Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చాక్లె‌ట్ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

చాక్లె‌ట్

Sat 25 Jun 15:27:34.563702 2016

తిరిగి వచ్చేటప్పుడు ''కుమారీదేవిని చూడాలయ్యా, కుదురుతుందా?'' అనడిగాడు బుచ్చిబాబు.
''రేపు వెళ్దాం'' అన్నాడు మా గైడు.
''ఎవరండీ ఆమె, దేవతా? ఎక్కడుందా ఆలయం?'' అనడిగింది రామకృష్ణ సతీమణి.
''సజీవ దేవత. దివ్య చేతన సృష్టి అంతటా వ్యాపించి ఉన్నది. మహాదేవి ఈ మొత్తం ప్రపంచాన్నీ సృజించింది, జీవ, జడ వస్తువుల్లో నిహితమై ఉంది. ఒక నిర్జీవ విగ్రహాన్ని మనం ఎలా భగవంతుని రూపంగా భావిస్తామో, అలాగే వీళ్ళిక్కడ సజీవ మానవ రూపంలో దేవతను గుర్తిస్తారు. శాక్య లేక బజ్రాచార్యకులానికి చెందిన చిన్న పిల్లను-రజస్వలకాని పిల్లను-ఎంపిక చేసుకుని మహత్తులు కల దేవతగా పూజిస్తారు. పదిహేనేళ్ళు వచ్చాక ఆమెనా పదవినుండి తొలగిస్తారు. అప్పటికామెను ఆవహించి ఉన్న దేవత వదలిపోతుందని భావిస్తారు. ఆ తర్వాత ఆమె సాధారణ స్త్రీ జీవితాన్ని గడుపుతుంది.'' అని చెప్పాడు బుచ్చిబాబు.
తనకేమర్థమయిందో నాకు తెలీదుగానీ, గోరఖ్‌బాబు ''అవును,'' అని తల ఊపాడు.
''ఏమిటవును?'' అనడిగింది బుచ్చిబాబు సతీమణి.
''నేపాలంతటా కుమారీలు వెలసి ఉన్నారు. కానీ ఇక్కడి రాచకుమారి కుమారీ ఘర్‌ రాజభవంతిలో నివసిస్తుంది. కుమారీ ఎంపిక చాలా నిర్దుష్టంగా, కఠినంగా ఉంటుంది. ప్రస్తుత రాచకుమారి మతీనా శాక్య. అక్టోబరు 2008లో రాచరికాన్ని రద్దుచేసి వచ్చిన మావోయుస్టు ప్రభుత్వం ఆమెనా పదవిలో ప్రతిష్ఠించింది. అప్పుడు ఆమెకు నాలుగేండ్ల వయస్సు. పాటన్‌ నగరంలో నివసించే యూనికా భైరాచార్య తరువాతి ప్రాథాన్యం వున్న కుమారి. ఆమెను ఏప్రిల్‌ 2014లో ప్రతిష్ఠించారు'' అని చెప్పాడతను.
నాకప్పుడు గుర్తుకు వచ్చింది, ఎప్పుడో 2007 జులైలో ఒక ఫారెన్‌ మాగజైనులో నేపాలులోని కుమారీ పూజను గూర్చిన రాయటం. అమెరికాలోని మేరీలాండ్‌ సిల్వర్‌ స్ప్రింగ్‌ ఆమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తీసిన లివింగ్‌ గాడెస్‌ చిత్ర విడుదలకు భక్తపూర్‌ కుమారి సజనీ శాక్య హాజరయింది. ఆ పిమ్మట ఆమె తన పవిత్రత పోగొట్టుకున్నది కనుక ఆ పదవినుండి ఆమెను తొలగించాలని భావించారు కానీ, తన అమెరికా ప్రయాణం వల్ల కలిగిన అపవిత్రతను శుద్ధి కార్యక్రమం ద్వారా పోగొట్టుకోవటానికి అంగీకరించింది కనుక ఆమెను ఆ పదవిలోనే కొనసాగించారని తెలిసింది.
''కుమారీ పూజా సంప్రదాయం 2300 సంవత్సరాల క్రితంనుండి ప్రచలితమయ్యే ఉంది. 6వ శతాబ్దంలో నేపాల్‌లోకి ప్రవేశించిందంటారు. నిజానికి ఈ హిందూ తాంత్రిక భావనకు, స్త్రీ శక్తిని మహద్రూపంగా భావించటానికి మూలం వజ్రయానంలో ప్రవర్థమానమయిన తాంత్రిక విద్య. వజ్రయానం మండలాలు, ముద్రలు, మంత్రోచ్ఛారణ (''ఓం మణే పద్మేహం'')ల ద్వారా ముక్తిని లేక నిర్వాణాన్ని తేలిగ్గా సాధించవచ్చని నమ్ముతుంది. అందులో బౌద్ధ తాంత్రికులు ఉపాసించే దేవతలు శ్యామతార, సితాతార, మామకి మొదలైనవారు. హిందూ తాంత్రిక విద్యలోనూ కాళీమాతను సృజన, విధ్వంసకారుణిగా భావిస్తారు, ఉపాశిస్తారు. ఆ సంప్రదాయ రూపమే కుమారీపూజ'' అన్నాను.
