Nov 21,2019 07:04PM
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లులు గ్రూప్‌ను పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు వచ్చేవి..స్థానికంగా ఆర్థిక అభివృద్ధి జరిగేదన్నారు. జగన్ ప్రభుత్వం తెలివితక్కువ నిర్ణయాల కారణంగా తమ శ్రమంతా వృధా అయిందన్నారు. బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయన్నారు. లులు గ్రూప్‌కి ఇలా జరిగినందుకు ఏపీ ప్రజలు, విశాఖవాసుల తరపున విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.