Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఒక అమ్మ కథ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

ఒక అమ్మ కథ

Sat 02 Jan 23:23:58.761378 2021

అన్ని బంధాలను వదిలి మొదటిసారిగా పుట్టింటికి వెళ్తున్నాను. అన్ని బాధ్యతలు, అన్ని బంధాలు వదిలి మొదటిసారి పుట్టింటికి వెళ్తున్నట్లే ఉంది. కాలికి మెట్టలైనా, చేతికి గాజులయినా, మెడలో మంగళసూత్రమైనా, నుదుటన బొట్టయినా అన్నీ అన్ని బంధాలను వదిలి మొదటిసారిగా వెళ్తున్నాను పుట్టింటికి. అక్కడ అమ్మా, నాన్న ఎవరూ లేరు కానీ కన్నతల్లి లాంటి నేలతల్లి ఉంది, అమ్మ ఒడిలాంటి ఇంటి జాడలున్నాయి, అది చాలని పిస్తుంది నన్ను ఓదార్చడానికి. పసుపు కుంకాలతో పంపిన ఆ ఊరికే, మళ్ళీ వాటిని మెట్టి నింట్లో వదిలేసి ఒంటరిగా, నిస్తేజంగా వెళ్తున్నాను.
మాదొక చిన్న పల్లెటూరు. ఎంత చిన్నదంటే నేను పుట్టి అరవై ఏళ్లయినా ఏమాత్రం మార్పు లేని పల్లెటూరు. ఎక్కడో అడివిలో ఉన్నామా అంటే అదీకాదు, చుట్టూ పదహేను కిలోమీటర్ల దూరంలో పెద్ద ఊరు ఉంటుంది. అయినా మా ఊరు మారలేదు. ఊర్లోకి టీ.వీ.లు, ఫోన్లు, బైకులు వచ్చాయే తప్పా మనుషుల్లో, పరిసరాల్లో మార్పేమీ రాలేదు. ఏది కావాలన్నా దగ్గర్లోని ఊళ్ళోకి పోవాల్సిందే. ఏ ప్రమాదం జరిగినా బండి కట్టాల్సిందే. ముసలీ ముతకా, పిల్లా జెల్లాను ఇంటింటికీ కాపలా ఉంచి, అందరూ వలస బాట పట్టాల్సిందే. కాలాలెన్ని మారినా, ప్రభుత్వాలెన్ని మారినా మా ఊరు ముఖచిత్రం మారదు. మా ఊరికి ప్రపంచానికి సంబంధమే ఉండదు. అందుకే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ అలాగే కనబడుతుంటాయి.
 
