Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాయ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

మాయ

Sat 16 Jan 16:16:15.398056 2016

      కొన్ని విషయాల్లో మెజారిటీ జనం ఆలోచనల ఆకర్షణ ఒకేలా ఉంటాయి. హోటల్‌ హాలులో ఫంక్షన్‌ చేసుకుంటే హాలుకి అద్దె ఫ్రీ. వాళ్లు పెట్టే భోజనానికి మాత్రమే డబ్బు తీసుకుంటారు. హాలు అద్దె ఆ భోజనాల ఖర్చులోనే కలిసి ఉంటుందని తెలుసు. అయినా అదోరకం భ్రమ. రమ్య, వినోద్‌ కూడా తమ కూతురి మూడో సంవత్సరం పుట్టిన రోజుకి అలాంటి భ్రమకే లొంగిపోయారు. పెద్ద హోటల్‌ అని ముందు సందేహించినా చివరికి అక్కడే ఏర్పాటు చేశారు.
ఒక్కగానొక్క పిల్ల. జనం లేకపోతే బావుండదని పేరు పేరునా గుర్తు తెచ్చుకుని మరీ అ ందరినీ పిలిచారు.
పుట్టిన రోజు పండగ మంచి హడావుడిగా, సందడిగా, ఆనందంగా గడిచింది. వీలున్నవాళ్ళే వస్తారు... పిలిచిన అందరూ రారు కదా అనుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా దరిదాపు రెట్టింపు వచ్చారు.
డెకరేషన్‌కి, భోజనానికి, వీడియోలకి వీళ్ళు అనుకున్నది నలభైవేలు. కానీ చివరికి తేలిన ఖర్చు డెభ్బై వేల పైన. భార్యాభర్తా ఇద్దరూ శ్రమపడి యాడాది ఆపటు పొదుపు చేసి దాచిన డబ్బు అది. పైకి చెప్పుకోలేకపోయినా, తాము ఉద్యోగాల రకరకాల ఒత్తిడి అనుభవించి చేసిన పొదుపు. ఏదో ఓ పెనుగాలికి కొట్టుకుపోయినట్టే ఉంది ఆ ఇద్దరికీ. మళ్ళీ రూపాయి రూపాయికి బెంగపడే పొదుపు జీవితమే.
ఆటో ఫైనాన్స్‌ వాళ్ళ దగ్గర లోన్‌ తీరిపోయినందుకు అంతా ఇంతా ఆనందం కాదు బాలరాజ్‌కి. ఇంక రోజా సంపాదించేదంతా తనదేనన్న ధీమా.
కష్టపడుతున్నా ఆనందంగా ఉంది. అప్పులేని సుఖం ఎంత బావుందీ అనుకున్నాడు ఆ వారమంతా బాలరాజ్‌. అతని ఆనందం అలా మిగల్లేదు. మరుసటి రోజు పిల్లలిద్దరూ పుట్టెడు జ్వరంతో నిద్రలేచారు. హడావిడిగా హాస్పటల్‌కి తీసికెళ్ళారు. మూడు రోజులు వైద్యం జరిగినా జ్వరాలు తగ్గలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాల భయాలు పెట్టి, అశ్రద్ధ చేయకుండా పెద్ద హాస్పటల్‌కి తీసికెళ్ళమన్నారు. అలాగే చేశాడు. నాలుగు రోజులు రకరకాల పరీక్షలు చేసి చివరికి వైరల్‌ ఫీవర్‌ అన్నారు.
బాల్‌రాజ్‌ మళ్ళీ తనకున్న ఏకైక మార్గం ఫైనాన్స్‌ వాళ్ళ దగ్గర అప్పు చేశాడు. మామూలు వైరల్‌ ఫీవర్‌కి ముప్పై వేలైంది. ఆ అప్పు తీర్చడానికి బాలరాజ్‌కి రెండేళ్ళు పడుతుంది. మళ్ళీ మామూలుగా అప్పు దిగుల్లో కూరుకుపోయాడు.
ఆ కార్పొరేట్‌ స్కూల్‌ వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ నెగ్గి, వెంకట్రావు దంపతులు తమ పిల్లాణ్ణి ఎల్‌.కె.జి.లో విజయవంతంగా చేర్చారు. యూనిఫారం తదితర సరంజామా కొన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌కి డబ్బు కట్టారు. అన్నీ చేరి తొంభైవేలు దాటింది.
ఒక్క పిల్లాడే కదా పర్వాలేదనుకున్నారు. అయినా తొంభైవేల బరువు తెలుస్తూనే ఉంది. ఇప్పుడే ఇలా అయితే, పై చదువులు ఇంకెలాగో అనిపించింది. బలవంతంగా ఆ దిగుల్ని వాయిదా వేసుకున్నారు.
గతంలో... అంటే యాభై, అరవై ఏళ్ళక్రితం పిల్లలు పుట్టిన రోజులు, జ్వరాలు వస్తే వైద్యం, స్కూల్‌లో చేర్పించి చదువులు చెప్పించడం చాలామంది చేశారు. ఎందరో వాటిని చూశారు.
అప్పుడవి అంత పెద్ద బరువనిపించేవి కావు. వాటికోసం ఖర్చు చేసినా ఆ ఖర్చు మరీ ఇంత దిగలాగేసేది కాదు. పిల్లల పెంపకం ఓ ఆనందంలా, ఓ జీవన సౌరభంలా ఉండేది. కష్టాలైనా, సుఖాలైనా, బతుకులో సహజంగా ఎదురైనట్టే ఉండేవి.
ఇప్పుడలా కాదు. పిల్లల్ని సరిగ్గా పెంచలేమన్న బెదురు. వాళ్ళ పెంపకం ఓ బరువులా, భయంలా మారుతున్న అమానుషం. అవసరాలు అప్పుడు... ఇప్పుడూ అవే. కానీ భారంలోనే తేడా. కృత్రిమ భారం.
ఇన్నేళ్ళుగా చాపకింద నీరులా, ఎందరెందరో స్వార్థ వ్యాపార మేధావులు సృష్టించి, జన సామాన్యం మీద దట్టంగా పరిచిన మాయ. జీవితంలోని రుచిని పిండేస్తున్న మాయ. అందరూ అదే చేస్తున్నారు, మనం అలాగే చెయ్యాలన్నా మూకుమ్మడి ఆలోచన. దానికి భిన్నంగా ఆలోచనే తట్టనివ్వని మాయ.
రమ్య, వినోద్‌, బాలరాజ్‌, వెంకట్రావు దంపతులు, మరొకరు, మరొకరు... అందరూ ఈ సుడిగుండంలో ఉన్నవాళ్ళే. వ్యక్తిపరంగా ఏం చెయ్యలేం అనిపించే సుడిగుండం. అందీ అందని ఊపిరిలాంటి జీవితం.
ఏది ఏమైనా, దోషం ఎవరిదైనా మన పిల్లలు మనకి భారం అనిపించేలా పరిస్థితిని సృష్టించిన ఈ మాయ మహాఘోరం.
- వి.రాజరామమోహనరావు, 9394738805

