Nov 22,2019 11:11PM
హైదరాబాద్: అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్ నటి అన్నపూర్ణ, ఆమె మనవడిగా మాస్టర్ రవితేజ నటించిన తాజా చిత్రం 'అన్నపూర్ణమ్మగారి మనవడు'. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్మెన్నార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్ థియేటర్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడితో పాటు ఆడియో సీడీలను ఆవిష్కరించగా.. తొలి సీడీని మరో అతిథి కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ (దాము) అందుకున్నారు. చిత్ర టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు.