Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా.. | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..

Sun 17 Jan 01:06:58.186169 2021

టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా.. అనే ఉంటుంది ఆ ఉత్తరాలపై చిరునామా.. వచ్చీరాని అక్షరాలతో.. ఫ్రం అడ్రస్‌ ఎవరిదో రాసి ఉండదు.. వారం, పదిరోజులు, పదిహేనో ఇరవయ్యో రోజులకోసారి నెలలో రొండుమూడైనా ఊదారంగు ఉత్తరాలు ఆ ముంగిట్లోకొచ్చి పడతారు..
ఏదో అడవి పావురం ఎగిరొచ్చి వాలినట్టు పోస్ట్‌ అన్న కేకతో పాటే ఉత్తరం నేలపై పడుతుంది.. తీసుకునే వారెవరూ రాకపోయినా ఆ ముసలి, చెవిటి జంగయ్య ఇంతవరకే తన పని అన్నట్టు ఉత్తరాన్ని వాకిట్లో అలా విసిరేసెళతాడు.. అలా కొన్ని నెలలుగా ఆ వాకిలికి నీలిరంగు ఇన్లాండ్‌ కవర్లే చుక్కల ముగ్గవుతున్నాయి.. టు అడ్రస్‌ అక్షరాలన్నీ ఒకే దస్తూరితో అన్నీ ఒకరే రాస్తున్నారా అన్నట్టు.. దుమ్ముతింటూ కొన్ని ఎండతాగుతూ ఇంకొన్ని రంగువెలసి చినుకుల తడిచీ ఇంకక్షరాలు అలుక్కుపోతూ ఇంకొన్ని రెక్కలు కట్టుకున్నట్టు ముడుచుకొని పడి ఉన్నారు..
విశాఖ ఏజెన్సీలో దట్టమైన అడవి దాటి ఎత్తైన కొండ మీదుంటుందా కోయగూడెం.. మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్లుంటుంది.. పది కిలోమీటర్ల దూరంలోని తిప్పగూడెం స్టేజీ వరకు ఆటోలో ప్రయాణించి అటు తరువాత సైకిల్‌ మీద రెండు కిలోమీటర్లు ఆ తరువాత కాలినడకే శరణ్యం.. దట్టమైన అడవిబాట ఎగుడుదిగుడు కొండలెక్కుతూ పాములు, అడవి మగాలను తప్పించుకుంటూ కోయగూడెం చేరాలి.. చెట్ల మధ్య పుట్టల మధ్యా అక్కడక్కడ విసిరేసినట్టు గుడిసెలు.. ఒక్కటి మాత్రం ఇటుకలతో కట్టిన నాలుగు గదుల మిద్దె..
కొండ మీది నుంచి అడవిలోయ అందాలను ఆస్వాదించేందుకు పూర్వమెపుడో బ్రిటీష్‌ హయాంలో తెల్లదొరలు దాన్ని గెస్ట్‌హౌస్‌గా వినియోగించారట.. స్థానికులు దొరలబంగ్లాగా పిలిచే ఆ ఇల్లు ఇప్పుడది పాతబడింది పాడుబడింది.. ఆ ఇంటిని కొంతకాలం క్రితం వరకు ఆ కోయగూడెం స్కూల్‌ టీచర్ల క్వార్టర్‌గా వినియోగించేవారు..
కొద్ది నెలలలక్రితం వరకూ అందులో కొలువుకాపురమున్న యువ ఉపాధ్యాయుడికిమరేదో ఉద్యోగం రావటంతో ఆ ఇంటినే కాదు కొండమీది ఆ కోయగూడేన్నీ విడిచి వెళ్లాడు.. కొత్త ఉద్యోగమొచ్చి కాదు అతనెదో మానసిక క్షోభతో ఆ ఊరిని విడిచి వెళ్లాడని కొందరనుకుంటారు..
వాస్తవానికి అతనుండగా రావలసిన ఉత్తరం కొన్నిరోజుల ఆలస్యాన వచ్చింది.. అప్పటి నుంచీ అలా నెలకు రొండుమూడు వస్తూనే ఉన్నారు.. ఉత్తరాలను తీసుకుంటున్నారా లేదా అన్న పట్టింపు లేకుండా జంగయ్య ఆ ఎత్తైన ప్రహరీ గల మిద్దె లోపలికి అలా ఉత్తరాలు విసిరేస ివెళ్లిపోతున్నాడు.. అసలు ఈ పోస్ట్‌ మ్యాన్‌ నియమాకమే చిత్రంగా జరిగింది..
