Nov 22,2019 08:17PM
కరీంనగర్: చిగురుమామిడి ఎంపీడీవో కుమారస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. మండల పరిషత్ నిధులు రూ.8 లక్షలు దుర్వినియోగం చేసినట్లు కుమారస్వామిపై ఆరోపణలు వచ్చాయి. నిధుల దుర్వినియోగం నిజమేనని జడ్పీ సీఈవో నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేస్తూ కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ నిర్ణయం తీసుకున్నారు.