నేనేం చెప్పానో అడిగి తెలుసుకుని శ్రీ వాత్సవ్‌ అన్నాడు, ''యు ఫైండ్‌ దిస్‌ టైప్‌ ఎడొరేషన్‌ ఓవర్‌ వర్జినిటీ వరల్డ్‌ ఓవర్‌. సిమిలర్లీ, విలియం వర్డ్స్‌ వర్త్‌ సెడ్‌ ఛైల్డ్‌ ఈజ్‌ ద ఫాదర్‌ ఆఫ్‌ మాన్‌. హావ్‌ యు రెడ్‌ ది ఓడ్‌ ఆఫ్‌-ఇంటిమేషన్స్‌ ఆఫ్‌ ఇమ్మోర్టాలిటీ, వేర్‌ ఇన్‌ హి సెడ్‌:
నిదీబ్‌ ్‌తీaఱశ్రీఱఅస్త్ర షశ్రీశీబసర శీట స్త్రశ్రీశీతీy సశీ షవ షశీఎవ
ఖీతీశీఎ స్త్రశీస, షష్ట్రశీ ఱర శీబతీ ష్ట్రశీఎవ:
నవaఙవఅ శ్రీఱవర abశీబ్‌ బర ఱఅ శీబతీ ఱఅటaఅషy!
ూష్ట్రaసవర శీట ్‌ష్ట్రవ జూతీఱరశీఅ ష్ట్రశీబరవ bవస్త్రఱఅ ్‌శీ షశ్రీశీరవ
ఖజూశీఅ ్‌ష్ట్రవ స్త్రతీశీషఱఅస్త్ర bశీy.ు
''ఏమిటో అన్నావు, నేనందుకు అంగీకరించను. కన్యాత్వంలోను, బాల్యంలోను దైవత్వం ఉంది. మీరేం చెప్పినా నేను నమ్మను'' అన్నాడు బుచ్చిబాబు.
అతడన్నాడు, ''నేనూ అదే కదా చెప్పింది. ప్రపంచమంతటా బాల్యాన్ని చాల గొప్పగా భావించటం జరిగింది. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ, అతడిలో సంకుచితత్వం చోటు చేసుకుంటుంది. అతడు బాల్యపు స్వచ్ఛతను కోల్పోతాడు. అందుకనే ఈ రెండు కాల్పనికతలు-కన్యాత్వపు ఆరాధన, బాల్యపు స్వేచ్ఛతా భావన కల్సి, కుమారీ పూజకు అంకురార్పణ చేశాయి.''
''అయితే, ఇది దేవదాసీ వ్యవస్థకు, తెలంగాణా, కర్ణాటకలలోని జోగినీ వ్యవస్థకు భిన్నమైనది. ఇక్కడ లైంగిక సంపర్కపు ప్రశ్నే తలెత్తదు. అవయితే, వేశ్యావృత్తికి భిన్న రూపాలు''అన్నాను.
మర్నాడు ఉదయం సుమారు పదిగంటల సమయంలో మేం కుమారీ ఘర్‌కు వెళ్ళాం. తోవలో మా బుచ్చిబాబు గోరఖ్‌ బాబును అడిగాడు. ''ఎవరినైనా కుమారిని చేయావచ్చా'' అని. తెలంగాణాలో తల్లిదండ్రులు ఇష్టపడితే తమ కూతురును జోగినిగా చెయ్యవచ్చును.
''అలా కుదర్దు. రజస్వల అయ్యాకగానీ, లేక వేరే విధంగాగానీ, అంటే గాయంవల్ల రక్తం పోయినా కుమారి పదవి అలంకరించిన అమ్మాయినుండి దేవత అంతర్హితమైందని భావిస్తారు. అప్పుడు కొత్త కుమారికోసం వెదుకులాట ప్రారంభమవుతుంది. ఐదుగురు వజ్రాచార్య బౌద్ధ గురువులు భవిష్యత్‌ కుమారిని ఎంపిక చేస్తారు. వారిలో ముఖ్య రాచగురువు, తలెజుదేవత పురోహితుడు అచజౌ, రాచజ్యోతిష్కుడు ముఖ్యులు. ఎంపిక చేయబడే పిల్ల మాత్రం బౌద్ధ శాక్యకులానికే చెందుతుంది. గానీ, కుమారి అయ్యాక ఆమె హిందూ దేవత అవుతుంది. ఆమెను బౌద్ధులు, హిందువులు సమానంగానే ఆదరిస్తారు. ఎంపిక అయ్యే బాలిక మంచి ఆరోగ్యం కలిగి, రోగాలేవీ లేకుండా, పన్ను కూడ పోగొట్టుకోకుండా ఉండాలి. ఈ ప్రాథమిక లక్షణాలున్న అమ్మాయిలను ఆ తర్వాత దేవతకుండాల్సిన ముప్ఫయిరెండు లక్షణాలకోసం పరీక్షిస్తారు. శంఖంలాంటి మెడ, వటవృక్షం లాంటి శరీరం, గోవు కనురెప్పల రోమాలు, లేడి తొడలు, సింహపు వక్షస్థలం, సృష్టమైన, మృదువైన గొంతు మొదలైనవి అందులో కొన్ని లక్షణాలు. ఆ తర్వాత ఆమె జాతకాన్ని చూస్తారు. ఆమె ఎంపిక రాజ్య క్షేమానికి మంచిదని