Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొత్తది ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. దీన్ని ఆధారంగానే AkzoNobel తన కొత్త కొత్త పరిశోధనల్ని వినియోగదారులకు అందిస్తూనే ఉంది. డ్యూలక్స్ చేసిన ఒక సర్వే ప్రకారం.. వినియోగదారుడు పెయింట్ యొక్క నైపుణ్యం మరియు అధిక నాణ్యత కలిగిన బ్రాండ్ను ఎంచుకున్నప్పుడు వారు ఆ బ్రాండ్ యొక్క గొప్పదనాన్ని చూస్తారు. ఈ ప్రయత్నంతో, AkzoNobel ఇండియా యొక్క మొదటి-రకం Dulux Assurance ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇందులో ఖచ్చితమైన రంగు, ఫినిష్ మరియు కవరేజీని లభిస్తుంది. లేనిపక్షంలో పెయింట్ మార్చబడుతుంది. డ్యూలక్స్ ప్రీమియం ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.
ఈ సందర్భంగా AkzoNobel ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. 'వినియోగదారులు ఈ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఉత్పత్తుల్ని పరిశీలిస్తారు. అందులోని నాణ్యతను గమనిస్తారు. అందుకోసమే మేము ఈ Dulux Assurance ని ప్రారంభించాం. పరిపూర్ణ రంగు, అద్భుతమైన ఫినిషింగ్ మరియు కవరేజీ ఈ Dulux Assurance తో లభిస్తుంది. Dulux Assurance మా ఖాతాదారుల యొక్క అధిక ఆకాంక్షలను తీర్చేందుకు దృఢమైన అంకితభావంతో ఉంది అని అన్నారు.'
కొత్త Dulux Assurance ఐకాన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ షాపులలో ఉన్న డ్యూలక్స్ పెయింట్ యొక్క క్యాన్ లపై కనిపిస్తుంది. అంతేకాకుండా మార్కెట్ లో లభ్యం అవుతున్న ప్రస్తుత ప్రొడక్ట్లకు కూడా ఇది వర్తిస్తుంది. Dulux Assurance ని లాంఛ్ చేయడం ద్వారా వినియోగదారులకు కొత్త పాయింట్ ఆఫ్ సేల్ మెటీరియల్స్ ఇన్ స్టోర్ మరియు సోషల్ మరియు డిజిటల్ ఛానల్స్ ద్వారా కమ్యూనికేషన్ లు మద్దతు ఇవ్వబడతాయి. వినియోగదారులు వాట్సప్ లేదా మా వెబ్ సైట్ ద్వారా AkzoNobelతో టచ్ లో ఉండవచ్చు. ట్యాక్స్ ఇన్వాయిస్, Dulux Assurance కార్డు మరియు సమస్యాత్మక ప్రాంతాలను చూపించే ఫోటోలను కూడా పంపవచ్చు. క్లెయిం వాలిడేషన్ తరువాత, రీప్లేస్ మెంట్ ప్రొడక్ట్ కొరకు వోచర్ 14 పని రోజుల్లోగా ఈ-మెయిల్స్ ద్వారా పంపబడుతుంది. కొనుగోలు చేసిన తేదీ తరువాత మూడు నెలల లోపు డీలర్ వద్ద ఈ వోచర్ రీడిమ్ చేయబడుతుంది.
"మా ప్రతి ఉత్పత్తి విస్తృత పరిశోధన మరియు అభివృద్ధి తర్వాత రూపొందినవి. మా ఉత్పత్తుల నాణ్యత ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది రాబోయే రోజుల్లో అదే మాట్లాడుతుందని మేం ఖచ్చితంగా నమ్ముతున్నాం. Dulux Assurance మా నాణ్యత యొక్క పొడిగింపు. మా ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకాన్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం అని అన్నారు రాజీవ్ రాజ్ గోపాల్.