అమ్మానాన్నలు, ఇద్దరన్నలు ఉన్న ఇంట్లో ఆడపిల్లను ఎంత అపురూపంగా పెంచుతారో చెప్పక్కర్లేదు. ఒక్క ఇంటోళ్ళేనా, ఊరు ఊరంతా ఆ ఆప్యాయతను అందిచ్చే వారే. ఆడపిల్లలకు పూలెంత ఇష్టమో నా పేరంటే కూడా నాకంత ఇష్టం. ఎందుకంటే నా పేరు మల్లి. మల్లమ్మ అంటూ అందరూ పిలుస్తుంటే అడివిలో మల్లెలా హాయిగా పెరిగాను. ఏ కంచెలు నాకు అడ్డు రాలేదు. ఇంటి పక్కన చింత చెట్టు కిందే మా చదువులు. పంతులు వచ్చాడంటే అది బడి, లేదంటే ఆటల ఒడి. పొద్దస్తమానం ఆ చింత చెట్టే మాకు తోడూ నీడా. ఆకలయ్యే సమయానికి కేకలు వినిపిస్తే గాని ఇంటికెళ్ళే ధ్యాస ఉండదు.
కాస్త పెద్దయ్యాక పక్కూరి బడికి పయనం. పొలాల మధ్య, వాగులు దాటుకుంటు, చింత కాయలో, జామకాయలో, రేగ్గాయలో, ఏది దొరికితే అవే తింటూ వెళ్ళడమే. రోజూ బడికి పోతున్నట్లుండదు. హాయిగా పచ్చదనంలో తిరిగొచ్చినట్లే ఉంటుంది. ఆడపిల్ల అనే ఆలోచన, భయం ఉండేది కాదు. తోడు ఉన్నా, లేకున్నా సాగుతూనే ఉంటుంది బడి పయనం. ఏడవ తరగతి అయ్యాక అదే గొప్ప చదువనుకున్నారేమో, పెద్దయ్యాననుకున్నారేమో చదువు చాలించేశారు. ఇంట్లో పని, చేలో పని రోజంతా గడియారంలా కదలాల్సిందే. అదే పనితనం తర్వాత్తర్వాత అక్కరకొస్తుందని ఊహించలేదు.
పెళ్ళీడుకొచ్చానేమో నాకయితే తెలీదు కానీ, మొత్తానికి పట్టణంలో ఉద్యోగం చేసే అబ్బాయిని వెతికి పట్టుకున్నారు. ఉద్యోగం చేసే వరుడు అంటే మా ఊర్లో అదో గొప్పవిషయం. నాకూ కాస్త సంతోషం వేసింది. పెళ్లయ్యాక వెళ్తుంటే ఊరు ఊరంతా కన్నీటి నదిలా తోడొచ్చి మెట్టినింటికి సాగనంపారు. అది ఇప్పటికీ గుర్తే. ఆ ఒక్కరోజే కాదు, ఎప్పుడన్నా పుట్టింటికి వచ్చి తిరిగి వెళ్తుంటే మొదటిసారి వెళ్తున్న ఆవేదనే కనబడుతుంది. ఊరు ఊరంతా ఎప్పటిలాగే వీడ్కోలు పల్కుతుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో పుట్టింటి నుంచి ఎప్పుడు, ఎన్నిసార్లు మెట్టినింటికి వెళ్ళినా అది మొదటిసారి వెళ్ళినట్లే అనిపించడంలో సందేహం లేదు.
మెట్టినింటికి వెళ్లిన మాటే గాని మనుషుల్లో, గదుల్లో తేడాలే కనబడుతున్నాయి గానీ పనుల్లో తేడాలేమీ లేవు. కాకపోతే మరింత పనిభారం అయ్యింది. ఒక్కొక్కరే పిల్లలు పుట్టడం, ఐదుగురు పిల్లలను పెంచుతూ, మొగుడ్ని, అత్త మామలను, అడపడుచులను, మరుదులను చూసుకోవడం. యంత్రంలా మారితే తప్ప అందరికీ అన్నివిధాలా సేవలు చేయలేం. ఈ యంత్రం అప్పటి నుండి ఇప్పటి దాకా నడుస్తూనే ఉంది. ఎటువంటి మార్పు లేదు. ఇంటినిండా పనులొక్కటే కాదు, బతుకుబండి నడవాలంటే కాస్త డబ్బు ఆసరా కావాలి. ఒక్క ఉద్యోగంతో ఇల్లు నడవదు. అందుకే కుట్టుమిషన్‌తో ఉన్న కాస్త సమయాన్ని కాళ్లకు అప్పజెప్పాను. అలా నిరంతరం ఒక యంత్రంలా తిరగాల్సిందే. ఆడదంటే కదిలే ఒక చక్రమని అప్పటికీ, ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాయి మగువల జీవితాలు.
పిల్లలు బడికి వెళ్లాలన్నా, మొగుడు ఉద్యోగానికి వెళ్లాలన్నా, ముసలితనంతో ఉన్న మామగారికి సమయానికి తిండి పెట్టాలన్నా లోకం నిద్ర లేవకముందే ఆడది నిద్రలేవాలి. అన్నీ అందరికీ సమకూర్చాలి. అనుక్షణం ఎవరికో ఒకరికి భయ పడుతూనే కాలం వెళ్లదీయాలి. అలా రోజులు పరుగులు తీస్తున్న కాలంలో పిల్లలకు పెళ్లిళ్లు, వాళ్ళకు పుట్టిన పిల్లలకు సేవలు చేయడం కొంతకాలం సాగింది. కొన్నాళ్ళకు మామగారు మంచం పట్టడం ఆయనకు సపర్యలు చేయడం, ఆయన లోకం వదిలి వెళ్లిపోవడం జరిగింది. మరికొంత కాలం తర్వాత ఈయనగారు పక్షవాతం తో మంచం పట్టడం, పది సంవత్సరాల దాకా వారికి సేవలు చేయడం, తర్వాత ఆయన కాలం చెయ్యడం జరిగింది. ఇంత కాలంలో నేను అనే మనిషిని ఉన్నా ననే ధ్యాస కూడా నాకు లేదు.
ఇలా అరవై ఏళ్లు సాగాక ఇప్పుడు ఊపిరి పీల్చుకోడానికి కాస్త సమయం దొరికింది. ఏదీ పట్టించుకోకుండా ఎగిరే చిన్నప్పటి స్వేచ్ఛ, ఇప్పుడు అన్నీ వదులుకున్నాక, అన్నీ వెళ్ళిపోయాక, రెక్కలు తెగిపోయాక దొరికింది. బహుశా నాలాంటి మహిళామణులకు దొరికే స్వేచ్ఛ ఇలాంటిదేనేమో. లోకంలో తమ ఉనికినే మరిచిపోయేటంత జీవితాన్నిచ్చి, చివరికి అన్నీ అయిపోయాక చివరి కాలంలో లభించిన అరుదైన స్వేచ్ఛ ఇది. గతకాలాన్ని నెమరువేసుకోడానికి దొరికిన అమూల్యమైన స్వేచ్ఛ ఇది. అరవై దాటాక లభించిన అపురూపమైన స్వేచ్ఛ ఇది. అడవిలో మల్లికి అందిన క్షణకాలపు స్వేచ్ఛ ఇది.

- పుట్టి గిరిధర్‌,
9491493170

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.