'నీకు చదవటమొచ్చా' ఆ పోస్టల్‌ అధికారి ప్రశ్నతో చిన్నప్పుడు తల్లి బలవంతంతో ఐదో తరగతి వరకు చదివిన సంగతి గుర్తొచ్చింది డెబ్బయ్యేళ్ల జంగయ్యకు.. వచ్చన్నట్టు తలూపగానే.. అయితే ఇవి చదువు అంటూ ఆ అధికారి పక్కనే ఉన్న గోనెమూటలో నుంచి కొన్ని ఉత్తరాలు తీసి వాటిపై అడ్రస్‌ లు చూపించగానే వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు జంగయ్య చూపుతగ్గి మసకబారిన కళ్లను రిక్కించిచూస్తూ ఆ అడ్రస్‌ పేర్లను కూడబలుక్కుంటుండగా.. సరే అయితే ఈ ఉత్తరాల సంచిని వారానికోసారో రొండుసార్లో కొమర్రాజుల గుట్ట తీసుకుపోయి బట్వాడా చేయాలి ఇదేం గవర్నమెంటుద్యోగం కాదు మెమే ప్రైవేటుగా పెట్తుకుంటున్నాం.. అని స్వరం పెంచి గట్టిగా చెపుతున్నాడు అధికారి జంగయ్యకు వినికిడి కూడా తక్కువే అని గ్రహించి..
దట్టమైన అడవిలోని గుట్ట పైభాగాన గల కోయల ఆవాస ప్రాంతంలో ఉత్తరాలను బట్వాడా చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటంతో ఆ గూడెం వెళ్లాల్సిన ఉత్తరాలు గత నెల రోజులుగా మండల కేంద్రంలోని పోస్టాఫీసులో పేరుకు పోతున్నాయి.. ఉత్తరాలు బట్వాడా కాని విషయం అధికారులకు తెలియటంతో డెయిలీ వేజ్‌ మీద ఎవరినైనా కోయనే నియమిస్తే సమస్య తీరుతుందని వాళ్లైతే అడవికి భయపడకుండా ఉత్తరాలు చేరవేస్తారని భావించారు..
రోజుకు మూడొందలిస్తామని చాటింపు వేయించటంతో నలుగురైదుగురు స్పందించారు వారిలో జంగయ్యా ఉన్నాడు.. మిగతా వాళ్లతో పోలిస్తే జంగయ్య వద్ధుడైనప్పటికీ చూడ్దానికి బలిష్టంగానే ఉన్నాడు పైగా మిగతావాళ్లకు చదువు రాకపోవటంతో అంతో ఇంతో చదవటమొచ్చిన జంగయ్యే దిక్కయ్యాడు..
కోయడింగ్యా కూతురు తార. తారకు మండల కేంద్రంలోని వారాంతపు సంతలో ఒక యువకుడు పరిచయమయ్యాడు.. తెరలు తెరలుగా మంచుసోయగాలను తన కెమెరాలో బంధిస్తున్న ఆ యువకుడు పరదా మాటున వెలుగు దివ్వెలా తళుకులీనుతున్న తారను వివిధ భంగిమల్లో బంధిస్తున్నాడు.. తెనే, జిగురు, కుంకుళ్లు విక్రయిస్తున్న తార ఆ యువకుడ్ని ఆలస్యంగా గమనించి కోపంగా చూసింది.. ఆ భంగిమనూ అతను క్లిక్‌మనిపిస్తుండె సరికి ఏరు.. అంటూ తన భాషలో అరుస్తూ అతని వైపొచ్చింది.. ఏవి.. ఏం తీశావ్‌ ఎందుకు తీశావ్‌ అని గొడవ పడుతుండటం అతనికి మరింత నచ్చుతోంది.. ప్రకతి అందాన్ని బంధించేందుకు అనుమతెందుకంటున్నాడు.. అతను చెప్పేదేంటో ఆమె అర్థం కావట్లేదు.. ఆమె అరుస్తుండటాన్ని గమనించిన ఇంకో ముగ్గురు ఆమె స్నేహితురాల్లో బంధువులో అక్కడికొచ్చారు.. వాళ్లకు తన భాషలో చెపుతుండగా ఇక్కడ ఇలాంటివి మామూలే నువ్వు ఈ రోజే కదా సంతకొచ్చింది నీకు తెలియదులే అని అంటుండటంతో కొంత శాంత పడింది తార. అయినా ఏవి చూపించు అంటూ చేత్తో సైగలు చేస్తూ అరుస్తుండటంతో ఆ యువకుడు కెమెరా స్క్రీన్‌ మీద తాను తీసిన ఫొటోలను చూపిస్తుండే సరికి అందులో ఉంది తనేనా అన్నట్లు ఆశ్చర్య పోతోంది తార.. అలా అతనితో స్నేహం కలిగింది.. ఆ తరువాత ప్రతివారం అతని కోసం ఆమె కళ్లు వెతికేవి.. ఆమె కోసమే తనకు ఫొటోగ్రఫీ హాబీ అలవడిందేమో అని అతను అనుకునేవాడు... అలా అతను అపుడపుడు ఆమె కోసం ఆ కొండ మీదకూ కెమెరా పట్టుకొని వెళ్ళేవాడు..
