- జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నవతెలంగాణ-ఖానాపూర్ రూరల్ కుటుంబాలకు దూరమై అజ్ఞాతంలో ఉండి సాధించే ఏమీ లేదని.. జనజీవన స్రవంతిలోకి రావాలని జిల్లా ఎస్పీ సి.శశిధర్‌రాజు కోరారు. ఆదివారం మండలంలోకి కొలంగూడలో నక్సల్ కుటుంబానికి ఆయన దుస్తులు, నిత్యావసర సరుకులను అందజేశారు. 15 ఏండ్లుగా కంచి లింగమ్మ అజ్ఞాతంలో ఉంటోందని తెలిపారు. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన లింగమ్మ, పొచ్చర గ్రామానికి చెందిన మంగ్లారపు అడెల్లు అలియాస్ భాస్కర్ వెంటనే లొంగిపోవాలన్నారు. ప్రభుత్వం వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధి సహకారానికి సిద్ధంగా ఉందన్నారు. కాగా లింగమ్మ తల్లి పూర్తి అనారోగ్యంగా ఉన్నానని తన బిడ్డ తన వద్దకు రావాలని రోదిస్తూ చెప్పింది. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జయరాం, ఎస్‌ఐలు భవానీసేన్, రాజేశ్, పోలీసులు పాల్గొన్నారు.