ముంబై: బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ తర్వాత టీం ఇండియా వెస్టిండీస్‌తో తలపడనుంది. భారత్‌లో పర్యటించే కరేబియన్ జట్టుతో ఆతిథ్య జట్టు మూడు వన్డేలు, మూడు టీ-20ల్లో తలపడనుంది. ఈ సిరీస్‌లో తలపడే ఆటగాళ్ల వివరాలను బీసీసీఐ గురువారం సాయంత్ర ప్రకటంచింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో అధ్యక్షుడు గంగూలీ నేతృత్వంలో ఇందుకు సంబంధించి సమావేశం జరిగింది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌లతో పాటు.. ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత జట్టు వివరాలను వెల్లడించారు. రెండు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీనే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయంతో వెస్టిండీస్ పర్యటనకు, బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌తో జట్టులో చోటు దక్కించుకున్నాడు.
వన్డే జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్
టీ-20 జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
Nov 21,2019 07:34PM