నిశ్చయం చేసుకుంటారు. అభ్యర్థి ఎంపిక అయాక ఆమె దుర్గామాతకు తగిన వాహిక అనేందుకు చాల కఠోర పరీక్షలు ఉంటాయి. దశైన్‌ పండగరోజున 108 గేదెలను, మేకలను కాళికకు బలి ఇచ్చి, ఆ కాళరాత్రి ఎంపిక చేసిన బాలికను కొవ్వువత్తి వెలుగులో అక్కడ వదుల్తారు. ఆమె భయపడకపోయినట్లయితే తలెజు దేవత లక్షణాలు ఆమెలో ఉన్నాయని భావిస్తారు. చివరగా తన ముందున్న వస్తువులో అంతకు ముందున్న కుమారి వస్తువులను ఆమె ఎంపిక చేసుకుంటే ఆమె కుమారి అయినట్లే. ఆ తర్వాత శుద్ధి కార్యక్రమం చేపడ్తారు. అప్పటికి తలెజు దేవత ఆమెలో ప్రవేశిస్తుంది. ఆ పిమ్మట తలెజు ఆలయం నుండి పరిచిన తెల్లగుడ్డమీద నడుస్తూ కుమారీగృహానికి వెళ్తుంది. అదే ఆమె చివరిసారి నడవటం. ఆ తర్వాత ఆమె ఎక్కడకు వెళ్ళినా బంగారు పల్లకీలోనే. అయితే కుమారి నిత్యం నిర్వహించవల్సిన విధులుంటాయి. ఎవరూ ఆమెను ఆదేశించవీలులేదు కానీ ఆమె విధులను చక్కగా పాటించేట్టు చూస్తారు. నేవారీ శాక్యకుల బాలికలు ఆమెకు చెలికత్తెలుగా ఉంటారు. ఎర్రటి బట్టనే ఆమె ధరిస్తుంది, ఆమె నుదుటిపైన ప్రత్యేక శక్తులున్న దేవతకు చిహ్నంగా అగ్ని నేత్రాన్ని దిద్దుతారు.''
మేం అక్కడకు వెళ్ళేటప్పటికి జనం చాలమంది ఆమె దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె బాల్కనీలోనుండి జనాలను ఆశీర్వదిస్తూ వీక్షిస్తోంది. మేం నమస్కరించాం. ''మనం దేవతతో మాట్లాడే అవకాశం ఉండదా?'' అనడిగింది మా ఆవిడ.
నిజానికి ఆడవాళ్ళందరూ దేవతను దగ్గరగా దర్శించి, ఆమెతో మాట్లాడాలనే ఉత్సుకతే ఉంది.
''టూరిస్టులకు సాధ్యం కాదు. బాగా పలుకుబడి కలిగినవాళ్ళకు మాత్రమే ఆ భాగ్యం లభిస్తుంది. ఆమె అప్పుడు సింహాసనాధిష్టయై ఉంటుంది. ఋతుస్రావ ఇబ్బందులతో బాధపడే స్త్రీలు, తదితర రక్త సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్ళు ఆమెను దర్శిస్తారు. అలాంటి రోగాలకు కుదిర్చే ప్రత్యేక శక్తులు ఆమెకున్నాయని జనం భావిస్తారు. పాతకాలంలో రాజుకూడ ఆమె ఆశీర్వాదం పొందటానికి వచ్చేవాడు. ఇప్పుడు అధికారులు వస్తారు. భక్తులు ఆమె కాళ్ళనంటుకుని నమస్కరిస్తారు, కానుకలు సమర్పిస్తారు. ఆమె మౌనంగా వాటిని స్వీకరిస్తుంది. ఎవరితోనూ మాట్లాడదు. ఆమె చేష్టలనే వివిధ రకాలుగా అన్వయించుకోటం జరుగుతుంది.''
ఇంక అక్కడ ఉండి మేం చేయగలిగిందేం లేదు కనుక మేం హోటలుకు తిరుగుముఖం పట్టాం.
''వో పఢలిీఖీ దేవీ హెంగీ'' అనడిగింది సప్నాదేవి అప్పుడు.
''సర్వమైన జ్ఞానమున్న దేవతగా భావించటం వల్ల సంప్రదాయికంగా ఆమెకు విద్య గరపడమంటూ ఉండేది కాదు. అయితే, తలెజు దేవత ఆమెను కౌమరావస్థ దాటంగానే వీడిపోతుంది. అప్పుడు ఆమె సాధారణ వనిత, సాధారణ మానవజీవనం గడపాలి కనుక ఆధునిక కాలంలో వారికీ విద్య అవసరమన్న భావన అందరికీ కలిగింది. భక్తపూర్‌ కుమారీలు స్కూళ్ళకు వెళ్తారు, అక్కడ వారి జీవనం అందరి విద్యార్థినుల జీవనం లాంటిదే. అయితే ఖాట్మండూ కుమారికి ప్రయివేటు టీచర్లను నియమించి విద్యను గరపటం జరుగుతుంది.''
''మరా పిల్లలకు ఆ తర్వాత వివాహవుతుందా?'' అనడిగింది బుచ్చిబాబు భార్య.
