను విడుదల చేశాయి. వోడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు. ధరలు పెంచుతామని ప్రకటించాయే తప్ప ఎంతా అని స్పష్టంగా ప్రకటించలేదు ఈ సంస్థలు. ప్రస్తుతం ఉన్న ధరలకు 35 నుంచి 40 శాతం వరకు అదనంగా వసూలు చేస్తారని తెలుస్తోంది.
చార్జీల పెంపు ఎందుకంటే..
టెలికాం సంస్థలు ఇప్పటికిప్పుడు చార్జీల పెంచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఆయా సంస్థలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. జులై - సెప్టెంబర్‌ త్రైమాసికానికి వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు సంయుక్తంగా రూ.73వేల కోట్ల మేర నష్టాన్ని ప్రకటించాయి. జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో వొడాఫోన్‌ రూ.50వేల 921 కోట్లు నష్టాలుగా ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ రూ.23వేల 45 కోట్లు నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఈ నష్టాలు భర్తీ చేసుకొనేందుకు చార్జీలు పెంచాల్సి వస్తుందని టెలికాం కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించాలంటే చార్జీలు పెంచక తప్పదని ఈ రంగంలో చాలా పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్వప్నం సాకారం కావాలంటే టెలికాం పరిశ్రమ సహకారం ముఖ్యమని వాఖ్యానిస్తున్నాయి. ఈ దశలో గనుక సరైన నిర్ణయం తీసుకోకుంటే కంపెనీలు ఆర్థిక నిలబడడం దాదాపు కష్టమేనని ఆయా కంపెనీలకు చెందిన అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు.
తీవ్ర ప్రభావం చూపిన ఏజీఆర్‌..
ఇప్పటికిప్పుడు టెలికాం సంస్థలు తమ చార్జీలు అత్యవసరంగా పెంచడానికి మరో ప్రధాన కారణం సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదం. నిజానికి ఈ వివాదం 16 ఏళ్లుగా కొనసాగుతోంది. టెలికం సేవల కోసం లైసెన్సులు పొం దిన టెల్కోలు.. తమకు వచ్చే ఆదాయంలో నిర్దిష్ట శాతం లెసెన్సు రుసుము, స్పెక్ట్రం వినియోగ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదాయం లెక్కించే విషయంలోనే టెలికాం సంస్థలు, కేంద్ర టెలికాం విభాగం మధ్య వివాదం సాగు తోంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన ఆదాలు టెల్కోలకు ఆదాయమేనన్నది కేంద్రం వాదన. అందుకు తగినట్లు సవరించిన స్థూల ఆదాయం ఏజీఆర్‌ ప్రాతిపదికన టెలికాం సంస్థలు లైసెన్సు రుసుములు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు కట్టాలని నిర్దేశించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెల్కోలు న్యాయ పోరాటానికి దిగగా ఇటీవలే వాటికి ఎదురు దెబ్బ తగిలింది. ఏజీఆర్‌ లెక్కింపుపై టెలికాం శాఖ రూపొందించిన ఏజీఆర్‌ నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. టెలికం సంస్థల వాదనలు తోసిపుచ్చింది. ఆయా కంపెనీలు ఫెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తదుపరి వాదనలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. నిర్దేశించిన గడువులోగా చెల్లించాలని పేర్కొంది. సుమారు రూ.92 వేల కోట్ల ఏజీఆర్‌ వసూలుకు కేంద్రానికి అనుమతించింది. దీంతో చేసేది లేక ఆయా సంస్థలు తమతమ ఏజీఆర్‌ బకాయిలకు తగ్గట్టుగా ఆదాయంలో కేటాయింపులు జరపడం ప్రారంభించింది. దీంతో ఆయా సంస్థల త్రైమాసిక నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఆ నష్టాన్ని పూడ్చుకొనేందుకు గాను సంస్థలు చార్జీ పెంపు బాటపట్టాయి. కేంద్రానికి చెల్లించాల్సిన మొత్తంలో దాదాపు 75 శాతం వడ్డీలు, పెనాల్టీల రూపంలో పోగుపడినవే. అసలు బకాయి 25 శాతమే. సుప్రీం తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సిన టెలికం కంపెనీలు కొంత వెసులుబాటును కల్పించాలంటూ కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తున్నాయి. చెల్లింపులపై మూడేండ్ల మారటోరియం ఇవ్వాలని, మొత్తం బకాలన్నీ కట్టేందుకు గడువు మరింత పొడిగించాలని, వడ్డీ రేటు తక్కువ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. సాధారణంగా రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐలు మొదలవుతాయి. కొన్నాళ్లపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించడాన్ని మారటోరియంగా వ్యవహరిస్తారు. ఈ మారటోరియం కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఐయూసీ చార్జీల కోసం పట్టు
ఏజీఆర్‌ తర్వాత తెరపైకి వస్తున్న మరో అంశం ఇంటర్‌ కనెక్ట్‌ యూసెజ్‌ చార్జీలు (ఐయూసీ). అంటే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌చేసిన ప్పుడు కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ నిమిషానికి 6పైసలు చెల్లించాలి. ఫలితంగా జియో నికరంగా ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించా ల్సి వస్తోంది. అందుకే వీటిని తొలగించాలని జియో మొదటి నుంచి వాదిస్తోంది. ఎయిర్‌టెల్‌, ఐడియా మాత్రం ఉంచాలని కోరుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తొలగించడానికి గతంలో కేంద్రం సమ్మతించింది. కానీ ఇటీవల పరిణా మల మధ్య వీటిని తొలగించకూదడని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ మరింత పట్టుపట్టాయి. ఫలితంగా త్వరలో కొత్త విధానం తెస్తామని ట్రారు ప్రకటించింది. భారీ నష్ట్రాలు, పేరుకుపోయిన రుణాలు, సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆయా సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. టెలికం రంగంలో ఆర్థిక పరమైన ఒత్తిడి తగ్గిం చేలా క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ కసరత్తు షురూ..
టాప్‌-10లోని ఆ ఆరు కంపెనీలదే హవా
ఒక్క ఏడాదిలో కోటిన్నర..
అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ!
బీఎస్‌-4 కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఎల్‌జీ గ్రూపు మాజీ చైర్మెన్‌ మృతి
సొంత డెలివరీ వ్యవస్థపై అమెజాన్‌ దృష్టి
ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం

తాజా వార్తలు

09:54 PM

భారత్‌పై వెస్టీండీస్‌ గెలుపు

09:43 PM

ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేష్

09:32 PM

వరంగల్‌లో 200 కిలోల గంజాయి సీజ్

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.