Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీతో కలిసి పని చేస్తోన్న 5,000 మంది మహిళా రైతులతో అపోలో హాస్పిటల్స్ ఒప్పందం చేసుకుంది. వీరి నుంచి సేకరించిన తృణ ధాన్యాలను అపోలో క్యాంటీన్లలో ఉపయోగించనున్నారు. ఇప్పటికే 4వేల కిలోల తృణ ధాన్యాలు కొనుగోలు చేయగా తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులకు మద్దతుగా ప్రతీ నెల మరో వెయ్యి కిలోల ధాన్యాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. ఆరోగ్యకరమైన జీవనానికి స్థానికంగా లభించే వాటినే తినడం, పండించడం చేయాలని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్‌ఆర్ వైస్ చైర్మెన్ ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.