''ఆమెను వివాహం చేసుకున్న పురుషుడు రక్తం కక్కుకుని అర్నెల్ల లోపల చనిపోతాడంటారు. కానీ, అది మూఢనమ్మకం. చాలమంది కుమారిలు తరువాతి జీవితంలో వివాహం చేసుకున్నారు. పిల్లల్ని కని సలక్షణమైన జీవితం గడుపుతున్నారు.''
హోటలుకు వెళ్ళాక భోజనం చేసి మనోకామనాదేవి దర్శనానికై బయలుదేరాం. అది పోఖ్రాకు వెళ్ళే దారిలో ఉంది. రోప్‌వేమీద కొండమీదకు వెళ్ళి మనోకామనాదేవిని దర్శించాలి పైకి వెళ్ళటానికి మనిషికి రు.575 టిక్కెట్టు.
''భక్తేమోగానీ డబ్బు మా బాగా ఖర్చవుతున్నది''అన్నాను.
''ఊర్కోండి, ఇంట్లో కూర్చుంటే మాత్రం డబ్బు ఖర్చు కాదా?'' రెండేళ్ళ క్రితం మా మేనల్లుడు పదివేలు తీసుకుని ఇవ్వనందుకు దెప్పటమది! ''కోరుకున్న కోరికలను ఈడేర్చే దేవత! దణ్ణం పెట్టుకోండి''అంది.
రాత్రికి పోఖ్రా వెళ్ళి అక్కడ హూటల్లో బస చేశాం. ఈ ముందు ఏర్పాట్లన్నీ దివ్యంగా చేశాడు గోరఖ్‌నాథ్‌. పోఖ్రాలోని ప్రదేశాలను తరువాత చూడవచ్చని, మర్నాడు పొద్దున ముక్తినాథుడి దర్శనానికి చిన్న విమానంలో జోమ్‌సమ్‌ వెళ్ళాం. సుమారు అరగంట ప్రయాణం. హిమాలయ పర్వతాలలో నెలకొని ఉన్న కుగ్రామం జోమ్‌సమ్‌. రోడ్లుకూడ సరిగ్గాలేవు. చెక్కతో కట్టిన చిన్న ఇంటిలో హోటలు లాంటిది ఏర్పాటయి ఉంది. మా బస అక్కడే. మా సామాన్లక్కడ పడేసి, ఒక జీపుమీద ముక్తినాథ ధామానికి బయలుదేరాం. జీపును గోరఖ్‌ మాట్లాడారు. గండకీ నదీతీరం పక్కనే మా ప్రయాణం ఒకోసారి నదీశయ్యలోకీ జీపు వెళ్తుంది. గండకీ నది ఎండిపోయి ఉన్నది కనుక మా ప్రయాణం సాధ్యమయింది. అందుకే ముక్తినాథుడిని మార్చి నుండి జూన్‌ వరకే చూడవీలవుతుందంటారు. ఒక పద్ధతిలో రోడ్డు లేదు. రాళ్ళు కంకర రోడ్డుకుండా వెళ్ళాలి. పది, పన్నెండు మైళ్ళ దూరమయినా అక్కడకు వెళ్ళేటప్పటికి మా నడుములు కదబడ్డాయి. జీపు రాణిపౌవా గ్రామంలో ఆగింది. అక్కడ నుండి కాలిబాటలో ఆలయపాదపందాకా వెళ్ళాలి. మోటారు సైకిళ్ళ మీద తీర్థయాత్రీకులను తీసుకువెళ్ళేవాళ్ళూ ఉంటారు. పర్వత పాదపంనుండి సుమారు రెండువందల మెట్లు ఎక్కాక, ముక్తినాథాలయం వస్తుంది.
హిందువులకు, బౌద్ధులకు తీర్థస్థానమయిన ముక్తినాథధామం థొరాంగ్‌లా కనుమల్లో నెలకొని ఉంది. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో ఇది 105వది. 51 శక్తి ఫీఠాల్లో ఒకటి. మొదట్లో దీన్ని తిరుసాలి గ్రామమని పిల్చేవారు. శ్రీమన్నారాయణుని రూపాలుగా భావించే సాలిగ్రామ శిలలు ఇక్కడ ప్రకృతిలో లభ్యమవుతాయి. విష్ణుపురాణం, గండకీ మాహాత్మ్యంలో ఈ తీర్థస్థాన ప్రసక్తి ఉంది. బౌద్ధులు దీన్ని 'చ్యుమింగ్‌ గ్యట్సా' అని వ్యవహరిస్తారు.అంటే 'శతజలా'లని అర్థం. ఇక్కడి మూర్తి అవలోకితేశ్వరుడు.
పైన దేవుడిని దర్శించుకోటానికి ముందు అక్కడ 108 జలధారలున్నాయి. అవి సహజ జలధారలు కావు. మానవులు కృత్రిమంగా నిర్మించినవిగా నాకు కన్పించాయి. ''వాటికింద స్నానం చేస్తే ముక్తి లభిస్తుందని అంటారు'' అన్నాడు గోరఖ్‌.
నాలాంటి శంకాస్పదుడికి వాటిల్లో పవిత్రత దృగ్గోచరం కాలేదు.
