నిర్మల్‌టౌన్ : జిల్లాలో పని చేస్తున్న డీపీహెచ్‌ఎం జయప్రమోదాను జిల్లా వైద్య శాఖ అధికారులు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించడంలో అధికారులతో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ తమకు అండగా నిలిచిన అధికారి జయప్రమోదా అని అన్నారు. అలాగే నిజాయితీగా ఉండి పేద ప్రజలకు నిరంతరం సేవ చేసే వ్యక్తిని ఆకస్మిక బదిలీ పేరిట పంపించడం తగదన్నారు. ఆందోళన చేపట్టినప్పటికీ జిల్లా వైద్యాధికారి వసంతరావు బయటికి రాకపోవడంతో విసుగు చెందిన ఆశా కార్యకర్తలు కార్యాలయం గోడకు వినతిపత్రాన్ని అతికించారు. ఇప్పటికైనా ఈ విషయంపైన జిల్లా కలెక్టర్ స్పందించి ఆమె బదిలీని ఆపాలని, జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు తాము విధులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, అనంతరం జరిగే పరిణామాలకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ చంద్రకళ, రాజమణి, రామలకీë, స్వరూప, సత్తెమ్మ, గంగామని, సుజాత, గంగలకీë, కవిత, శిరీష పాల్గొన్నారు.
Authorization