ఒకరోజు అతను కొండ మీదికొచ్చాడని తెలిసి ఎక్కడో అడవి మధ్యలో ఉన్న తారా గబగబా రాళ్లు నీళ్లు దూకుతూ దాటుతూ పరుగెత్తుకొచ్చింది.. అటుతిరిగి సెలఏటి నడక చూస్తున్న అతను ఆమె అలికిడి విని ఇటు తిరిగాడు.. తార కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుండగా ఆమె ఎక్కడికెళ్ళావ్‌, ఇన్నాళ్లు ఎక్కడికెళ్లవ్‌, తెలీదా నీకోసం కళ్లు కాయలు కాచేలా కాచుకునుంటానని తెలీదా ఏం పిచ్చిదాన్ననుకున్నావా.. అంటూ ఆవేశంగా అతని చెంప మీద లాగికొట్టి అక్కడి నుంచి పరుగెత్తి వెళ్లిపోయింది..
గత కొంతకాలంగా అతను హఠాత్తుగా కనిపించకుండా పోవటంతో అతనితో ఉండేవాళ్లను ఆరాతీస్తే అతను ఏదో ఉద్యోగానికి ప్రిపేరవుతున్నాడని చెప్పటంతో ఎదురు చూపులు పరచటం తప్ప ఇక ఎవరినీ ఏమీ అడగలేకపోయింది తార. అతనొక్కసారిగా ఎదురవటంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది..
ఆ తరువాత నాలుగు నెలలకు ఆశ్చర్యకరంగా అతను ఉపాధ్యాయుడిగా తమ గూడానికే రావటంతో ఎంతో సంతోషించింది తార.. దొరబంగ్లాలో అతని వైపు చూడటం కోసమే అటువైపెళ్ళేది.. కొన్నిసార్లు పిల్లల్ని తాను పంపించి వస్తాని ఇరుగుపొరుగు పిల్లల్ని తీసుకెళ్ళేది.. బడికెళ్లనని మారాం చేసే పిల్లల్ని తనే ముద్దుచేస్తూ తీసుకెళ్ళేది పని పాటల్లోని పిల్లల్ని బడిలో చేరండని చెపుతూ వాళ్లను అతని వద్దకు తీసుకెళ్ళేది.. అలా వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ బలపడిన్ది...
అతను మంచినీళ్లకో మరే అవసరం కోసమో అన్నట్టు ఆమె కోసం డింగ్యా గుడిసెకు వస్తూపోతుండే వాడు.. సెలవు ముందురోజు అతను కొండదిగి తన ఊరెళ్లిపోతుంటే అతను అదశ్యమయ్యేదాకా ఏ చెట్టు చాటునో, గుడిసెలో నుంచో చూసేది తార..
వాళ్ల ప్రేమ విషయం గూడెంలోని కొందరి కంట పడటంతో డింగ్యా పరువు క్షోభతో బాణం దిగిన లేడిలా విలవిల్లాడాడు.. మరింత అల్లరి కాకమునుపే తారకు బలవంతపు మనువు నిర్ణయించాడు.. తార ససేమిరా అని మొండికేయటంతో డింగ్యా ఆ అవమానం భరించలేక విషపు కాయలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు తనూ అదేబాట పడతానని తల్లి బెదిరించటంతో అలా తార మెళ్ళో ముళ్ళు పడ్డాయి...
ఇష్టంలేని బలవంతపు మనువాడిన తార మరెప్పటికీ తిరిగి రానని దేవత దగ్గర ఆన పెట్టుకొని
ఆ గూడెం దాటింది కానీ ఆమె మనసింకా ఆ బంగ్లాలోనే చిక్కుకుంది..
ఐదో తరగతి చదివిన తార అప్పుడే ఉత్తరాలు రాయటమూ నేర్చుకుంది.. తన తపన మానసిక వేదన, అతనిపై ఆరాధన వ్యక్తం చేస్తూ రహస్యంగా లేఖలు రాస్తోంది.. ఎవరూ చూడని వేళ తనకు తెలిసిన విధంగా భావాలను ఉత్తరం చేసి పంపుతోంది.. ఆ నిశ్శబ్ద ప్రశాంతంలో తన హదయ మదంగ ధ్వని వినిపిస్తుంది.. జాబు చేరని నిషిద్ధ సరిహద్దు తనది కనుక తానేమీ ప్రత్యుత్తరమాశించదు.. ప్రతి ఉత్తరమూ అతనికి ముట్టినట్టే అనుకుంటుంది.. రాలుతున్న తారల్లా ప్రతిసారీ ఉత్తరాలక్కడ పోగుపడుతూ దొరల బంగ్లా ఊదారంగు వాకిలవుతోంది.. తను పెళ్లి చేసుకొని వచ్చేశాక అతను ఆ వియోగాన్ని తట్టుకోలేక ఎటో వెళ్లిపోయాడని తారకు తెలియదు.. బూజు పట్టి శిధిలమవుతోన్న ఆ బంగ్లాను రేపెపుడో కూలుస్తారు.. అడవి సెలఏరు లాంటి ఆ నిష్కల్మశ ప్రేమ ఊసులు ఎవరి చేతిన పడతాయో ఏమో...

- శ్రీనివాస్‌ సూఫీ,
9346611455

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.