శ్రీవాత్సవ్‌ ఆ నీటిలో చెయ్యిపెట్టి చూశాడు. ఆ ఎండాకాలంలో కూడ నరాలు జివ్వుమనేట్టుగా చల్లగా ఉన్నాయి. నవ్వుతూ, ''అవును తప్పదు ఈ జల స్నానంతో ముక్తి తప్పకుండా వస్తుంది''అన్నాడు.
''అరే ఛుప్‌. పాప్‌లగేగా'' అని అతన్ని భార్య కసిరింది. తను స్నానం చెయ్యటమే కాదు, దూరంగా ఉన్న మొగుడిమీద ఆ నీళ్ళనుకూడ చల్లింది.
మాలో చాలమంది ఆ నూట ఎనిమిది జలధారల్లోని నీటిని చల్లుకున్నారు. నేనూ చల్లుకున్నాను.
దేవుడిని దర్శించుకున్నాక మా కక్కడపనేంలేదు. వెంటనే జీపులో బయలుదేరి జోమ్‌సమ్‌ వచ్చేసరికి సాయంత్రమయింది. దేవుడి దయవల్ల వాన కురిసి గండకీ నదిలోకి నీళ్ళు రాలేదు. వస్తే మా తీర్థయాత్ర అక్కడితో ఆగిపోయి ఉండేది.
మర్నాడు మళ్ళా విమానంలో పోఖ్రా వచ్చాం. హోటలు చేరుకుని బ్రేక్‌ఫాస్టయ్యాక తీరిగ్గా గుప్పేశ్వర్‌, వారాహి నదీ విహారం, శివాలయం దర్శించాం. మహిళామణులందరూ ముందుగా అక్కడ షాపింగ్‌ చేయాలని పట్టుబట్టారు. గోరఖ్‌ బాబు మమ్మల్నో షాపుకు తీసుకువెళ్ళాడు. భారత పర్యాటకులకు అక్కడ చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. అధిక విలువ కలిగిన భారత రూపాయలనిచ్చి, తక్కువ విలువ నేపాలు రూపాయల్లో ధర పల్కే వస్తువులను మనవాళ్ళు కొంటారు. మన రూపాయికి కొనుగోలు ధర ఎక్కువ అని మనవాళ్ళు గుర్తించుకోరు. స్త్రీలు రకరకాల వస్తువులు కొన్నారు. అందరూ సాధారణంగా కొన్నవి పగడాలు, రత్నాలు, తులసి మాలలు, గిల్టు హారాలు; వేరే వస్తువులు కొన్న వారుకూడ ఉన్నారు.
ఆ మా తీర్థయాత్రలో ఎన్నో ప్రదేశాలు తిరిగాం. సీతాదేవి జన్మించిన జనక్‌పూర్‌ (మిథిలా నగరం) నూ, గౌతమబుద్ధుడు జన్మించిన లుంబినినీ దర్శించాం. అయితే, ఆ మర్నాడు ఉదయం పోఖ్రాలోని వారాహి ఆలయ సందర్శనంలో నాకు కలిగిన అనుభవం అద్వితీయమైనది. ఎంత తాత్వ్తిక బోధ జరిగినా తిండి తప్పదన్న ప్రాథమిక జ్ఞానం నాకప్పుడే దృశించింది. నేను వెతుక్కుంటూ వచ్చిన తత్వమేదో అక్కడ కన్పించింది. దాని తర్వాత నేనింకేమీ చెప్పను.
మేం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో వారాహి ఆలయానికి వెళ్ళాం. అది ఒక చిన్న గుట్టమీద ఉంది. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. చాల మెట్లుండటం వల్ల స్త్రీలు ఎక్కటానికి ఇబ్బంది పడ్డారు. పైన రెండు, మూడు ఆలయాలున్నాయి. భక్తులెవరూ ఇంకా వచ్చినట్లు లేదు. ఇద్దరు పిల్లలు ఆరు, ఏడు యేండ్ల వయసు వాళ్ళు పిట్టగోడ నానుకుని బయటకు చూస్తున్నారు. పైనుండి చూస్తే దూరంగా స్కూలు కన్పించింది. నీలం రంగు యూనిఫారం వేసుకున్న బాలబాలికలు భుజాన బ్యాగులు వేసుకుని స్కూలుకు వెళ్తున్నారు. వాళ్ళను గమనిస్తూ నుంచున్నారీ పిల్లలు. ఇద్దరూ ధోవతులు కట్టుకుని ఉన్నారు. పైన చిన్న ఉత్తరీయాలు, కాళ్ళకు చెప్పుల్లాంటివేమీ లేవు. నియమనిష్ఠలతో ఆ చిన్న శరీరాలు చువ్వల్లా ఉన్నాయి. మేం రావటం గమనించలేదా పిల్లలు. మా వాళ్ళు వచ్చి పైకి మెట్లెక్కి వచ్చిన ఆయాసం బాపుకునేందుకు చెట్ల చుట్టూ కట్టిన సిమెంటు దిమ్మలమీద కూర్చున్నారు.
