అమరావతి: కరోనా నివారణకు సామాజిక దూరం చాలా ముఖ్యమని, లేదంటే ఇటలీ మాదిరిగా చాలాప్రమాదం జరిగే అవకాశం ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ చాలా మంది రోడ్ల మీదకు వస్తున్నారని ఆమె చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. ఏపీకి విదేశాల నుంచి 11,800 మంది వచ్చారని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. శానిటైజర్లు లేకున్నా సబ్బుతోనైనా చేతులు కడుక్కోవాలని సుచరిత సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm