Nov 22,2019 08:55PM
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా శ్రీ కొమురవెళ్లి మల్లన్న దేవాలయంలో రాజగోపుర కుంభాభిశేక పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం కొమురవెళ్లి మల్లన్న గుట్టపై రూ.53లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయ మహా మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన. కింద అతిథి గృహానికి శంకుస్థాపన చేసి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నిర్మాణాలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్షించారు. రూ.30లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తు భవన నిర్మాణంలో 6 గదుల ధర్మశాలను ప్రారంభించారు. అనంతరం రూ.58లక్షలతో నిర్మించిన డార్మిటరీ హాల్-అన్నదాన సత్రం ప్రారంభించారు. అభివృద్ధి నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దు.. తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.