దూరంనుండి పిల్లలు స్కూల్లో అసెంబ్లీ అవటం కన్పించింది మాకు. అంతలో నేపాలీ జాతీయగీతాన్ని పాడసాగారు వాళ్ళు.
సయౌథుంగా పూల్‌కా హామీ ఎఉటై మాలా నేపాలీ
సర్వభైమ భఈ ఫెఎకో మేచీ -మహాకాలీ
ప్రకృతికా కోటికోటి సంపదాకో ఆంచల్‌
వీరV్‌ారూకా రగతలే స్వతంత్ర ర అటల్‌
జ్ఞానభూమి శాంతిభూమి తరా ఈ పహాడ్‌ హిమాల్‌
అఖండ యో ప్యారో హామ్రో మాతృభూమి నేపాల్‌
బహులజాతి, భాషా, ధర్మ సంస్కృతి ఛన్‌ విశాల్‌
అగ్రగామీ రాష్ట్ర హామ్రో జయ జయ నేపాల్‌
స్కూల్లో పిల్లలు నేపాలీ జాతీయగీతం గానం చేస్తూంటే, వింటూ తన్మయుడై నిలబడిపోయారు. ఆ పిల్లలు.
నాకు అనుమానమొచ్చి, ''ఎవరు ఆ పిల్లలు? అని మా గోరఖ్‌బాబు నడిగాను.
''వాళ్ళే ఇక్కడి అర్చకులు. చిన్న పిల్లలుగా తీసుకు వచ్చి, వాళ్ళకు శాస్త్రాలు బోధిస్తారు. నియమనిష్ఠలతో కూడిన జీవనం వాళ్ళిక్కడ గడపాలి. పదకొండు పన్నెండేళ్ళు వచ్చాయంటే వాళ్ళనిక్కడ ఉంచరు. వేరే చిన్న పిల్లలను ఎంపిక చేసుకుని, వాళ్ళకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ అర్చకులుగా నియమిస్తారు.ఇక్కడ వీళ్ళకు పాఠశాల ఉంటుంది. వేదవేదాంగాలను గరుపుతారు''అని చెప్పాడతను.
''ఏ దేవుడు ఇక్కడ నెలకొని ఉన్నాడు?'' అనడిగింది సప్నాదేవి.
''వారాహి ఆలయమంటారు. దేవత వారాహి. ఆ పక్కన శివాలయంకూడ ఉన్నది.''
''వారాహి ఏ దేవత?''
''ఏమో, నాకు తెలీదు'' అన్నాడు గోరఖ్‌నాథ్‌.
ఆ ఆలయం పేరు వినంగానే, రామకృష్ణ భార్య లలితా సహస్రనామంలో ఒక శ్లోకాన్ని పఠించింది.
''విశుక్రప్రాణహరణ వారాహీ వీర్యనందితా
కామేశ్వరముఖాలోక కల్పిత గణేశ్వరా' అంటూ. ''ఆమె దుర్గ, కాళి, మహాదేవి; లలితా మాతకున్న సహస్ర నామాల్లో వారాహి ఒకటి'' అంది.
నేపాలీ జాతీయగీతం పాడటం పూర్తయి, విద్యార్థినీ, విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లలోకి వెళ్తూంటే, చూస్తూ నుంచున్న అర్చక బాలలు, స్కూలు ఆవరణ ఖాళీకాగానే తమకు కేటాయించిన ఆలయాల్లోకి వెళ్ళారు.
మేమంతా వారాహీదేవి ఆలయంలోకి వెళ్ళాం. ఆ చిన్న పూజారి మంత్రాలు స్పష్టంగా చదివాడు. పిల్లవాడు కదా, తప్పుగా ఉచ్చరిస్తాడని అనుకోటానికి వీలు లేదు. ''అకాలమృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం, శ్రీ వారాహీ పాదోదకం పావనం శుభం'' అని మంత్రం చదువుతూ మాకు తీర్థమిచ్చాడు.
కాసేపు ఆలయంలో కూర్చున్నాక, మా వాళ్ళు చాలమంది శివాలయంలోకి వెళ్ళారు. నా పక్కనే గోరఖ్‌ ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే నాకు ముచ్చటేసింది. '' ఆ పిల్లవాడికి ఏమన్నా ఇస్తే బావుంటుందా?'' అని అడిగాను.
''అమ్మవారికా?'' అన్నాడతను.
''అమ్మవారికి దిబ్బెనలో వేశాం కదా! పిల్లవాడికే''
''ఇవ్వొచ్చు. తప్పేం.'' అన్నాడు గైడు.
నేను ఒక పదిరూపాయలు తీసి ఆ పిల్ల అర్చకుడిని తీసుకోమన్నాను.
''నాకు వద్దు'' అన్నాడు ఆ పిల్లవాడు.
స్వల్పమైన ఆ పదిరూపాయల నగదు ఇవ్వటం తన్ను అవమానించటంగా భావించాడేమోనని, నా తప్పుదిద్దుకోటానికి వంద రూపాయల నోటు తీసి అతనికివ్వ బోయాను.
''ఎందుకిది? ఏం జేసుకోను? అమ్మవారికి వేశారుగా'' అన్నాడతను.
''ఇది నీకు.''
''నాకు డబ్బొద్దు'' అన్నాడు ఆ పిల్లవాడు.
''మరేం కావాలి?''
''చాక్లెట్‌ ఉందా?''
నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇంత నియమనిష్ఠలతో వాంఛలకు దూరంగా వేద పారాయణల మధ్య జీవన సాగిస్తున్న ఈ పిల్లవాడికి ఇలాంటి తుచ్ఛమైన కోరిక కలగటమేమిటి అని ఒక క్షణం అన్పించింది. సంప్రదాయ బుద్ధి తేలిగ్గా వదలదు.
''వంద రూపాయలకు చాల చాక్లెట్లు వస్తాయి. కొనుక్కోవచ్చుగా?''
''మమ్మల్నిక్కడనుండి వెళ్ళనివ్వరు.
నేను వెంటనే గోరఖ్‌ను పంపి చాక్లెట్లు తెప్పించాను. అతనికి కొన్ని ఇచ్చాను. ఆ తరువాత శివాలయంలోకి వెళ్ళి, అక్కడా తీర్థం తీసుకున్నాక, ఆ పిల్ల పూజారికీ చాక్లెట్లు ఇచ్చాను. అతడు ఆత్రంగా వాటిని తీసుకోవటం చూసిన తరువాత 'వీరు ఏర్పరచిన ఈ వ్యవస్థ ఎంత వరకు నిర్దుష్టమయింది?' అన్న ఆలోచన నాకు కలిగింది.
ఇదంతా చూస్తూనుంచున్న శ్రీవాత్సవ్‌,''ఉరు షుడ్‌ రిపోర్ట్‌ అబౌట్‌ దిస్‌ కుమారీ అండ్‌ ఛైల్డ్‌ ప్రీస్ట్‌హుడ్‌ ఇన్‌స్టిట్యూష్యన్స్‌, ఫర్‌ దైర్‌ వయలేషన్‌ ఆఫ్‌ ద ఇంటర్నేషల్‌ లా అగెనెస్ట్‌ ఛైల్డ్‌ లేబర్‌'' అన్నాడు.
''ఇది మతం, సంప్రదాయం. ఇందులో అధునాతనకు, తార్కికతకు చోటు లేదు. అంతగా ఆధునికమనుకున్న దేశాల్లో స్త్రీలకు సమానహక్కులున్నాయా? అక్కడేం వయొలేషన్స్‌ జరగటం లేదా?'' అన్నాడు రామకృష్ణ
''మన దేశంలో మధురలో, కాశీలో నివశించే విధనాల జీవన పరిస్థితి మెరుగు పర్చటానికి మనమేం చేస్తున్నాం. కర్ణాటకలో, తెలంగాణలో మనం జోగినీ వ్యవస్థను రూపుమాపామా? రాజస్థాన్‌లో సతీసహగమనాలు ఆగిపోయాయా? దేశంలోని ఎన్నో పల్లెల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి, వాటిని నిరోధించటానికి మనం ఉద్యమించామా?'' అన్నాడు బుచ్చిబాబు.
నాది ఏ వాదననూ కాదనలేని పరిస్థితి.
''ఇహ పదండి, జనక్‌పూర్‌ వెళ్ళాలి'' అని వచ్చిన గోరఖ్‌బాబును అనుసరించాం.
స్త్రీలు రావటానికి నిరీక్షిస్తూ బుచ్చిబాబు తదితరులు నిలబడి ఉంటే, నేను, గోరఖ్‌ బాబు మెట్లు దిగి కిందకు వచ్చాం. నేను అతన్ని అడిగాను, నువ్వు ఆస్తికుడివా, నాస్తికుడివా?'' అని.
''నేను మార్గదర్శినండీ. ఆస్తికులకు గుళ్ళు, గోపురాలు చూపిస్తున్నాను. కుమారీ, పురోహిత వ్యవస్థల గూర్చి చెప్తున్నాను. నాస్తికులకు కట్టడాలు, భవనాలు, కళాఖండాలు చూపిస్తున్నాను. ఆర్థిక, సాంఘిక విషయాలను వివరిస్తున్నాను''అన్నాడు.
''మరి నాకేం చూపిస్తున్నావు?''
''మీరు ఇలా అడిగారు కనుక చెప్తాను. ఈ రెండు బృందాలలోకీ మీరు చేరరు. బహుశ: మీరు అజ్ఞేయతావాదులేమో! ఆస్తికత్వాన్నిగానీ, నాస్తికత్వాన్నిగానీ ప్రశ్నించరు. మీరు వస్తువుల్లో, సంస్థలో, వ్యవస్థల్లో సంస్కృతిని చూడ ప్రయత్నిస్తున్నారు.''
''మరి నువ్వో?''
''నా ఎంఏ (చరిత్ర) సంపాదించి పెట్టలేని భుక్తిని నాకీ మార్గదర్శకత్వం చూపెట్టింది. ఎవరి మార్గం వారిది. అన్ని మార్గాలూ ఎక్కడో ఓ చోట కలియక తప్పదు. నాకూ చాక్లెట్‌ అంటేనే ఇష్టం!'' అని నవ్వాడు మార్గదర్శి.
- కాకాని చక్రపాణి

