Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద టేస్ట్ కంపెనీ వెల్లడి
హైదరాబాద్ : ఇన్‌స్టాంట్స్ ఫుడ్స్ తయారీదారు 'ద టేస్ట్ కంపెనీ' భారత్‌లో తొలిసారిగా మాంసహారం 'రెడీ టు ఈట్' మీల్స్‌లోకి ప్రవేశించినట్టు ప్రకటిం చింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ సహజత్వంతో, నాణ్యత తో రుచికరంగా వెజ్, నాన్ వెజ్ ఉత్పత్తులను రూపొందిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మార్కెటింగ్ సొల్యూషన్స్ అందిస్తున్న వే2ఆన్‌లైన్ ఇంటెరాక్టివ్ ఇండియాను ప్రమోట్ చేస్తున్న రాజు వనపాల ద టేస్ట్ కంపెనీ (టీటీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ అహారోత్పత్తుల తయారీ కోసం రూ.22 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరు వద్ద అత్యాధునిక ప్లాంటును నెలకొల్పి నట్టు రాజు తెలిపారు.