Nov 21,2019 07:39PM
లక్ష్మీదేవిపల్లి: మావోయిస్టు పార్టీకి సానుభూతిపరుడైన ఓ వ్యక్తిని గురువారం చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చుంచుపల్లి సీఐ అశోక్ చుంచుపల్లి పీఎస్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమళ్ల అటవీ ప్రాంతంలో ఎస్సై ప్రవీణ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయంలో గట్టుమళ్ల శివారు అటవీ ప్రాంతంలో చేతిలో ఓ వ్యక్తి ఒక సంచిని పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు సదరు వ్యక్తి ఛత్తీస్‌గఢ్ జిల్లా ఉసూర్ కోమటిపల్లికి చెందిన సోడి గంగయ్య అని విచారణలో తెలింది. గంగయ్యా 15 సంవత్సరాల క్రితం గట్టుమళ్ల పంచాయతీ క్రాంతినగర్‌కు వలస వచ్చి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.