Nov 22,2019 09:57PM
రాజస్థాన్: సాధారణంగా వివాహం జరిగిన తరవాత నూతన వధువును వరుడి ఇంటికి ఎలా తీసుకెళతారు? ఏ కార్లోనో.. బస్సులోనో పంపిస్తారు. కానీ ఇక్కడ ఓ తండ్రి తన కూతురిని అత్తారింటికి హెలికాఫ్టర్లో పంపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాజస్థాన్‌లోని ఝన్‌ఝను జిల్లాకు చెందిన మహేంద్ర సోలాఖ్ తన కుమార్తెను వివాహం అనంతరం అత్తారింటికి వినూత్నంగా పంపాలనుకున్నాడు. దాదాపు ఏడాది పాటు ఆలోచించాక చివరికి ఆమెను హెలికాప్టర్లో పంపాలని నిర్ణయించుకున్నాడు. రెండు నెలల ముందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు కూడా దీనికి అంగీకరించారు. వివాహం అనంతరం నూతన వధూవరులిద్దరూ గ్రామానికి చేరుకునేసరికి పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు నూతన వధూవరులతో పాటు హెలికాప్టర్‌ను చూసేందుకు గుమిగూడారు.