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు వరల్డ్‌ ఎయిడ్స్‌ డే...
సెకండ్‌ థాట్‌
అనుసరణ
జననీ జన్మభూమిశ్చ...
గుణపాఠం
మావాడి తెలివే తెలివి
మరో గ్రంథాలయోద్యమం
సింహం చిట్టెలుక మధ్యలో నక్క
తెరిచెరు!?
కిత్తూరు వీరనారి చెన్నమ్మ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
02:05 PM

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : డీఎంకే స్టాలిన్

02:02 PM

ఉల్లి సబ్సిడీ కేంద్రం వద్ద తొక్కిసలాట

01:49 PM

రైల్వేస్టేషన్ల భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

01:46 PM

అంబేద్కర్‌కు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నివాళి

01:37 PM

ఘటనాస్థలికి బయల్దేరిన మృతుల తల్లిదండ్రులు

01:36 PM

ఇంతటితో అత్యాచారాలు ఆగిపోతాయా? : గుత్తా జ్వాలా

01:20 PM

ఏపీ సీఎం వ్యక్తిగత సహాయకుడి మృతి

01:05 PM

ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నా : ఎంపీ నవనీత్ రాణా

12:56 PM

వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

12:49 PM

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలో శవపరీక్షలు

12:42 PM

దేశంలో ఏం జరుగుతోంది..? బీజేపీపై ఫైర్‌ : అధిర్‌ రంజన్‌

12:42 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంను ప్రారంభించిన చంద్రబాబు

12:22 PM

హోంగార్డులు సమానంగా కష్టపడుతున్నారు: డీజీపీ

12:14 PM

ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి స్పందన

12:08 PM

ప్రియురాలిని ఐసీయూలో పెళ్లాడిన ప్రియుడు

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.