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు వరల్డ్‌ ఎయిడ్స్‌ డే...
సెకండ్‌ థాట్‌
అనుసరణ
జననీ జన్మభూమిశ్చ...
గుణపాఠం
మావాడి తెలివే తెలివి
మరో గ్రంథాలయోద్యమం
సింహం చిట్టెలుక మధ్యలో నక్క
తెరిచెరు!?
కిత్తూరు వీరనారి చెన్నమ్మ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
02:05 PM

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : డీఎంకే స్టాలిన్

02:02 PM

ఉల్లి సబ్సిడీ కేంద్రం వద్ద తొక్కిసలాట

01:49 PM

రైల్వేస్టేషన్ల భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

01:46 PM

అంబేద్కర్‌కు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నివాళి

01:37 PM

ఘటనాస్థలికి బయల్దేరిన మృతుల తల్లిదండ్రులు

01:36 PM

ఇంతటితో అత్యాచారాలు ఆగిపోతాయా? : గుత్తా జ్వాలా

01:20 PM

ఏపీ సీఎం వ్యక్తిగత సహాయకుడి మృతి

01:05 PM

ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నా : ఎంపీ నవనీత్ రాణా

12:56 PM

వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

12:49 PM

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలో శవపరీక్షలు

12:42 PM

దేశంలో ఏం జరుగుతోంది..? బీజేపీపై ఫైర్‌ : అధిర్‌ రంజన్‌

12:42 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంను ప్రారంభించిన చంద్రబాబు

12:22 PM

హోంగార్డులు సమానంగా కష్టపడుతున్నారు: డీజీపీ

12:14 PM

ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి స్పందన

12:08 PM

ప్రియురాలిని ఐసీయూలో పెళ్లాడిన ప్రియుడు

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.