గాంధీనగర్ : కరోనాతో విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు గడవుతేదీని మే 15వతేదీ వరకు పొడిగిస్తూ సీఎం విజయ్ రూపానీ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, దుకాణాల వారికి కూడా అధిక బిల్లులు విధించమని సీఎం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 43కు చేరుకోవడంతోపాటు ముగ్గురు మరణించిన నేపథ్యంలో సీఎం విద్యుత్ బిల్లుల చెల్లింపును వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm